అవీ, ఇవీ, అన్నీ
ఇదివరకోసారి సణిగానో, వ్రాశానో--ఆ రోజు తిరుపతిలో తన పార్టీ పేరు "ప్రజా రాజ్యం" అని ప్రకటించాక, "అభిమానులారా! కదలండి! రాష్ ట్రం దశదిశలా కుళ్లు రాజకీయాలకి వ్యతిరేకంగా పోరాడండి. అవినీతి యెక్కడ వున్నా టాగోరో/స్టాలినో లెవెల్లో విజృంభించండి! మీరు చెయ్యవలసింది నా ఫలనా "టొల్ ఫ్రీ" నెంబరుకి ఫోను కొట్టడమే! తరవాత సంగతి నేను చూసుకొంటాను. అవసరమైతే "లోక్ సత్తా" కార్యకర్తల సహకారం తీసుకోండి!" అని ఓ పిలుపు ఇస్తే, ఇప్పుడు వై యెస్ ఆర్; జగన్; రోశయ్య; కి కు రె--లాంటి బెడదలు మనకి లేకపోవును!
రాష్ ట్రం కొన్ని వేల కోట్లు నష్టపోకుండా వుండును!
అది జరగలేదు. సరే! చిరంజీవి అప్పటి నుంచీ దిగజారుకుంటూ వస్తూ, చివరికి అవినీతిపుట్ట అయిన కాంగీలో చేరి, తగుదునమ్మా అంటూ బెంగాల్, తమిళనాడులకి ప్రచారం కోసం వెళ్లాడు! అంటే, 2జీ నీ, రాజానీ, కరుణనీ, కనిమొళినీ వగైరాలని సమర్థించినట్టేకదా? మనకి నిరాశ కాకుండా యేమి మిగిలింది?
"ప్రజాస్వామ్యంలో పార్టీలు పుట్టడం, పోవడం సహజమేకానీ, ప్రరాపాను కాంగ్రెస్ లో విలీనం చేసిన తీరు మాత్రం లక్షలాది మందికి వేదనా, నిరాశా మిగిల్చింది. మఖలో పుట్టి పుబ్బలో పోయే ఇలాంటి పార్టీలతో కొత్త రాజకీయం చేయడమంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్టే".....అని!
* * *
వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డీ ఎల్ రవీంద్రారెడ్డి, పోలవరం ప్రాజెక్ట్ పై తాను అడిగే ప్రశ్నలకి (అసలు) సమాధానం (అంటూ) చెపితే, ఆయన (జగన్) కి ముఖ్యమంత్రి పదవి ఇస్తాను....అన్నారు మొన్నెప్పుడో!
"పోలవరం ప్రాజెక్ట్ యే నది మీద కడుతున్నారు? యెక్కడ నిర్మించనున్నారు? పునాది యెవరు యెక్కడవేశారు? స్వతంత్ర భారతదేశంలోనా? బ్రిటిష్ హయాంలోనా? ప్రాజెక్టు సామర్ధ్యం యెన్ని టీఎంసీలూ? విద్యుత్తు వుత్పాదన యెంత? కుడి, యెడమ కాలువలద్వారా యెవరు లబ్ధి పొందుతారు?" అనే ప్రశ్నలు సంధించారు ఆయన!
పదోతరగతి కుర్రాడు సైతం జవాబివ్వగల పై ప్రశ్నలకి, జగన్ 5 లక్షల 45 వేలకిపైగా మెజార్టీతో జవాబిచ్చాడు చాలదా?
* * *
నిన్నో మొన్నో (26-05-2011) "జగన్ విజయవాడలో పోటీ చేస్తే, మా దేవినేని ఉమ 5 లక్షలకి పైగా మెజారిటీతో ఆయన్ని వోడిస్తాడు" అన్నాడో రా నా. (కడపలో వాళ్లే కోట్లు తినాలా? విజయవాడ వాళ్లకి ఆ భాగ్యం యెందుకు కల్పించకూడదు? అని ఆయన వుద్దేశ్యం అయివుంటుంది! యెలాగూ జగనే నెగ్గుతాడని వాడికీ తెలుసు మరి!)
* * *
"నాకు చిర్రెత్తుకొచ్చిందంటే, నా .....వందలకోట్ల ఆస్థినీ అనాధ శరణాలయాలకి రాసేస్తానంతే!" అని బెదిరించాడట వెనకటికోడు తన '......' మంది కొడుకులూ, కూతుళ్లనీ!
తి తి దే రద్దవడంతో, సాధికార మండలి వారు, తమ అధీనం క్రింద వున్న ఆలయాలనన్నింటినీ (తిరుమల తిరుపతి వెంకన్నతో సహా) "పురావస్తు శాఖ" వారికి అప్పగించేస్తామని "తీర్మానమే" చేసేశారు ఇదివరకోసారి!
మొన్న నాలిక్కరుచుకొని, ఆ తీర్మానాన్ని వుపసం హరించుకొన్నారు!
అలా అప్పగిస్తే యేమయి వుండేది?
4 comments:
క్షమించాలి. ఈ మధ్య బొత్తిగా వార్తలు చూడట్లేదు. తి.తి.దే. రద్దయ్యిందా? ఎందుకు? ఎప్పుడు? మరిప్పుడు ఎలా? కొంచెం link ఇచ్చి సహాయం చేయగలరు.
తి.తి.దే. రద్దు కాలేదులెండి.కృష్ణశ్రీ గారి ఉద్దేశ్యం తి.తి.దే.పాలకమండలి రద్దు అయిందని.అంతేకదు మాష్టారూ!
డియర్ Indian Minverva!
నాది పొరపాటే. "బోర్డు" అని వ్రాసిన మాట మిస్సయింది. బోర్డు అంటే ఇదివరకటి--రా నా లు సభ్యులుగా వుండే పాలక మండలి. ఇప్పుడున్నది అధికారులతో యేర్పడిన "సాధికార మండలి."
శ్రధ్ధగా చదివి, వ్యాఖ్యానిస్తున్నందుకు ధన్యవాదాలు.
డియర్ చిలమకూరు వారూ!
మీరన్నది నిజం. మీ వివరణ సరియైనదే.
ధన్యవాదాలు.
Post a Comment