అవీ, ఇవీ, అన్నీ
"ద్వారకా తిరుమలలో......పులిహోరలో బల్లి!" ఓ సంచలన వార్తా, దానిమీద భక్తుల ఆందోళనా, కొన్ని వేల పొట్లాల భూస్థాపితం!
డాక్టర్లు ఆ పులిహోర తిన్నవాళ్లని పరీక్షించారు.....యెవరూ మరణించలేదు.... యెవరికీ అనారోగ్యం కూడా కలగలేదు!
ఐదు దశాబ్దాలుగా హేతువాదులూ, డాక్టర్ సమరం లాంటివాళ్లూ మొత్తుకొంటున్నది "బల్లి విష జంతువు కాదు. అది వుడుకుతున్న యే పదార్థంలో పడినా, ఆ పదార్థం విషపూరితం కాదు. యెక్కువలో యెక్కువగా దాని చర్మం మీద యేమైనా సూక్ష్మజీవులుంటే, అవి ఆ పదార్థంలో చేరవచ్చు. అయినా, వుడుకుతున్నప్పుడు ఆ సూక్ష్మజీవులుకూడా నశిస్తాయి.
కానీ....శాకాహారులకైనా, అలాంటి జంతువులని తినడం అలవాటులేని మాంసాహారులకైనా, సహజంగా వికారం/వెలపరం కలగడం వల్ల వాంతులు రావచ్చు. ఒక్కోసారి, డిహైడ్రేషన్ వల్ల మరణం సంభవించవచ్చు. అదే కప్పలనీ, పాములనీ, మిడతలనీ, చివరికి తీపి పదార్థం మీద పాకుతున్న నల్ల కండ చీమలతో సహా ఆ పదార్థాన్ని నమిలి చప్పరించే చీనా, కొరియా వాళ్ల లాంటివాళ్లకి అదో 'సర్ ప్రైజ్ గిఫ్ట్' లాంటిది......" అని!
యెవరో అన్నారట, ఇది యెవరో కావాలని చేసిందే అని.
శభాష్! వాడేవడో కనిపెట్టండి. వాణ్ని తిరుమల యాత్రచేయించి, శ్రీవారి దర్శనం తరవాత, శేషాద్రి కొండమీదనుంచి లోయలో తోసేసే శిక్ష విధించండి.
(తరవాత జన్మలో బల్లి అయి పుడతాడేమో!)
అందరూ సంతోషిస్తారు.
4 comments:
>ఇది యెవరో కావాలని చేసిందే అని
nijama?
ఉందిగా. మనం ఎప్పుడూ అనే మాటే. కిరస్తానీల కుట్ర!
మొదటి అన్నోన్!
అదేకదా కనిపెట్టమన్నాను.
ధన్యవాదాలు.
రెండో అన్నోన్!
ఇది కూడా కనిపెట్టవలసిన విషయమే కదా?
ధన్యవాదాలు.
Post a Comment