Sunday, December 13, 2009

హేతువాదం

అభిషేకాలు

త్రిమూర్తుల్లో--బ్రహ్మ 'సృష్టి కారుడు ', విష్ణువు 'స్థితి కారుడు ', శివుడు 'లయ కారుడు '!

(ఇక్కడ కారుడు అంటే, ముక్కు కారుడు లాంటి కారడం కాదు--ఫలనా పని చేసేవాడు, లేదా ఫలనాదానికి కారణం అయినవాడు--అని! ఇలాగే 'స్వర్ణకారుడు ', 'చర్మ కారుడు ' లాంటివి!)

శివుడు 'రుద్ర మూర్తి ', పైగా గరళాన్ని మింగాడు! అందుకనే నిత్యం ఆయన నెత్తిమీద నీళ్ళ చుక్కలు పడే యేర్పాటు చేస్తారు--పైగా అభిషేకం పేరుతో, నిత్యం శిరస్నానం చేయిస్తూ వుంటారు!

మరి, ఆంజనేయుడికీ, అంబేద్కర్ కీ, పొట్టి శ్రీరాములుకీ, ఎన్ టీ ఆర్ కీ--చామంతి పూల తోటీ, పాలతోటీ, పంచామృతాలతోటీ అభిషేకాలేమిటి?

ఓ వూరిలో, ఓ చెరువుగట్టున వున్న శివలింగాన్ని ఓ ఆవు నాకితే, చాలా సంతోషిస్తారు. అదే ఓ పంది, తన దురద తీర్చుకోడానికి తన వొంటిని దానికేసి రాసుకోడానికి ప్రయత్నిస్తే, దాన్ని తరిమేస్త్రారా లేదా?

మొన్నా మధ్య 'సిధ్ధాంతం' అనే వూళ్ళో, ఓ పంది ఓ ఆలయం ధ్వజ స్థంభం చుట్టూ ఆగకుండా ప్రదక్షిణాలు చేస్తుంటే, దాన్ని దైవ స్వరూపం గా భావించి, పూజలు చేసేశారు! అంతేగాని దాన్ని గుడిని అపవిత్రం చేసిందని తరిమెయ్యలేదు మరి!

అదే ఇంకో పంది, ఓ మసీదు చుట్టూ అలా ఆగకుండా ప్రదక్షిణాలు చేస్తే, ముసల్మానులు దాన్ని యేమి చేసేవారో?

యెదైనా మన మనసులో వుంది--మన భావనలో వుంది!

యేదో వూళ్ళో యెవరో దుండగులు అంబేద్కర్ విగ్రహం ముఖమ్మీద తారు పూసి, మెళ్ళో చెప్పుల దండవేస్తే, మిగిలిన వూళ్ళలో అయన విగ్రహాలకి పాలతోటీ, పంచామృతాలతోటీ అభిషేకిస్తే--అక్కడ అవమానింపబడిన విగ్రహం పవిత్రమైపోతుందా?

ఓ వూళ్ళో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని అవమానించడం, మిగిలిన చోట్ల ఆ విగ్రహలని పాల తో అభిషేకించడం--ఇవన్నీ ఇలాంటివే!

ఆ పాలనీ, పంచామృతాలనీ, యే ఆంగన్ వాడీలోని పిల్లలకో ఇస్తే, వాళ్ళకి బలవర్ధక ఆహారం అందించినవాళ్ళు అవుతారు కదా?

అలాగే, కూరగాయలతోటి అమ్మవార్లనీ, జొన్నపొత్తులతోటి వినాయకుణ్ణీ, పళ్ళతోటి సాయిబాబాల్నీ అలంకరించేబదులు, వాటిని స్కూళ్ళలో మధ్యాన్న భోజన పధకానికి ఇస్తే, పాపం పిల్లలు చారునీళ్ళుతో భోజనం చేసే అవస్థ తప్పుతుంది కదా?

మొన్నెప్పుడో మన ఉన్నత న్యాయస్థానం 'కూడళ్ళలో విగ్రహలు ప్రతిష్టించడం పై' నిషేధం విధించింది.

ఇప్పుడు, ఇప్పటికే వున్న విగ్రహాలని కూడా, విచక్షణా రహితం గా 'ధ్వంసం' చెయ్యమని ఆర్డరు వేస్తే బాగుండును! దీనివల్ల యెవరికీ నష్టం వుండదు--గమనించండి!

విజయవాడ ఆంధ్రపత్రిక సెంటర్లో వుండే, కొన్ని టన్నుల బరువైన శ్రీ నీలం సంజీవరెడ్డి విగ్రహన్ని, ప్రత్యేకాంధ్ర ఉద్యమం సందర్భం గానే అనుకుంటా, జనాలు పడగొట్టి, కృష్ణ కాలవదాకా ఈడ్చుకెళ్ళి, అందులో పడేశారు!

దీనివల్ల యెవరికైనా యేమైనా నష్టం వచ్చిందా?

అలోచించండి!

Tuesday, December 1, 2009

లాలూ మూర్ఖహ.....


అగ్రేసరీ మమత!

కోచ్ ల కొరత కారణంగానే కొత్త రైళ్ళను నడపడం కష్టం గా మారిందని, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు శ్రీ ఎం ఎస్ జయంత్ అన్నారట.

ఆరువేల కోచ్ లు అవసరం వుండగా, మూడువేలే అందుబాటు లో వున్నాయని చెప్పారట!

రాయ్ బరేలీలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభమైతే, కోచ్ ల కొరత ‘కొంతమేరకు’ తీరనుందట—ఇది ముక్తాయింపు!

(రాయ్ బరేలీ అప్పట్లో ఇందిరాగాంధీ నియోజక వర్గం—ఇప్పుడు సోనియా గాంధీదనుకుంటా! అందుకని ఈ చెక్కభజన అనికూడా అనుకుంటా!)

మొన్నీ మధ్యనే ‘అన్నీ ఏసీ బోగీలు‘ తయారు చేసి ఓ ‘తురంతో’కో, ‘గరీబ్ రథ్’ కో ఇచ్చారని వార్త వచ్చింది! వున్న దురంతోల్లోనూ, గరీబ్ రథ్ లలోనూ 23 నించి 26 శాతం మాత్రమే నిండుతుండగా, ఈ కొత్త, పూర్తి ఏసీ రైలు యెలా కిట్టుబాటవుతుందో మమతకే తెలియాలి.

ఇక మూడు వేల కోచ్ లు అందుబాటులో వున్నాయంటే, బాగా పాడైపోయిన ఓ వంద రైళ్ళకి చెందిన 2300 బోగీలని కొత్తవి వేసేసినా, ఇంకా 700 బోగీలు వుంటాయి—వీటితో ఓ 30 రైళ్ళని ప్రవేశ పెట్టచ్చు కదా?

ఆడలేక మద్దెల ఓడన్నట్టు లేదూ ఈ వ్యవహారం?

కక్కుర్తి బెర్తులు తొలగించిన రైళ్ళలో పై బెర్తుని క్రిందకి దించి, పాత కన్నాల్ని పూడ్చి, కాస్త రంగులైనా వెయ్యడానికి దిక్కు లేదు గానీ, కొత్త రైళ్ళూ, పూర్తి ఏసీ రైళ్ళూ, అవీనట! మీరు దేంతో నవ్వుతారు?

మనం ఇంతకు ముందు చెప్పుకున్న 'రైల్వేలకి చెందిన (అపార) స్థలాలని' 'పబ్లిక్-ప్రైవేట్' భాగస్వామ్యం తో 'అభివృధ్ధి' చేద్దామని ఓ ఆలోచనట! ఇక వాటిని ఆ దేవుడే కాపాడాలేమో!

సంచీ లాభం చిల్లు కూడదీసినట్లు, మేనేజ్ మెంట్ గురు లాలూ డబ్బాకొట్టుకున్న లాభాలని మమత కరగేసి, తను ఇంకో సూపర్ మేనేజ్ మెంట్ గురు అయిపోతుందేమో!

అయినా ఆశ్చర్యం లేదు!

Tuesday, November 24, 2009

చాదస్తాలు

యోగాలూ అవీ

15-11-2009 నాటి ఈనాడు ఆదివారం సంచికలో, 28వ పేజీలో ‘ఇప్పటికింకా మావయసు’ శీర్షిక క్రింద నలుగురు వృధ్ధుల గురించి ఫోటోలతో సహా ప్రచురించారు.

70 యేళ్ళ రాజోదేవీ లోహన్ అనేఆవిడకి, పెళ్ళైన 50 యేళ్ళ నించీ పిల్లలు లేకపోతే, ఢిల్లీలోని సంతాన సాఫల్య కేంద్రం సాయం తో ఇప్పుడు ‘తల్లి’ అయిందట.

తొంభైయేళ్ళ నానూరాం జోగీ మొన్నమొన్ననే నాలుగో భార్య ద్వారా మరో కూతుర్ని కన్నాడట! ఇంతకుముందు ఆయనకి 12 మంది కొడుకులూ, 9 మంది కూతుళ్ళూ వున్నారట. పైగా, వందేళ్ళొచ్చేవరకూ పిల్లల్ని కంటూనే వుంటానన్నాడట!

ఇక 80 యేళ్ళ వయసులో కూడా డిజైనర్ డ్రెస్సులూ అవీ వేసుకొని, ‘క్యాట్ వాక్’ చేస్తోందట ఒకావిడ. అంతేకాదు, ప్రపంచం లోనే అతిపెద్ద వయస్కురాలైన మోడల్ గా రికార్డులకి యెక్కిందట!

ఇక నాలుగో ఆయన (ఫోటోల్లోనూ, పేజీలోనూ ఈయనే మొదటివాడుగా ప్రచురింపబడ్డాడు—నేనే ఆఖరికి గెంటేశాను) 90 యేళ్ళ—ప్రపంచంలోనే అత్యంత వృధ్ధుడైన యోగా గురువుట. ఈయనపేరుమీద, ఆయన తరహా శిక్షణకి ‘అయ్యంగార్ యోగా’ అంటున్నారట. ఆయన వ్రాసిన పుస్తకం 18 భాషల్లోకి అనువాదం అయ్యిందట. ఇంకా, ఆయనవల్లే ‘అయ్యంగార్’ అనే పదం ఆక్స్ ఫర్డ్ డిక్ష్ నరీలో చోటుచేసుకొందట.

అదే కథనం లో భాగం గా, మహిళల్లో ఆ ఘనత వహించిన ఇంకో ఆవిడ గురించి వ్రాశారు—ఆవిడ వయసు 83 యేళ్ళట. ఇందులో కొసమెరుపేమిటంటే, ఆవిడదగ్గర శిక్షణ పొందినవాళ్ళు చాలామంది ‘యోగా ట్రైనర్లుగా’ ఉపాధి పొందుతున్నారట!

నా పాయింటేమిటంటే, మొదట చెప్పిన మూగ్గురికీ ఈ యోగాలూ అవీ తెలిసినట్టుగానీ, వాళ్ళు అవి సాధన చేసినట్టుగానీ, దాఖలాలు లేవు! (యెందుకంటే వాళ్ళలో కనీసం ఇద్దరు—మనదేశం లోని వాళ్ళు నిరక్షరాస్యులు!) పైగా, యోగా నేర్చుకున్నవాళ్ళు ‘ఉపాధి పొందడానికే’ దాన్ని వుపయోగించుకుంటున్నారు! అని.

మీరేమంటారు?


Friday, November 13, 2009

సంవాదం--6

నార, మంగేష్ లతో
సంవాదం ముగించే ముందు, 'నార' లాంటివాళ్ళకి కనువిప్పుగా మంగేష్ గారి బ్లాగు నించి కొన్ని--(దయచేసి నేను వారిని విమర్శిస్తున్నాను అని మాత్రం అనుకోవద్దు!)

వారి టపా పై ఒకరి ప్రశ్న, వారి జవాబు:

subrahmanyam said...

Dear Guru Bandhu,

Many thanks for sharing the great teachings of the Masters. Could you please mention the source also, like name of the book, so that it would be possible for the interested readers to get more details.

Regards,
Subrahmanyam.
October 6, 2009 5:25 AM

Mangesh said...

Dear Subrahmanyam,

Thanks for your comment. I frequently listen Master K.Parvati Kumar's and Master EK's lectures and noting interested and important points and then writing these posts. If you are interested you can listen them by registering yourself in http://www.masters-call.net/.

Thanks
Mangesh
October 6, 2009 5:01 PM

(వాక్యాలు అండర్ లైన్ చేసింది నేను--పాఠకులు సత్యం గ్రహిస్తారని. నిజానికి ఆ మాస్టర్ల గురించి నేనెప్పుడూ విని వుండలేదు! శ్రీ జిడ్డు కృష్ణమూర్తి తత్వం అయినా బోధపడుతుందేమో కాస్త కష్ట పడితే--కానీ వీళ్ళు చెప్పినది యెవరికీ అర్థం అయ్యేట్టు వుండదు.)
మనం సామాన్యం గా యెవరైనా ఒక విషయం లో యెక్కువ నైపుణ్యాన్ని సాధిస్తే, అది వారి 'ప్రఙ్ఞ ' అంటాము.

మరి మంగేష్ చెపుతున్న మాస్టర్లు 'త్రిగుణ ప్రజ్ఞలు మూడును (ద్రవ్య రూపము, దేవతా ప్రజ్ఞలు, క్రియా రూపమైన ప్రజ్ఞలు) జీవునికి ఆశ్రయములుగా పనిచేయుచున్నవి.' అంటారు. 'నిద్ర లేవంగానే మనము దైవము ఒడిలోనుండి వచ్చాము అని గుర్తు వుండదు. అది ఒక ఆవరణ. అది సంకర్షణ వ్యూహము.' అంటారు. '...........మూడు బంధముల వల్లనూ మూడు ఆవరణలు ఏర్పడి మూడు శరీరములు ఏర్పడతాయి............అదే స్థూల శరీరము.........' ఇలా అందరికీ నాలుగో యెన్నో స్థూల శరీరాలు వుంటాయంటారు వీరు!

(నార! గమనించావా? నేను జీవుడు అంటేనే, నీకు 'TrAsh' అనిపించింది--ఇవన్నీ చదివితే ఇంకేమంటావో?--బహుశా--'బుల్ డంగ్', 'హార్స్ షిట్', "డైనొసార్స్ నైట్ సాయిల్", 'షిట్ హిట్టింగ్ ది ఫాన్ ' అంటారేమో!)

ఇంకా 'సప్త ఋషులు' అంటూ కొన్ని పేర్లూ, వారి లక్షణాలూ చెప్పారు. వారికి మరేమైనా పేర్లు వున్నాయేమో--అవి కూదా ఇస్తే బాగుండేది--యెందుకంటే, 'పులిసే వాడు' మొదలైనవాళ్ళు సామాన్యులకి తెలియరుగా? సామాన్యులకి తెలిసిన సప్త ఋషుల పేర్లు వేరు. ఇంకా ఆకాశం లో మనక కనిపించే సప్త ఋషి మండలం లో నక్షత్రాలని--యేనక్షత్రం యే ఋషో చెపితే ఇంకా బాగుండేది! కాదంటారా?

ఇంకా చాలా వున్నాయి--స్వయం గా చదవండి--లింక్ కావాలంటే, నా టపాలమీద ఆయన కామెంట్లలో దొచుకుతుంది మీకు!

ఇంకో ముఖ్యమైన సంగతి--భవబంధాలు వీడి, సన్యాసం పుచ్చుకొనేవారు--'జంధ్యాలు తెంపుకొని' స్వీకరిస్తారు! వారిక 'గాయత్రి' ని అనుష్టించరు. గాయత్రి గొప్పతనాన్ని కీర్తించరు! ఆత్మానందం కోసం అన్వేషించి, ఆ అలౌకిక ఆనందానుభూతిని అనుభవిస్తూ శేష జీవితాలని (కొన్ని వందల యేళ్ళు కావచ్చు) గడుపుతారు! పుష్కరాల సందర్భం లో నగ్నంగా ప్రత్యక్షమయ్యే 'యోగులు' వాళ్ళు--నిజమైన సర్వ సంగ పరిత్యాగులు--అంతేగానీ--ఆశ్రమాలు స్థాపించి, వెర్రి వెర్రి ఉపన్యాసాలూ, హావభావ ప్రకటనలూ, కొండొకచో గానాలూ, వాయిద్య వాదనలూ చేస్తూ, డబ్బు సంపాదనలో మునిగి తేలడానికి అక్రమాలకి సైతం వెనుకాడనివారు--సన్యాసులు కాదు--గురువులు అంతకంటే కాదు!

(ఇక మన తెలుగులో 'పుంజాలు తెంపుకుని' పారిపోవడం అనేదొకటుంది. మాట వినని గొడ్లని, నాలుగు కాళ్ళకీ నాలుగు పొడవాటి త్రాళ్ళు కట్టి, నాలుగు పక్కలా నాలుగు గుంజలకి కట్టేవారు! అవీ 'పుంజాలు' అంటే. పుంజా లేదా పుంజీ అంటే నాలుగు అని అర్థం. ఈ విధంగా ఆ గొడ్డుకి తను బంధించబడ్డానని అనిపించకుండానే, యేపక్కకి కొంత దూరం వెళ్ళినా, ఇంకో పక్క త్రాడు బిగిస్తుంది! దాన్ని అంతకన్నా యెక్కువ ఆ వైపు కదలకుండా చేస్తుంది! ఇక వాటికి--విపరీతమైన భయం వేస్తే మాత్రం, ఆ పుంజాలు తెంపుకుని పారిపోయేవి! ఈ ప్రయోగాన్ని మన ఇదివరకటి కథల్లో, సాహిత్యం లోనూ, బాపు కార్టూనుల్లోనూ చూస్తాం!)
దీంతో, న్యాయ మూర్తులైన పాఠక దేవుళ్ళ ముందు నా వాదనని ముగిస్తున్నాను.

తీర్పు యేమైనా, శిరసావహిస్తాను!

ఇక మీ ఇష్టం.



Wednesday, November 11, 2009

సంవాదం--5


నార, మంగేష్ లతో

అక్కడితో మా సంవాదానికి 'ఫుల్ స్టాప్' అనుకున్నాను!

అప్పుడు ప్రవేశించాడు, 'నార '.

నేను 'సంవాదం' టపాలకి ముందు--అర్థంపర్థంలేని వ్యాఖ్యలు అని వ్రాసిన టపాలో చెప్పిన అన్ని అవలక్షణాలూ వున్నాయి ఈయనకి!

నేను ఆత్మ గురించి వ్రాయగానే,

Nara said...
ఇది నిజం అనటానికి ఆథారాలు ఎమైనా వున్నాయా? ఆథారాలు లేకుండా దాన్ని ఎలా నమ్మటం?

--అని వ్యాఖ్య!

నేను,--'ఆధారాలు' అంటూ వ్రాశారంటే, మీరు నా ముందు టపా చదవలేదు అని తెలుస్తూంది. అందులో ముందే వ్రాశాను 'గరుడ పురాణం' అని!

వెంటనే అది సంపాదించి చదవడానికి ప్రయత్నించకండి! దాని పేరు సైతం తలవడం ఆశుభం గా భావించేవాళ్ళున్నారు!

అయినా నేను ముందునించీ చెపుతున్నాను--మనం నమ్మినా, నమ్మకపోయినా, ఇవన్నీ మన సంస్కృతిలో భాగమని!

చదువుతూ వుండండి!--అని సమాధానం ఇచ్చాను.

మధ్యలో 'పవన్' సమాధానం ఇచ్చారుగానీ, స్వయం గా నేను కలగజేసుకోడంతో అనుకుంటా, తరవాత వూరుకున్నారు.

మళ్ళీ, నార,--'మీరే మీ హేతువాదం బ్లాగులో అవెందుకు, ఇవెందుకు, అంతా వేలం వెర్రులు, శాస్త్రాలు, యోగాలు, అవసరమా అని వ్రాసారు. అలాంటప్పుడు వీటిని ఎలా నమ్మటం? అందుకనే ఆథారాలు వున్నాయా అన్నాను.........గరుడపురాణం ఎవరైనా చనిపోయినప్పుడు చదువుతారు...........అప్పుడే ఎందుకు చదువుతారు?........చదివితే అశుభం ఎలా అవుతుంది. మీరు చదవుతూ వుండండి అన్నారు. నేను రెండు, మూడు సార్లు చదివాను.'

(నేను వ్రాసింది, నా తరవాత టపాలు చదివితే మంచిదని! పాపం ఈయనకి అది కూడా అర్థం కాలేదు.....వారి బొంద!)

'......... జీవుడు (ఆత్మ) శరీరాన్ని అంటిపెట్టుకొనే వుంటాడట." అని చెప్పారు.........భువర్లోకము అంటే ఏమిటి? అది ఎక్కడ వుంటుంది?........' అంటూ వ్రాశారు.

తీరా ఆయన వివరాలు చూద్దామని ప్రయత్నిస్తే, 'profile not available'!

అందుకే, "నేను వ్రాసేవాటికీ--నేను చదివి, విని, చెప్పాలనుకున్నవాటికీ తేడా గ్రహించలేని వాళ్ళకీ, ముఖ్యంగా ముక్కూ మొహం లేని నారలూ, పీచులూ లాంటివాళ్ళకీ సమాధానం ఇచ్చి నా సమయం వృధా చేసుకోలేను!

క్షంతవ్యుణ్ణి!........" అని వ్రాశాను.

అక్కణ్ణించి, యెలా రెచ్చిపోయాడో చూడండి --'సమాధానము చెప్పలేనప్పుడు ఇలాంటి బూటకపు రాతలు రాయవద్దు. మిమ్మల్ని ఎవడు రాసి ఏడవమన్నాడు. నీకు వయసే తప్ప బుద్ది పెరగలేదు. నువ్వు రాసిన దానిని వివరణ అడిగితే చెప్పలేని అసమర్థుడవని అర్థమైనది. నిన్ను క్షమించవలసిన పనిలేదు. అంతా నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.'

అని వాగి, తన మిత్రులకి--'అర్థమైనదిగా. ఎవరైనా వివరణ అడిగితే తిడతాడు. జాగ్రత్త. ఎదుటి వాళ్ళను గౌరవించలేని వాడు ఎవడో గ్రహించండి. ఈయన బుద్దికి తోచినది రాస్తాడు. అదేమిటంటే నీలాంటి వాడికి సమాథానము ఇచ్చి నా సమయం వృథా చేసుకోను అంటాడు. ఇక మీరే అర్థం చేసుకోండి. అంటే ఈయన రాసింది గుడ్డిగా చదవాలి. అందుండి ఏమైనా ప్రశ్న వస్తే తిరిగి చెప్పలేడు. పాపం. ఇలాంటివి చదివి మీ సమయం వృథా చేసుకోకండి. అనవసరంగా మాట పడాల్సి వస్తుంది.'

అని సలహా కూడా ఇచ్చారు!

అంతవరకే అయినా ఓ రకం గా వుండును--కానీ, ఈయనకి మంగేష్ వత్తాసు పలుకుతూ, 'చాలా బాగా చెప్పారు. అయన ఏదో రాస్తారు.. కానీ సందేహములను తీర్చలేరు. అవి తీర్చలేకే విసుగు చెందుతూ వుంటారు.........మీకు కలిగిన సందేహాలు నాకు బాగా నచ్చాయి. ఎక్కడైనా సమాధానములు దొరికితే ఇక్కడ తెలియ పరచండి.'

అని వ్రాశారు!

మళ్ళీ, నార, 'మీ మద్య జరిగినవి చూసాను. అవి చదివాక మీరు చెప్పినది నిజమే అనిపించినది.

ముక్కు మొహం లేనివాళ్ళకి అంటారు ఈయన.. అంటే కృష్ణశ్రీ గారికి తెలియని వాళ్ళెవరు కూడా ఈ బ్లాగు చదవకుడదేమో?...........అహ.. ఓహో అనేవాళ్ళు మాత్రమే చదవాలి అని బ్లాగులో చెప్పండి.' అన్నారు.

ఇలా తానా అంటే తందానా అనుకున్నారిద్దరూ!

నేను పాఠక దేవుళ్ళముందు ఇదంతా బయటపెట్టడం మొదలుపెట్టగానే, పాపం మంగేష్--

నన్ను మనస్పూర్తిగా క్షమించండి. ఇంకెప్పుడూ మీలాంటి పెద్దలను బాధ పెట్టను.
October 13, 2009 10:18 AM
అని వ్రాశారు.

వెంటనే ఆయనకి 'మనలో మనకి క్షమాపణలు వద్దు! కొంచెమైనా అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి--చాలు!'

అని జవాబు వ్రాశాను!

మరి నార కి ఇంకా ఙ్ఞానోదయం అయినట్టులేదు!



Saturday, November 7, 2009

సంవాదం-4

నార, మంగేష్ లతో
తరవాత నా సమాధానం లో "అదుగో! మళ్ళీ విమర్శిస్తున్నానంటున్నారు! 'గాయత్రి గుర్తుకొచ్చినప్పుడల్లా.........' అని మీరంటే, అది కాదు మీ perception ముఖ్యం అన్నానని మరిచిపోతే యెలా? రెండుసార్లు వాడినా, '.......లాంటి వాళ్ళు ' అని అందర్నీ అన్నాను--మిమ్మల్ని ప్రత్యేకించలేదే?.............యోగాలూ వగైరాలవల్ల యేదో వుంటుందని విపరీత ప్రచారం చేసేవాళ్ళు సమాధానం చెప్పవలసే వుంటుంది--లేదా ప్రచారం మానుకోవాలి! 'యెందుకు' అనే ప్రశ్నే లేకపోతే, ఇప్పటి సమాజ వునికే లేదు! అది హాని చేస్తోందన్నారంటే.....!" అని వ్రాశాను.

దానికి ఆయన 'ఇంకొకరిని ఒకనితో పోలిస్తే ఇద్దరూ ఒకటనే కదా?........ఎవరికి సమాథానము చెప్పాలి? వారు చెప్పినది కరెక్టే అని ఎవరు నిర్ణయిస్తారు? అవతలి వారు చెప్పినది నిజం అని చెప్పాలంటే ప్రశ్నించినవానికి తెలిసి వుండాలి కదా? తెలినప్పుడు ఎవరు ఏది చెప్పినా తప్పే అని పిస్తుంది.............. యెందుకు అనే ప్రశ్న యెందుకు వేసుకోవాలి? ఎవరు వేసుకోవాలి? ఎవరికి వేయాలి? జవాబును ఎవరు నిర్ణయిస్తారు? నేను ఎవరు? యెందుకు ఇలా వున్నాను అనేదే నిజమైన ప్రశ్న. దాని జవాబు కొరకు ప్రయత్నించాలి. అంతే కాని ప్రపంచము ఇలా యెందుకు వుంది అంటే అది అంతె.. జవాబు దొరకదు.. వెతకటమే మిగులుతుంది. హాని అంటే నిర్వచనమేమిటి? అది ఎవరికి చేస్తుంది? ఎవరు చేస్తారు? యోగాలు వగైరాల వల్ల హాని ఎలా జరుగుతుంది? అసలు యోగం అంటే నిజమైన అర్థము ఏమిటి?' అన్నారు.

యెంతబాగున్నాయో కదా ప్రశ్నలు! వాటికి సమాధానాలెవరికైనా తెలుసా?

ఈ లోపల నా మరో బ్లాగులో 'ఆత్మ ' గురించి వ్రాస్తే, వెంటనే దానికి ఆయన కామెంట్: 'ఆత్మ గురించి కొంచము రాస్తే బాగుంటుంది అన్నారు. మరి ఎమీ రాయలేదే? నేను, మా మాస్టరు ఎదో గజిబిజి చేశాము అన్నారేగాని, మీరు ఏమీ చెప్పలేదే? ఎందుకనో ఒక్కసారి ఆలోచించండి? చూసిందే నమ్ముతాను అంటే దేన్ని కూడా నమ్మలేము........మనకు అర్థము కాలేదు కాబట్టి లేదు అని, అంతా తప్పు అని అనకూడదు, అనుకోకూడదు. అనంత విశ్వములో మన భూమి అణువంత. దాన్ని ఆశ్రయించి వున్న మనము ఎంత వుంటామో ఒక్కసారి ఊహించండి. అలాగే మనకు తెలిసిన జ్ఞానము కూడ. శరీరములో నుండి బయటకు వెళ్ళి మళ్ళి శరీరము లోనికి వచ్చిన వారు ఉన్నారు. దాన్ని చక్కగా వివరించిన వారూ వున్నారు.................' అని వ్రాశారు.

దానికి నా సమాధానం "ఆత్మ గురించి వ్రాద్దామనుకుని, ఈనాడు వ్యాసం గురించి ముగించబట్టి 'ఆత్మ గురించి మరోసారి ' అని వ్రాశాను కదా! మీరన్న ఆఖరి వాక్యాన్నే కదా నాటపాలో నేను వ్రాసింది? ఇక నేను 'చూసిందే నమ్మడం....' లాంటి వాటి గురించి యేమీ వ్రాయలేదే! శరీరం లోంచి బయటికి వెళ్ళడం అంటే మరణమే! మళ్ళీ శరీరం లోకి వచ్చి, చక్కగా వివరించారు అంటే నేను నమ్మను. మీరుమాత్రం యెందుకు నమ్ముతారు? దాఖలాలెందుకు చూపించరు--మీరని కాదు--ఇలాంటివి వ్రాసేవాళ్ళూ, ప్రచారం చేసేవాళ్ళూ?" అని వ్రాశాను.

మళ్ళీ ఆయన,'Please search for Death Experiences in Google then you will get many links and from there you can get more information. It is our bad luck that we don't believe our scriptures, but if the same thing is explained by foreigners then we believe with surprise face. I hope the articles from Google can make you to believe.' అన్నారు.

నేను, 'You seem to be much influenced by 'tabloids' like our erstwhile 'Blitz' and not to know, death Experiences are different from 'actual death'! All stories I have heard and read in my last 45 to 50 years are simply 'trash'! Why should I search for more trash? If you believe to have any concrete information, please don't hesitate to send me the link, so that I can try to find out the truth in their claims! Please also don't mix up 'scriptures', 'explained by foreigners' etc. with the subject we are concerned with at present.' అని వ్రాశాను.

ఆయన మళ్ళీ,'You are a fixed man not flexible.' అంటే, నేను, "మీరు చిన్నవయసులోనే fixed అయిపోవడం 'ముదావహం'" అన్నాను.

ఆయన సమాధానం, 'You are right and accept your comment. I am fixed and very much fixed but at the same time I am flexible also.........TRUTH is like two sides of coin. Single side of coin never become full coin.................I tried to give more information reg. the Light of GAYATRI. But you mis-understood and unable to go thru the TRUTH.' అంటూ వ్రాశారు.

దానికి నేను, 'In any matter, there is one and only one absolute Truth. It has no two sides! Our sages and mahatmaas tried and succeeded to find that. So, you stick on to whatever you feel is the truth, while I proceed to find out the absolute truth!' అని వ్రాశాను.

ఆయన మళ్ళీ, 'నేను చెప్పిన two sides ద్వందములు. వెలుగు -చీకటి, ఆడ -మగ, సుఖము - దుఃఖము, కష్టము - నష్టము, పగలు - రాత్రి, ఉత్తరాయనము - దక్షిణాయనము, ధన (+ve) - ఋణ (-ve) .... మొదలగునవి అన్నీ కలిపి సత్యము..............దేవుడు ఎంత నిజమో దెయ్యము కూడా అంతే నిజము.........చనిపోయినంత మాత్రాన వాడు లేడు అనుకోకూడదు. లేకుండా మళ్ళీ ఎలా వస్తాడు. మనందరము అలా వచ్చినవాళ్ళమే కదా? సమన్వయాత్మకంగా చూచినప్పుడే పూర్ణత్వము అందుతుంది అని నా భావన' (ఈ వాక్యం నేను అండర్ లైన్ చేశాను--యెందుకంటే, ఈ మహానుభావుడు, నారని సపోర్ట్ చేస్తూ, 'మీకు వచ్చిన సందేహాలు నాకు బాగా నచ్చాయి ' అనివ్రాశాడు మరి!)

దానికి నేను, 'మళ్ళీ మొదటికే వచ్చి, 'దేవుడు యెంత నిజమో, దెయ్యం కూడా అంతే నిజము' అని వొప్పుకున్నారుకదా? మరి 'మంత్రాలు' మంచిని చేస్తే, వాటిని ఇష్టం వచ్చినట్టు వాగితే బెడిసికొడతాయని కూడా నమ్ముతారా, నమ్మరా? దీనికి అవును--కాదు అని సమాధానం చెప్పలేకపోతే, మీది అనవసర వాదన అని నిరూపింపబడుతుంది! అవునా? కాదా?' అని అడిగాను! దానికి ఆయన యెంత చిత్రంగా సమాధానం చెప్పరో చూశారా? 'ఎవరికి బెడిసి కొడతాయి? దానిని బట్టి అవునో-కాదో చెబుతాను.'--ఇదీ ఆయన వ్రాత!

(దీనికి నేను 'మాతాతకి ' అనో, 'విశ్వామితృడికి ' అనో సమాధానం ఇచ్చి వుంటే, ఆయన సంతోషించి, 'హ హ హా! కొట్టవు!' అనేవారేమో!) దానికి నా సమాధానం--'తేలిపోయిందికదా--మీరు సమాధానం చెప్పరని! పైగా అమాయకం గా యెదురు ప్రశ్నలు వేస్తారని! వాదనకోసమే వాదించే వాళ్ళతో నా సమయం వృధా చెయ్యదలుచుకోలేదు! నమస్కారం! (నా తెలుగు రాడికల్ లోని మీ వాదనకి కూడా ఇదే నా సమాధానం అని గ్రహించండి!)'.....అని. అప్పటిక్కూడా, ఆయన మళ్ళీ, 'నేను కూడా అదే అనుకుంటున్నాను. నాప్రశ్న మీకు పూర్తిగా అర్ధం కాలేదు అని.. మీ దగ్గర సమాధానం లేదు అని. సమాధానం లేనప్పుడే ఎదుటి వాళ్ళది వాదన అనిపిస్తుంది. ఫరవాలేదు.. మీ సమయం వృధా చేసుకోకండి... తెలిసినప్పుడే చెప్పండి.' అని. (ఇదికూడా నేనే అండర్ లైన్ చేశాను.....నేను దేనికి సమాధానం తెలుసుకోవాలో.....ఆయనకి చెప్పాలో--కనీసం మీలో యెవరైనా తెలియచెపుతారేమోనని!)

ఇవండీ ఆయన డొంక తిరుగుడు వ్యాఖ్యలు; ప్రశ్నలు, సమాధానాలు!

Monday, November 2, 2009

సంవాదం-3



నార, మంగేష్ లతో

తరవాత ఆయన వ్రాసినది--

"గాయత్రి గురించి నా perception మీకు ఎందుకు నచ్చలేదు. నచ్చక పోవటానికి ఏమైనా ఆథారాలు వున్నాయా? నాకు ఆనందాన్ని ఇచ్చిన దాన్ని ఇంకొంత మందికి పంచే ప్రయత్నము చేశాను. అంతే కానీ అందులో వున్నది సరికాదు అని ఎలా చెప్ప గలరు. చాలా సందర్బములలో నేను వ్రాసిన గాయత్రి టపా గురించి మీరు చాలా వ్యంగముగా విమర్శించారు. అది ఎంత వరకు సబబు. ఎవరి దర్శనము వారిది కదా? అందులో కూడా సత్యము వున్నదని మీకు ఎందుకు అనిపించలేదు. అది అవగాహానా లోపమే కదా? కుండలినికి గాయత్రికు ముడి పెట్టి అన్నారు. సమస్త యోగములకు కూడా గాయత్రే మూలము. అందువల్ల దాన్ని దేన్తో ముడి వేసినా తప్పు లేదు. అన్నీ అందులో నుండి వచ్చినవే.. అందులోనికి వెళ్ళి పోయేవే...

ఇంకా.....

"వేలంవెఱ్ఱుల్ని ప్రోత్నహించమని చెప్పటం లేదు. కోటి విద్యలు కూటి కొరకే కదా? ఎవరు ఎన్ని చేసినా పొట్ట నింపుకోటానికే కదా? ఇక వ్యాపారం అంటారా! అది వారి వారి సంస్కారము బట్టి వుంటుంది. చేసే పని, చెప్పే మాట అన్నీ కూడా ఆ వ్యక్తికి వున్న అవగాహనను తెలియచేస్తాయి. వ్యక్తిలోని అపరిపూర్ణతే అతని చేత కర్మలు చేయిస్తుంది. అది పూర్తి అయితే దాని వైపు వెళ్ళడు. ఇది అందరికి వర్తిస్తుంది. దీనికి ఎవరూ అతీతులు కారు. ఇతరులకు ఏరకంగా కూడా హాని చేయకుండా జీవనము కోసము ఏ పని ఐనా చెయ్య వచ్చును. అంతఃకరణ శుద్ది వుండాలి."

అర్థ సందర్భాలేమైనా బోధపడ్డాయా?

ఆయనకి నేనిచ్చిన సమాధానం....

"Perception--అంటే, మళ్ళీ--'గాయత్రిగురించి నా ' అంటారు!

నేను మీ 'గాయత్రి టపాని ' వ్యంగ్యం గా విమర్శించానంటారు! (యెప్పుడో యెక్కడో మీకే తెలియాలి!)

'........ముడివెయ్యడం' తప్పనలేదు--యేమైనా సాధించారా? అన్నాను!

'ఇతరులకి హాని చెయ్యకుండా........'--నిజం! కానీ వేలంవెఱ్ఱులు సమాజానికి హాని చేస్తున్నాయే!

నా వుద్దేశ్యంలో మీ perception కి ఇవే దాఖలాలు!"

దానికి మళ్ళీ ఆయన....

"మీరు విమర్శించినది "నా" perception నే కదా? కాబట్టి గాయత్రి గురించి "నా" అన్నాను..........."

"వేలం వెఱ్ఱులు సమాజానికి హాని చేస్తున్నాయి అన్నారు. అవి మాత్రమే చేసున్నాయా?.........ఏదీ అనవసరముగా లేదు. దాన్ని ఎలా వాడుకోవాలో తెలియనప్పుడు అది అవసరము లేదు. పనికి మాలినది.. అందరూ ఎమిటో .... వెఱ్ఱి అని పిస్తుంది. తెలిసినప్పుడు ఏది ఎందుకు వుపయోగపడుతుందో తెలుస్తుంది. సృష్టిలో అనవసరమైనది ఏమీ లేదు. దానియందు అవగాహనా లోపము వల్ల మనకు అనవసరం అని పిస్తుంది. ఆలోచించండి..."

దీనికైనా అర్థ సందర్భాలేమైనా బోధపడ్డాయా?

Wednesday, October 21, 2009

సంవాదం-2

నార, మంగేష్ లతో

చదివి--"అవును. విశ్వామిత్ర మహర్షి సమస్త మానవాళికే కాదు ప్రకృతిలో వున్న అన్ని జీవులకూ ఇచ్చాడు! గ్రహించే ఙ్ఞానం వున్నవాళ్ళే అనుష్ఠించారు! మిమ్మల్ని ‘అధికారికం గా’ చెప్పమన్నాను గానీ ‘జీ వో’ చూపించమనలేదు! ఆవిషయం యెక్కడో అక్కడ చెప్పబడో, వ్రాయబడో వుండాలికదా? అది వినో, చదువుకొనో మీరు ఆ విషయం తెలుసుకుని వుండాలికదా? అదే చెప్పమన్నాను—అంతే! చెప్పగలిగితేనే చెప్పండి—లేకపోతే లేదు అనుకుంటాము!

'............పండితుల్ని కాక…అంటే? సద్గురువులంటే యెవరు? తెల్లగడ్డాలు, మీసాలు పెంచుకొని, నెత్తికీ, ఒంటికీ కాషాయ రంగు గుడ్డలని కట్టుకొని, ‘భగవంతుడు అంటే భగం వున్నవాడు’ ‘నేను నా సంగీతం తో, వాయిద్యం తో మీ రోగాలన్నీ నశింపచేసి, మోక్షాన్ని ఇస్తాను’—ఇలాంటి పిచ్చి వుపన్యాసాలిచ్చేవాళ్ళా?

ఇక ‘పరిమిషన్’ సంగతి—నాటపాలోనే వ్రాశాను—ఒకటి నమ్మితే, రెండోది నమ్మాలి—అని! ఇక మీ యిష్టం, చదివే, పాడే వాళ్ళిష్టం!

అని నా సమాధానం లో వ్రాశాను!

దీనికి మంగేష్ కామెంట్: Mangesh said...

చాలా సంతోషం. మీ టపాలు చదివాక నాకు అర్థమైనది ఒక్కటే. మీకు దేనిమీద నమ్మకం లేదు. ఉన్నది అనుకుంటున్నారు. సర్వము తెలుసు అనుకుంటున్నారు. ఎవరికైనా తెలియవలసినది చాలా వుంటుంది. తెలిసినది చాలా తక్కువ వుంటుంది. ఆ రెండూ కలిపితేనే పూర్ణమైన సత్యమవుతుంది. తప్పక మీకు గాయత్రి అనుగ్రహము కలగాలి అని ప్రార్థన చేస్తాను. అది వెలిగితే వున్న చీకటి తొలగిపొతుంది. సత్యము భోధ పడుతుంది. ఇదే నా చివరి కామెంట్. ఎందుకంటే ఎంత చెప్పినా ఉపయోగము లేదు కనుక. నా సమయము వృధా చేసుకోను.

మళ్ళీ నేను అన్నది--"నిజంగా నాకు దేనిమీదా నమ్మకం లేదు--వున్నది అనుకుంటున్నానని మీకు యెందుకు అనిపించిందో మరి! సర్వమూ తెలుసని నేనెప్పుడూ అనుకోలేదు--అనలేదు! అందరికీ అన్నీ తెలియవు--ఆ అవసరం కూడా లేదు.

ఐన్ స్టైన్ తన పెంపుడుపిల్లి తన ఇంట్లో అన్నిగదుల్లోకీ స్వేచగా తిరగాలని, తలుపులకి అది దూరగలిగేంత కన్నాలు పెట్టించాడట. ఆ పిల్లి ఒకేసారి యేడు పిల్లల్ని పెట్టగానే, అన్ని తలుపులకీ, తల్లి కోసం పెట్టించిన కన్నం పక్కన యేడు చిన్న చిన్న కన్నాలు పెట్టాడట!

దితి, 'ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలి ' అని హోమం చేస్తుంటే, ఇంద్రుడు వెళ్ళి సరస్వతీదేవి కాళ్ళమీద పడితే, ఆవిడ దితి నోటిలో ప్రవేశించి, నాలుక తడబడేట్టు చేసి, 'ఇంద్రుడు చేతిలో చచ్చే కొడుకు కావాలి ' అనిపించిందట! పర్యవసానం అందరికీ తెలుసు కదా? ఇదైనా నమ్ముతారా?

మనిషన్నవాడు ఆమరణాంతం 'నేర్చుకుంటూనే' వుంటాడని నమ్మేవాణ్ణి నేను! నేన్నన్నీ చదువుతాను--ఆకళింపు చేసుకోడానికి ప్రయత్నిస్తాను--అది సమయం వృధా చేసుకోవడం అనుకోను!"

దీని తరవాత మంగేష్ వ్రాసింది '.........బహుశా మీకు గాయత్రి గుర్తు వచ్చినప్పుడల్లా నేను మీ మదిలో మెలుగుతానేమో. నేను మీ టపాలు చదివిన తరువాత మీ మేధస్సు అర్థమైనది. మీరు పడుతున్న శ్రమ అర్థమైనది. మీకు నా థన్యవాదములు. ................జరుగుతున్న వాటిని విమర్శిస్తేనో, బాగా తిట్టితేనో మార్పు రాదు. మార్పు సహజంగా లోపలి నుండి కలగాలి. ఎవరు ఎన్ని చెప్పినా తనకు తోచిందే నిజం అని భావించటం మానవ నైజం. కొంత మంది మాత్రమే అన్నిటిలోనున్న సత్యాన్ని గ్రహించటానికి ప్రయత్నించి కృతకృత్యులవుతారు. మనకు తెలిసిందే సత్యము కాదు. అలా అని తెలియంది కూడా సత్యము కాదు. రెండూ కలిపి సత్యము. మీ రచనలతో ప్రజలను చైతన్య వంతులను చేయండి. వారిని మేల్కొలపండి. జాగృతులను చేయండి. ప్రేమతో చెప్పండి. ప్రేమతో సమస్తమును జయించ వచ్చును. మీరు కొన్ని టపాలలో ఒక వర్గ విమర్శ చేసినందుకు చాలా విమర్శలు వచ్చాయి. మీ ఉద్దేశ్యము మంచిదే అయిననూ దానిని అందరూ మెచ్చే విధముగా తెలియచేయవలెను కదా? మనసు కాక హృదయము స్పందించ వలెను. హృదయము నందు కలిగిన మార్పే నిజమైన మార్పు. అంటూ యేమేమో వ్రాశారు!

నేను--'యేకహస్తం' (single handed)తో చేస్తున్న కృషిని అర్థం చేసుకొన్నందుకు ధన్యవాదాలు! అక్కడ గాయత్రి ముఖ్యం కాదు--మీ 'perception' ముఖ్యం నాకు. మీరు చెపుతున్నవి చాలా బాగుంటున్నాయి-'యోగములు, ధ్యానములు, మంత్రములు.....మిగిలినవారు కూడా దానిని........అందించారు' అన్నది అక్షర సత్యం!

కానీ ఆ పేరుచెప్పుకొని వ్యాపారాలు చెయ్యడం (పాపం పొట్టకూటికే అన్నాసరే), వేలంవెఱ్ఱుల్ని ప్రోత్సహించడం యెంతవరకు సబబు?

'......అందరికి కలగాలి......ప్రయత్నిద్దాం.' అనేమాటలు నా చెవుల్లో అమృతం పోశాయి!' అని వ్రాశాను నేను!

Monday, October 19, 2009

సంవాదం

నార--మంగేష్ లతో
గాయత్రీ మంత్రాన్ని భ్రష్టుపట్టిస్తున్న తీరు గురించి నా టపాలో నేను వ్రాసినదానికి--

ఈయన వ్యాఖ్యలో: "గాయత్రి అనగా వెలుగు." గాయత్రిని గానము చేయుటకు జాతి, మత, కుల, వర్గ విభేదములు ఎమీ లేవు. ఆడా వారు కూడా మగవారిలా గాయత్రి మంత్రము చేసుకోవచ్చు. దీనిని మన ఋషులే అంగీకరించారు. అనేక దేశములలో ఎంతో మంది గాయత్రి మంత్ర గానము చేయుచున్నారు.' అని వ్రాసి, తన బ్లాగుకి లింకులు ఇచ్చారు!

ఆయన బ్లాగులోకి వెళితే, 'Masters Voice' అని లింక్ కనిపించింది. సరే, అదేమిటో చుద్దాం అనుకుంటే, దానికో గాడ్రెజ్ తాళం కప్ప!

(నిన్న మొన్న మళ్ళీ ఆ టపా దగ్గరకి వెళితే, ఆయన 'About Me' లో ఇప్పుడు వాళ్ళ మాస్టర్ల పేర్లు కనిపిస్తున్నాయి--అప్పుడు అవి లేవు!)

హెచ్ ఎం వీ అని ఓ గ్రామఫోన్ రికార్డుల కంపెనీ వుండేది. దాని చిహ్నం ఓ కుక్క గ్రామఫోను రికార్డు ద్వారా, స్పీకరులోంచి తన యజమాని గొంతు వింటున్నట్లు ఓ బొమ్మ! (గ్రామఫోన్ రికార్డుల మీద 'అథారిటీ' శ్రీ వీ యే కే రంగారావుగారు, ఆయనకి కోపం వచ్చినప్పుడు దాన్ని 'కుక్క కంపెనీ' అని తిట్టేవారు!). ఈయన బ్లాగు యేదో అలాంటి వ్యవహారమేమో అనిపించింది!

అందుకే నేను చాలా మర్యాదగా అడిగాను! ".................మీ 'మాస్టర్లు' యెవరో తెలియ లేదు............ గాయత్రిని ‘గానం’ చెయ్యచ్చు అనీ, ఆడా మగా తేడా లేకుండా, జాతి కుల మత వర్గ భేదాలు లేకుండా అందరూ చదవచ్చు, పాడచ్చు అనడానికి ఆ విషయం యెవరు యెక్కడ చెప్పారో అధికారికం గా వ్రాయరేం?..........ముందు ‘గురు బ్రహ్మ’ చదవాలని చెప్పారు. బాగుంది. మరి ఆ పాడువారందరికీ యే గురువు వుపదేశించాడని వాడికి వందనం చెయ్యాలి? వివరిస్తే బాగుండేది. అని.

దానికి ఆయన తిరిగిన డొంకలూ, ఇచ్చిన సమాధానం చదవండి! "అధికార పత్రం చూపించటానికి గాయత్రి మంత్రము గవర్నమెంట్ G.O కాదు........ఇక గురువు ఎవరికి వందనము చేయాలి అన్నారు. గురువు ఒక్కడే............ఆ దైవమునే English లో "master" అంటారు. master అంటే స్వామి అని అర్దము. "గురు బ్రహ్మ" మంత్రములో చెప్పబడిన గురువు అతడే...........వ్యక్తము కాని దైవము వ్యక్తము ఐనపుడు వెలుగై వ్యక్తమౌతాడు............."

యేమైనా తలా, తోకా దొరుకుతున్నాయా? 1. ముందు 'దైవమూ అనబడే, ఇంగ్లీషులో మాస్టర్ అనబడే,........చెప్పబడిన గురువు.......(కి వందనం చెయ్యాలి--తరువాత గాయత్రి చదవాలి/పాడాలి.) 2. దైవము వ్యక్తము ఐనప్పుడు వెలుగై వ్యక్తమౌతాడు......(అంటే, గాయత్రి చదివిన తరవాతగానీ వ్యక్తమవడుకదా?) 3. అదే మూల ప్రకృతి. అతడు పురుషుడైతే ఆమె ప్రకృతి. అంటే....వెలుగై వ్యక్తమయే'వాడూ మూల ప్రకృతి. మరి అతడు 'పురుషుడైతే', ఆమె ప్రకృతి!?!

విశ్వామిత్ర మహర్షి గాయత్రి మంత్రమును సమస్త మానవజాతికి ఇచ్చాడు. అందులో అందరూ వస్తారు. భేదాలు ఎమీలేవు. పండితుల్ని కాక సద్గుగువులనెవరినైనా అడిగి తెలుసుకొన గలరు. ఇదీ ఆయన సమాధానం!

(మిగతా మరోసారి)

Monday, October 12, 2009

అర్థం లేని సమర్థనలు.....

తానా అనేవాళ్ళకి తందానా అనేవాళ్ళూ!

మొన్ననే నా తెలుగురాడికల్ లో 'భావ వ్యక్తీకరణ కళ' పేరుతో ఇలాంటివాళ్ళకి యేమైనా బుద్ధి మారుతుందేమో అని చూశాను! కానీ పుట్టుకతో వచ్చినదనుకుంటా--ఇంకా మారలేదు!

సరే--ఇంక వాళ్ళని పోతిరెడ్డిపాడు పంపించినా, లాభం వుండదనిని నిశ్చయించుకొని, పాఠక దేవుళ్ళకే అర్జీ దాఖలు చేస్తున్నాను!

ఒక రకం వాళ్ళు--వీళ్ళు యేదీ పూర్తిగా చదవరు! చదివిందానిని అవగాహన చేసుకోడానికి ప్రయత్నించరు! యేవో మూడు ముక్కలు ముక్కున పట్టుకుని, తాము ఇంతకుముందు కొంతమంది వ్రాసిన వ్యాఖ్యలనించి కొన్ని 'ఫ్యాషనబుల్' యెంగిలి డైలాగులు వాడేసి, 'యెలా కొట్టాను దెబ్బ?' అన్నట్టు అందరివంకా చూస్తారు!

వీళ్ళ స్టాండర్డ్ యెంగిలి డైలాగుల్లో మొదటిది--'ఆధారాలు యేమిటి?'

ఇంతకు ముందు రెండో మూడో నెలలనించీ వ్రాసిన టపాలూ, వ్రాసిన ఆధారాలూ చదవాలనే ఇంగిత ఙ్ఞానం వుండదు వీళ్ళకి!

రెండోది, 'అక్కడ అలా వ్రాశారు........' అని!

వీళ్ళు ఒకటి మరిచిపోతుంటారు--ఒకళ్ళు వ్రాసే--తాను చెప్పదలుచుకున్న విషయాలూ, ఇతరులు అన్నవీ, విన్నవీ, చదివినవీ 'కోట్' చెయ్యడమూ--రెండూ ఒకటే అనుకుంటారు! (అందుకే 'ఉట్టంకింపులకి' చివర 'ట' చేరుస్తాను నేను!--దీన్నికూడా అపార్థం చేసుకున్నవాళ్ళున్నారు!)

ఇక మూడోది--రామాయణం అంతా విని, రాముడు కి సీత మేనత్త అవుతుందా? పిన్ని అవుతుందా? అని అడిగినవాళ్ళ గురించి విన్నాం! (నిజంగా వాల్మీకి రామాయణం ప్రకారం ఈ రెండు వరసలూ వున్నాయి అని నమ్మేవాళ్ళు వున్నారు--విఙ్ఞులెవరైనా వివరింపగలిగితే, సంతోషం!).

కానీ, రామాణయం చదవకుండానే, వినకుండానే, 'హనుమంతుడు రాముణ్ణి చేరాడు' అంటే--'అసలు ఈ రాముడెవరు?' అని కళ్ళెర్రజేస్తారు!

నాలుగోది--'యేళ్ళు వచ్చాయిగానీ బుధ్ధి రాలేదు'!

సందర్భ శుధ్ధి లేకుండా వీళ్ళు వాడే యెంగిలి వాటిలో ఇది మొదటిది!

తాతా మామ్మలూ, తల్లి తండ్రులూ పిల్లలని మందలించడానికి వాడే మాటలవి! చదవేసేవరకూ 'కాకరకాయ ' అన్నవాడు, బడినించి వచ్చాక 'కీకరకాయ ' అంటే--అలాంటివాళ్ళని ఇలా మందలిస్తారు!

మనిషి భౌతిక వయస్సుకీ, మానసిక వయస్సుకీ వుండే నిష్పత్తిని 'ఐ క్యూ' అని వ్యవహరిస్తారు! అది సమానంగా వుంటే--బాగుంది అనుకుంటారు, యెక్కువగా వుంటే--ఓహో అంటారు, తక్కువగా వుంతే--పాపం అంటారు! దాన్ని పెంచుకోమని చెప్పడమేకాదు, పెంచడానికి వాళ్ళుకూడా ప్రయత్నాలు మొదలెడతారు!

ఇలాంటి మాటలు విస్తృతంగా వాడేవాడిని నా విద్యార్థి అయితే, బెంచీ యెక్కించేవాడిని! నా కొడుకు ఆ మాట వాడితే, వాడి పెళ్ళాం చేత వాడికి బుధ్ధి చెప్పించేవాడిని! (ఇప్పుడు కార్పొరేట్ విద్యలో 'బెంచీ యెక్కడాలూ' అవీ లేవు! డైరెక్టుగా ఆత్మహత్యలే!)

ఇవీ 'తందానా' అనేవాళ్ళ కొన్నిసంగతులు!

తరవాత--తలా తోకా లేనివాటిగురించి! (మరోసారి)

నా విఙ్ఞప్తి :- పాఠకుల ముందుంచుతున్న నా 'కేసు ' పూర్తయ్యేవరకూ, మంగేష్ లూ, నారాలూ మాట్లాడకుండా వుండడం న్యాయ సూత్రాల రీత్యా అభిలషణీయం! తరవాత మీ యిష్టం!

Monday, September 28, 2009

ఆత్మ

ప్రయాణం

జీవి మరణించాడు అని ప్రకటించబడ్డాక కూడా, జీవుడు (ఆత్మ) శరీరాన్ని అంటిపెట్టుకొనే వుంటాడట.

శరీరం దహనం చెయ్యబడుతున్నా, ఆఖరివరకూ--కపాలమోక్షం అయ్యేవరకూ శరీరాన్నీ, ఆ తరవాత చితాభస్మాన్నీ అంటుకొనే వుంటాడట.

ఆస్తిసంచయనం జరిగి, అస్థినిమజ్జనం అయ్యాక, కర్మ చేసేవాళ్ళద్వారా, ఆత్మని మంత్రాలద్వారా ఒక శిలలోకి ఆవాహన చేస్తారు--అపరకర్మలు చేయించేవాళ్ళు.

అక్కణ్ణించీ ప్రతీరోజు, నిత్యవిధి చేస్తూ, 'ప్రేతాన్ని దహించడంవల్ల ఆత్మకి కలిగిన వేడి తగ్గడానికి ' అంటూ అనేకసార్లు మంత్రసహితంగా ఆ శిల మీద నీళ్ళు జల్లడమేకాదు, దాన్ని వుంచిన పిడతనిండా నీళ్ళు పోసి, క్రింద చిల్లుపెట్టి, దానిలోంచి ఓ త్రాడు క్రిందికి వేళ్ళాడేలాగ చేసి, ఆ పిడతని జీవుడు మరణించినచోట పైన గాలిలో వేళ్ళాడగడతారు--అందులోంచి చుక్క చుక్కగా కారి, ఆత్మ చల్లబడుతూ, మరణప్రదేశాన్ని కూడా చల్లబరుస్తుందని. కర్మ పూర్తయ్యేవరకూ, ఆపిడత ఖాళీ అవకుండా, అప్పుడప్పుడు నీళ్ళతో నింపమంటారు!

ఇలా పదమూడోరోజు పూర్తయ్యేసరికి ఆత్మ వైతరణిని కూడా దాటి, భువర్లోకానికి ప్రయాణం సాగిస్తుందిట.

అక్కడనించి ప్రయాణానికి లెక్కలు వున్నాయిట--మొదటి నెల ఆత్మకి 'ఒక రోజు ', ఇలా! మధ్యలో 'త్రైపక్షికం' కూడా పెడతారు--ఆ లెఖ్ఖల్లో భాగంగానే.

ఆ తరవాత నించి మనకో నెల అయితే, ఆత్మకి ఒకరోజు, మనకి 12 నెలలయ్యాక (సంవత్సరీక కర్మలు అయ్యాక), అక్కడనించీ మనకి ఓ సంవత్సరమైతే ఆత్మకి ఒక రోజు అనీ చెపుతారు!

చితా భస్మం పూర్తిగా నిమజ్జనం అయ్యేవరకూ--ఆత్మ ప్రయాణం మొదలుపెట్టదుట. (మొన్నామధ్య యేదో మ్యూజియం లో గాంధీగారి చితాభస్మం నిమజ్జనం కాకుండా ఓ పాత్రలో వుంచబడి కనిపించిందట! అందుకే ఇప్పటివరకూ ఆయన ఆత్మకి శాంతి లేదు, ఆయన మళ్ళీ జన్మ యెత్తలేదు--అనుకుంటా!)

ఇక భువర్లోకం లో యెన్నాళ్ళుండాలి--అక్కణ్ణించి ఆత్మ యేమి చేస్తుంది? అనేవాటికి ఇంకా లెఖ్ఖలు వున్నాయట.

అవి ఇంకోసారి!

Sunday, September 6, 2009

మరణం

ఆత్మ

ఆయన ఆత్మకి శాంతికలుగుగాక--అనివ్రాస్తుంటే, అనిపించింది--ఈ 'ఆత్మ ' గురించి కొంచెం వ్రాస్తే బాగుంటుందని.

'మంగేష్' లాంటివాళ్ళూ, వాళ్ళ మాస్టర్లూ--విషయాన్ని గజిబిజి చేసేసి, 'స్థూల శరీరం', 'సూక్ష్మ శరీరం'--సూక్ష్మ శరీరానికి మోక్షం--ఇలా బుర్రల్ని చెడగొట్టేస్తున్నారు!

మనిషి చనిపోయాక యేమి జరుగుతుంది?

యెవరూ చూసివచ్చి చెప్పింది లేదు--యెవరికి తోచినట్లు వాళ్ళు--వేదాలూ, పురాణాలూ, ఇతిహాసాలూ, ఉపనిషత్తులూ లాంటి వాటి మీదా, ప్రముఖుల ప్రవచనాలలోంచీ--గ్రహించగలినంత గ్రహించారు--తిరిగి కొంతమందికి చెప్పాలని ప్రయత్నిస్తూనే వున్నారు.

అసలు విషయం 'ద్రష్ట ' లైన మన మహామునులు 'గరుడపురాణం' లో చెప్పారు(ట).

మరణం (కాలధర్మం) గురించి 'ఈనాడు ' 06-09-2009 న 'జీవన వేదం' శీర్షికన చక్కని సంపాదకీయం వ్రాశారు--తప్పక పూర్తిగా చదవండి! దీనిలో.....

'.....--జనం తరఫున ఆడే ఆట ముగించకుండానే మధ్యలో వదిలేసి ఎవరైనా అలా చిరునవ్వులు చిందించుకుంటూ పైలోకాలకు వెళ్ళిపోవటం మాత్రం కచ్చితం గా తొండే!' అన్నది హైలైట్!

ఇక ఆత్మ గురించి మరోసారి!


Thursday, September 3, 2009

మహాఘోరం

విధి విలాసం

సృష్టిలో జవాబులేని ప్రశ్న, ఒకవేళ జవాబు అని భావించదలుచుకుంటే 'విధి ' అని సమాధానం వచ్చే ప్రశ్న--"యెందుకు" అనేది.

సినీనటి సౌందర్య విమానం కూలిపోయి మరణించినప్పుడు, టివీలో--ఆమె అరుస్తూ, గాజు తలుపులమీద గుద్దుతూ, కాలిపోవడం చూసిన వాళ్ళందరూ--'అంతటి నిస్సహాయ మరణం పగవాళ్ళకి కూడా రాకూడదు భగవంతుడా!' అని తప్పకుండా అనుకొని వుంటారు.

మరి--ఆంధ్రరాష్ట్ర నాయకుడు శ్రీ రాజ శేఖర రెడ్డి--24 గంటలకి పైగా--యేమి అనుభవించాడో--యేదిక్కూలేని అనాథలా యెంతకాలం పడివున్నాడో--ఇదంతా యెందుకు? అంటే--జవాబులేని ప్రశ్న! అంతే!

మనిషి వున్నంతకాలం తెలీదు--కానీ--ఒకసారి 'లేడు ' అనుకోగానే--అక్కడ యెంత అగాథం యేర్పడుతుందో మనకి వాళ్ళ మీదున్న అభిమానాన్నిబట్టి తెలుస్తుంది!

ఆయన ఆత్మకి శాంతి కలుగుగాక!


Thursday, August 27, 2009

నేరస్థులు

ప్రఖ్యాతులు

మొన్న ఆదివారం సోనీ టీవీలో ననుకుంటా ఓ కొత్త ‘షో’ మొదలయ్యింది—10 కా దం—అని.
యాంఖర్ ‘సల్మాన్ ఖాన్’! పోటీ ‘కపిల్ దేవ్’, 'నవజోత్ సింగ్ సిద్ధూ’ మధ్య! వినూత్నం గా వుంది—బాగుంది!
ముందు ఇద్దరికీ పోటీ పెట్టి, దాంట్లో యెవరు నెగ్గితే వారిని ‘హాట్ సీట్’ కి రప్పించి, వాళ్ళని ప్రశ్నలడిగి, ఆఖరి ప్రశ్నకి కూడా సరైన సమాధానం చెపితే, ‘పదికోట్లు’ బహుమతీ, ఆ బహుమతి ‘అనాధ పిల్లలకి’ చెందుతుందనీ—మంచి కాన్సెప్ట్ మరి!
ఇంతకీ సరైన సమాధానలంటే, ఆ చానెల్ నిర్వహించిన ‘సర్వే’ లో వచ్చిన సమాధానాలు (ట!).
కపిల్ వోడిపోయి, ఒక లక్ష మాత్రమే నెగ్గాడనుకోండి.
నాకు నచ్చిందేమిటంటే—యెంత % మంది ‘నన్ను నమ్ముతావా?’ అని ఒక్కసారైనా అంటారు? అని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పేలోపల, సల్మాన్ కపిల్ ని ‘మీరు ఆ మధ్య మీడియా లో చాలా బాధగా కనిపించిన సందర్భం గురించి చెప్పండి’ అంటే, కపిల్ “నా జీవితమంతా ‘క్రికెట్’ కి అంకితం చేస్తే, మన దేశం తరఫున అన్ని విజయాలు నమోదు చేసినా, నన్ను ‘మాచ్ ఫిక్సింగ్’ చేశానని నిందిస్తుంటే……’ అని వాపోయాడు! (డాలరు శేషాద్రి ఙ్ఞాపకం రావడం లేదూ?)
ఇంకోటి—“యెంత % మంది ‘సామాన్యులకి’ వర్తించినంతగా ‘ప్రఖ్యాతులకి’ చట్టం వర్తించదు అనుకుంటారు?” అన్న ప్రశ్నకి, కపిల్ అక్కడున్న ప్రఖ్యాతులిద్దరినీ ఉదాహరణగా చెప్పి, పదిహేను నించి, 30 శాతమో యెంతో చెప్పినట్టున్నాడు. కరెక్టు సమాధానం 43% అని వచ్చినట్టు గుర్తు.
నేను చెప్పేది ఇది ఇంకా చాలా యెక్కువ అని.
యెందుకంటే, సల్మాన్ చేసిన నేరం యేమిటి? ‘సరదాగా తన ఆడ, మగ స్నేహితులతో కలిసి వన్య మృగాలని వేటాడడం!’ మరి అవేం పాపం చేశాయో!
సిద్ధూ మీద కేసు ఇంకా వేరు—ఓ హత్యకి జరిగిన కుట్రలో తనుకూడా భాగస్వామి అని. కానీ ‘మీడియా నన్ను వదల్లేదు’ అని వాపోయాడు. (అప్పటికి అతను బీజేపీ లో వున్నట్టున్నాడు).
మరి సల్మాన్ నేరానికీ, ఇతనికీ పోలికా?
చిన్న చిన్న నేరాలకి ‘అండర్ ట్రయల్స్’ గా దశాబ్దానికి పైగా శిక్షలు అనుభవిస్తున్నవాళ్ళెక్కడ? (వీళ్ళకి ఇంకా శిక్ష పడలేదు కాబట్టి, సత్ప్రవర్తనకో మరెందుకో వీళ్ళు తొందరగా విడుదలయ్యే చాన్స్ కూడా లేదు పాపం! ఈ అవకాశం శిక్షపడ్డ టెర్రరిష్టులక్కూడా వుంది మరి!)
నీచమైన నేరం చేసినా ఇంకా కోట్లు సంపాదించుకుంటున్న సల్మాన్ యెక్కడ?
ఈ మధ్య ఇంకో వార్త వచ్చింది—సంజయ్ దత్ కి ‘టా డా కోర్టు’ శిక్ష విధించకపోయినా, వాడు విడుదలైన వెంటనే సమాజ్ వాదీ పార్టీ లో జేరినందుకు, ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ సుప్రీం కోర్టులో అప్పీలు చేస్తుందట!
వాడి నేరం యేమిటో గుర్తుందా? లైసెన్స్ లేకుండా ‘ఏ కే 47’ తుపాకిని దాచి వుంచడం!
ఎలెక్షన్లలో పోటీ చేసి నెగ్గితే, కేసు మూసెయ్యవచ్చు అని భావించిన కాంగ్రెస్ పార్టీకి కోర్టు మొట్టికాయ వేసి, వాడు పోటీ కి అనర్హుడు అని చెప్పింది!
మరిప్పుడు?
అదీ సంగతి!

Sunday, August 16, 2009

‘ముఖ్యమంత్రీ…..

తత్వం...
‘మాది కృష్ణ తత్వం—వారిది శకుని మార్గం. ఎన్నికల ముందు మమ్మల్ని కౌరవులని, తామే పాండవులమని ప్రధాన ప్రతిపక్షం గొప్పలు చెప్పుకుంది. చివరకు పాండవులు ఎవరో ప్రజలే తేల్చారు’ అన్నారట ముఖ్యమంత్రి!

ఇంకా ‘ధరల సంక్షోభాన్ని ముందుగానే ఊహించాం. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం, ఆశలు పెట్టే అలవాటు లేదు. అందుకే 90 శాతం మంది ప్రజలకు తెల్ల కార్డు అవకాశం కల్పించి, రెండు రూపాయలకే కిలో బియ్యం, రూ.103 కే నిత్యావసరాలు (కందిపప్పు, నూనెలు) సరఫరా చేశాం’ అన్నారట.

‘ధరల బెడద ప్రపంచ వ్యాప్తం గా ఉందని మేధావులు ఊరడిస్తున్నా…ఊరుకోకుండా ధరలపై యుద్ధం ప్రకటించాము’ అని, ‘కృష్ణుడు చెప్పినట్టు కర్తవ్య పాలనలో జాప్యం వుండకూడదు అనే కృష్ణ బోధనే తనకు శిరోధార్యం’ అని కూడా అన్నారట!

‘కోటివరాలతో దేవుడి అవతారం ఎత్తాలని ప్రధాన ప్రతిపక్ష నేత అనుకున్నారు. 1999 లో ఆడపిల్ల పుడితే మేనమామలా ఐదువేలు ఇస్తానని చెప్పిన ఆ మేనమామ ఇప్పుడెక్కడున్నారు? బోగస్ ఏటీఎం కార్డులతో కనికట్టుకు పాల్పడ్డారు. ప్రజలని పావులుగా వాడుకోవాలని చూశారు.’ అని విమర్శించారట.

తరవాత ముఖ్యమంత్రికి ‘వైద్య పరీక్షలు’ చేయించారట!

(ఇప్పటిదాకా యేదేదో మాట్లాడాడనా?!—యేమో)


Monday, August 10, 2009

దుర్భిక్షం

కరవు
మనిషిని వణికించే భయంకరమైన మాట ఇది!

మొన్న 08-08-2009 న మన ప్రథాని రాష్ట్రాల మీద ‘ఉరిమారు’!

కరువుపై కదలరేం? అని రాష్ట్ర ప్రథాన కార్యదర్శుల సమావేశం లో ప్రశ్నించి, ఇకనైనా తగిన చర్యలు తీసుకోమన్నారు!

అంతేకాదు—కేంద్రం పూర్తిగా సహకరిస్తుందన్నారు!

ఇంకా, దేశవ్యాప్తం గా 141 జిల్లాలను కరవు జిల్లాలుగా ప్రకటించామనీ, అయినా యే ఒక్క రాష్టృఅం నించీ తమకు నివేదికలు పంపలేదని ఆవేదన వ్యక్తం చేశారు! రాష్ట్రాలు అక్రమ నిల్వలని వెలికితీసే చర్యలు వెంటనే చేపట్టాలన్నారట! మిగిలిన విసహయాల గురించికూడా మామూలుగానే హెచ్చరించారట!

శరద్ పవార్ గారు—కేవలం సరఫరా-గిరాకీల కారణం గానే పప్పుల ధరలు ఇలా పెరిగాయనడం లో అర్థం లేదు. మార్కెట్ వూహా గానాలే ధరల పెరుగదలలో కీలక పాత్ర పోషిస్తాయి! అక్రమ నిల్వలను, నల్లబజారును అరికట్టేందుకు (రాష్ట్రాలు) గట్టి చర్యలు తీసుకోనంతకాలం ధరలను నియంత్రించలేం!—అన్నారట.

బుధ్ధున్నవాడెవడైనా చెప్పే మాటలే కదా ప్రథానీ, వ్యవసాయ మంత్రీ చెప్పినవి!

మన బుద్ధిలేని రాష్ట్ర ప్రభుత్వం యేమి చేస్తోంది?

ఆరు నెలలనించీ బియ్యం ధరలు పెరిగిపోతున్నాయి అని, మూడు నెలలుగా పప్పులు పెరిగిపోతున్నాయి అనీ గగ్గోలు పెడుతున్న ప్రజలనీ పత్రికలనీ కేరేజాట్ అని, పక్కరాష్ట్రాల కన్నా మన రాష్ట్రం లో అన్నీ తక్కువ రేట్లే అని తప్పుడు ప్రకటనలు ఇస్తోంది!

(మనవాళ్ళెవరూ పక్క రాష్ట్రాల్లో లేరా—ఒక్క ఫోను కొడితే, అక్కడ రేట్లెలా వున్నాయో చెప్పరా? కర్ణాటకలో బిజినెస్ లు చేస్తూ ఆస్థులు సంపాదించుకుంటూ దాదాపు అక్కడే కాపరం వుంటున్న వీర జగన్ ని అడిగినా వాళ్ళ బాబుకి చెపుతాడే!)

ఇవన్నీ యెవర్ని వంచించడానికి? బియ్యమూ, పప్పుల నిల్వల్ని స్వాధీనం చేసుకొని, అక్రమ నిల్వ చేసినవాళ్ళకే, మళ్ళీ వేలం లో అవి తక్కువ రేటుకే అప్పచెపుతున్నారంటే—ఇది అక్రమార్కుల కొమ్ముకాస్తున్న దగాకోరు ప్రభుత్వం కాదా?

ఒకప్పుడు డైనమిక్ ఐ యే యస్ అనిపించుకున్న మన ప్రభుత్వ ప్రథాన కార్యదర్శి యేమంటున్నాడు?

మొత్తం 1186 మండలాల్లో, కనీసం 900 మండలాల్లో కరవు ‘లాంటి’ పరిస్థితే వుందట! ఇన్ని జిల్లాలు కరవు తో అల్లల్లాడుతున్నాయని యెలాంటి నివేదికా ఇంతవరకూ రూపొందించనేలేదట—కేంద్రానికి పంపడం సంగతి దేవుడెరుగు! పరిస్థితి తీవ్రం గా వున్నప్పటికీ, తదుపరి చర్యలు తీసుకోవడానికి ఇంకో 4, 5 రోజులు వేచి చూడాలని నిర్ణయించాము! ఆని. యెందుకూ? జెరూసలేము దేవుడేమైనా ఆ రెడ్డిగారికి కల్లో కనబడి మంత్ర దండమేమైనా ఇస్తాడేమోననా? దాన్నాయన ఈ రెడ్డిగారికిచ్చి, ‘హాం ఫట్’ అనమంటాడేమోననా? ఇంకా, అధికార యంత్రాంగం కరవు పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తోందనీ, వివిధ జిల్లాల నించి సమాచారం సేకరిస్తోందనీ, ఇప్పటివరకూ అందిన సమాచారం అందోళన చెందాల్సినంత తీవ్ర పసిస్థితే వుందనీ, అతి త్వరలో ఉన్నత యంత్రాంగం సమావేశమై, ఒక విధాన నిర్ణయం తీసుకుంటారనీ, క్షేత్ర పరిస్థితిని బట్టి కేంద్రానికి నివేదిక పంపి, కేంద్ర బృందాన్ని ఆహ్వానించే అవకాశం వుందనీ, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందువల్ల ఇంతకన్నా యేమీ మాట్లాడలేననీ—తాపీగా, పదినిమిషాలకో మాట సెలవిచ్చారు!

కడుపుకి అన్నం తింటున్నాడా—గడ్డి తింటున్నాడా?

యెవరి చెవుల్లో పువ్వులు పెడతారు?

వీడియో కాన్ ఫరెన్సులూ, యేరియల్ సర్వేలూ వున్నది చంక నాకడానికా!

అత్యవసరమైనప్పుడైనా యంత్రాంగాన్ని పరిగెత్తించగలిగే సత్తా మీకుందా?

యెందుకు నాటకాలు?

శ్రీ శ్రీ ప్రబోధాల స్ఫూర్తితో పీడిత జనాలు తిరగబడితే, మీ డీ జీ పీ లూ, వాళ్ళ దగ్గర ‘ఆర్డర్లీలు’ గా బతికే రక్షక భటులూ యెవరూ మిమ్మల్ని కాపాడలేరు!

ఇప్పటికైనా మేలుకోండి మరి.