Friday, November 13, 2009

సంవాదం--6

నార, మంగేష్ లతో
సంవాదం ముగించే ముందు, 'నార' లాంటివాళ్ళకి కనువిప్పుగా మంగేష్ గారి బ్లాగు నించి కొన్ని--(దయచేసి నేను వారిని విమర్శిస్తున్నాను అని మాత్రం అనుకోవద్దు!)

వారి టపా పై ఒకరి ప్రశ్న, వారి జవాబు:

subrahmanyam said...

Dear Guru Bandhu,

Many thanks for sharing the great teachings of the Masters. Could you please mention the source also, like name of the book, so that it would be possible for the interested readers to get more details.

Regards,
Subrahmanyam.
October 6, 2009 5:25 AM

Mangesh said...

Dear Subrahmanyam,

Thanks for your comment. I frequently listen Master K.Parvati Kumar's and Master EK's lectures and noting interested and important points and then writing these posts. If you are interested you can listen them by registering yourself in http://www.masters-call.net/.

Thanks
Mangesh
October 6, 2009 5:01 PM

(వాక్యాలు అండర్ లైన్ చేసింది నేను--పాఠకులు సత్యం గ్రహిస్తారని. నిజానికి ఆ మాస్టర్ల గురించి నేనెప్పుడూ విని వుండలేదు! శ్రీ జిడ్డు కృష్ణమూర్తి తత్వం అయినా బోధపడుతుందేమో కాస్త కష్ట పడితే--కానీ వీళ్ళు చెప్పినది యెవరికీ అర్థం అయ్యేట్టు వుండదు.)
మనం సామాన్యం గా యెవరైనా ఒక విషయం లో యెక్కువ నైపుణ్యాన్ని సాధిస్తే, అది వారి 'ప్రఙ్ఞ ' అంటాము.

మరి మంగేష్ చెపుతున్న మాస్టర్లు 'త్రిగుణ ప్రజ్ఞలు మూడును (ద్రవ్య రూపము, దేవతా ప్రజ్ఞలు, క్రియా రూపమైన ప్రజ్ఞలు) జీవునికి ఆశ్రయములుగా పనిచేయుచున్నవి.' అంటారు. 'నిద్ర లేవంగానే మనము దైవము ఒడిలోనుండి వచ్చాము అని గుర్తు వుండదు. అది ఒక ఆవరణ. అది సంకర్షణ వ్యూహము.' అంటారు. '...........మూడు బంధముల వల్లనూ మూడు ఆవరణలు ఏర్పడి మూడు శరీరములు ఏర్పడతాయి............అదే స్థూల శరీరము.........' ఇలా అందరికీ నాలుగో యెన్నో స్థూల శరీరాలు వుంటాయంటారు వీరు!

(నార! గమనించావా? నేను జీవుడు అంటేనే, నీకు 'TrAsh' అనిపించింది--ఇవన్నీ చదివితే ఇంకేమంటావో?--బహుశా--'బుల్ డంగ్', 'హార్స్ షిట్', "డైనొసార్స్ నైట్ సాయిల్", 'షిట్ హిట్టింగ్ ది ఫాన్ ' అంటారేమో!)

ఇంకా 'సప్త ఋషులు' అంటూ కొన్ని పేర్లూ, వారి లక్షణాలూ చెప్పారు. వారికి మరేమైనా పేర్లు వున్నాయేమో--అవి కూదా ఇస్తే బాగుండేది--యెందుకంటే, 'పులిసే వాడు' మొదలైనవాళ్ళు సామాన్యులకి తెలియరుగా? సామాన్యులకి తెలిసిన సప్త ఋషుల పేర్లు వేరు. ఇంకా ఆకాశం లో మనక కనిపించే సప్త ఋషి మండలం లో నక్షత్రాలని--యేనక్షత్రం యే ఋషో చెపితే ఇంకా బాగుండేది! కాదంటారా?

ఇంకా చాలా వున్నాయి--స్వయం గా చదవండి--లింక్ కావాలంటే, నా టపాలమీద ఆయన కామెంట్లలో దొచుకుతుంది మీకు!

ఇంకో ముఖ్యమైన సంగతి--భవబంధాలు వీడి, సన్యాసం పుచ్చుకొనేవారు--'జంధ్యాలు తెంపుకొని' స్వీకరిస్తారు! వారిక 'గాయత్రి' ని అనుష్టించరు. గాయత్రి గొప్పతనాన్ని కీర్తించరు! ఆత్మానందం కోసం అన్వేషించి, ఆ అలౌకిక ఆనందానుభూతిని అనుభవిస్తూ శేష జీవితాలని (కొన్ని వందల యేళ్ళు కావచ్చు) గడుపుతారు! పుష్కరాల సందర్భం లో నగ్నంగా ప్రత్యక్షమయ్యే 'యోగులు' వాళ్ళు--నిజమైన సర్వ సంగ పరిత్యాగులు--అంతేగానీ--ఆశ్రమాలు స్థాపించి, వెర్రి వెర్రి ఉపన్యాసాలూ, హావభావ ప్రకటనలూ, కొండొకచో గానాలూ, వాయిద్య వాదనలూ చేస్తూ, డబ్బు సంపాదనలో మునిగి తేలడానికి అక్రమాలకి సైతం వెనుకాడనివారు--సన్యాసులు కాదు--గురువులు అంతకంటే కాదు!

(ఇక మన తెలుగులో 'పుంజాలు తెంపుకుని' పారిపోవడం అనేదొకటుంది. మాట వినని గొడ్లని, నాలుగు కాళ్ళకీ నాలుగు పొడవాటి త్రాళ్ళు కట్టి, నాలుగు పక్కలా నాలుగు గుంజలకి కట్టేవారు! అవీ 'పుంజాలు' అంటే. పుంజా లేదా పుంజీ అంటే నాలుగు అని అర్థం. ఈ విధంగా ఆ గొడ్డుకి తను బంధించబడ్డానని అనిపించకుండానే, యేపక్కకి కొంత దూరం వెళ్ళినా, ఇంకో పక్క త్రాడు బిగిస్తుంది! దాన్ని అంతకన్నా యెక్కువ ఆ వైపు కదలకుండా చేస్తుంది! ఇక వాటికి--విపరీతమైన భయం వేస్తే మాత్రం, ఆ పుంజాలు తెంపుకుని పారిపోయేవి! ఈ ప్రయోగాన్ని మన ఇదివరకటి కథల్లో, సాహిత్యం లోనూ, బాపు కార్టూనుల్లోనూ చూస్తాం!)
దీంతో, న్యాయ మూర్తులైన పాఠక దేవుళ్ళ ముందు నా వాదనని ముగిస్తున్నాను.

తీర్పు యేమైనా, శిరసావహిస్తాను!

ఇక మీ ఇష్టం.



No comments: