అవీ, ఇవీ, అన్నీ
ఇదివరకోసారి సణిగాననుకుంటా--పోస్టల్ వాళ్లు ఇచ్చే "నివాస ధృవీకరణ" కార్డుల గురించి.
ఇవి క్రితం నెలలోనే అందుబాటులోకి వచ్చేశాయట. రూ.225/- చెల్లించి, సంబంధిత ఆధారాలతో దరఖాస్తు చేస్తే, 10-15 రోజుల్లో ఈ కార్డు ఇచ్చేస్తారట. 3 సంవత్సరాల తరవాత దాన్ని రెన్యువల్ చేయించుకోవాలట. (ఈలోపల చిరునామా మారితే, కొత్త కార్డు తీసుకోవాలని చెప్పఖ్ఖర్లేదు కదా).
ఈ కార్డులు బ్యాంకుల్లోనూ, పోస్టాఫీసుల్లోనూ ఖాతాలు తెరవడానికీ, డ్రైవింగ్ లైసెన్సులు పొందడానికి, విదేశాలకి వెళ్లే సందర్భంలో పాస్ పోర్ట్ పొందడానికి, దూర ప్రాంతాలకీ, తీర్థయాత్రలకీ వెళ్లే వ్యక్తుల ఆచూకీ తెలుసుకోడానికీ--ఇలా అనేకవిధాలుగా వుపయోగిస్తాయట.
మొన్న అన్నాహజారే అహింసామార్గంలో లక్ష్యసిధ్ధి జరగకపోతే, శివాజీ మార్గం అవలంబించ వలసి వస్తుంది అన్నందుకూ, అంతకన్నా యెక్కువగా నరేంద్ర మోడీ బాగా పాలిస్తున్నాడు అన్నందుకూ అనేక విధాలుగా వాపోయినవాళ్లలో ఓ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కూడా వున్నాడు.
ఆయన చెప్పిన వాటిలో "పి చిదంబరం, కపిల్ సిబల్ మరీ అతిగా వ్యవహరిస్తున్నారు. వారి దూకుడుకు ప్రథానమంత్రి ముకుతాడు వేయాలి" అనడం నాకు నచ్చింది.
కానీ, రాజ్యాంగబధ్ధంగా యేర్పడిన "పీ యే సీ" లో సభ్యులు తిరగబడేలా చేసింది మన్మోహనా? సోనియానా? లేక ఇంకెవరైనా తమిళ కోటరీవాళ్లా?
వాళ్లని సమర్థిస్తూ టీవీలకెక్కుతున్న వుండవల్లి అరుణకుమార్లవి నాలుకలా తాటిపట్టెలా?
ఇలాంటివాళ్లకి బుధ్ధి చెప్పడానికి శివాజీ మార్గమైనా సరిపోతుందా?
ఇవన్నీ శేష ప్రశ్నలు.
ఈనాడు వారు "ఒడుదొడుకులు" అని వ్రాస్తున్నారు. నేననుకునేది అది "ఒడిదుడుకులు" అని. తల్లి వొడిలోని పసివాడు దుడుకుగా క్రిందకి జారడానికి ప్రయత్నించడం ఆ తల్లికి ఒడిదుడుకు కాబట్టి. మన తెలుగు బ్లాగర్లేమంటారో?
ఆమధ్య, "కుదుపుల్లేని" దురంతో రైలు పెట్టెలొస్తున్నాయన్నారు. స్వీడన్ నించి దిగుమతి చేసుకున్న "టైట్ లాక్ కపులర్ల"తో అనుసంధానించే పెట్టెలతో ఆ రైలు నడుస్తుందన్నారు. ఆ రైలు ముంబాయి, సికింద్రాబాద్ ల మధ్య నడుపుతారని కూడా అన్నారు.
మరి ఆ దురంతోలు యేమయ్యాయో?
4 comments:
It has been first introduced in Tamilnadu, nearly 2 years back. We can't use postal ID card for applying Passport. They will not accept that.
Venkat
>నివాస ధృవీకరణ
what about aadhar?
పై అన్నోన్ (వెంకట్)!
రెండేళ్ల క్రితం అంటే, అప్పటికి "ఆథార్" ఇంకా మొదలవలేదేమో.
అయినా తమిళనాడు పులిని చూసి, నక్కలు వాతలు పెట్టుకోవాలా?
ఈ వార్త చదువుతూనే, ఈ విషయం ప్రక్కన క్వశ్చన్ మార్క్ పెట్టాను. కానీ, తెలిసీ తెలియకుండా యెందుకని, టపాలో ఆ మార్క్ వెయ్యలేదు. అంతే.
ధన్యవాదాలు.
పై రెండో అన్నోన్!
"ఆథార్" కాకుండానే మరి!
"డజన్లకొద్దీ" కార్డులూ, "యూనిక్" నెంబర్లూ, గురించి యెప్పటినించో సణుగుతూనే వున్నాను. వినలేదా!
లేటెస్ట్ గా "శ్రీసేవ" పేరుతో అందరికీ "యూనిక్" నెంబర్లు కేటాయిస్తారని వార్త!
ధన్యవాదాలు.
Post a Comment