Thursday, June 2, 2011

(యమర్జెంటు) కబుర్లు - 54

అవీ, ఇవీ, అన్నీ

రాజకీయ యెత్తులూ, పైయెత్తులూ!

రాజకీయ క్రీడ అనేది చాలామందికి తెలీదు. అందుకనే చాలామంది బలయిపోతూంటారు. నాలుగు వోట్లు పడి, ఒకటో రెండో పదవులురాగానే, తమకి యెదురు లేదు అనుకుంటారు! కానీ రాజకీయంలో యేదైనా "తాత్కాలికమే".....చిత్త శుధ్ధి వుంటే తప్ప.

రాజకీయ కురువృధ్ధుడు "కరుణా నిధి" ధృతరాష్ ట్రుడిలా నల్లకళ్లద్దాలు పెట్టుకొన్నందుకు, వాడి వంశం అంతా ఇవాళ రాజకీయాలకే బలి అయిపోతూంది.....దయానిధి, కళానిధి మారన్ లతో సహా! 

ఇప్పుడు, కొంతం'మం'దిలీపు ల్లాంటివాళ్లు ఓ ముఫ్ఫై యెనిమిదేళ్లక్రితం మేము వున్న స్థాయిలోనే వున్నారంటే, వాళ్లకి అర్థం అవడంలేదు.

నా'గంజ 'నార్దనరెడ్డికి కళ్లముందు మునిసిపల్ ఎలక్షన్లే కనిపిస్తున్నాయి....తెదేపా నుంచి బహిష్కరింపబడి, తనపాట్లు తాను పడుతూన్నాడు. క్రితం యెన్నికలముందు తెలంగాణా కోసం బయటికి వెళ్లిన దేవేందర్ గౌడు యేమి బావుకున్నాడు? 

ఇంక, బా'బారాందే'వ్......తన యోగాయేదో చేసుకోక, రాజకీయాలెందుకు వీడికి? ఫేస్ బుక్ లోనూ, ట్విట్టర్లోనూ ఎస్మ్మెస్ లని చూసుకొని, అదంతా తన బలుపు అనుకుంటున్నాడు. బాగానే వుంది. కానీ దేనికైనా సమయం సందర్భం వుండక్కర్లా?

వో ప్రక్క అన్నా హజారే నిరాహారదీక్షతో వుద్యమం చేస్తుంటే, వీడి అనవసర గొరిగింపులు కొన్ని. కాంగీ/యూపీయే తైనాతీ మీడియావాళ్లు వీడి నోట్లో తమ మాటలని కుక్కేసి, కక్కించేస్తున్నారు! ఇదే మొదటిసారికాదు.....నిన్న, "ప్రథాని ని లోక్ పాల్ పరిథి నుంచి తప్పించాల్సిందే" అని అన్నాడని ప్రచురించేశారు. ఇవాళ తాను అలా అనలేదు అంటున్నాడు ఈ రాజకీయ బాలుడు!

వాడు "ప్రైవేటు విమానం"లో ఢిల్లీలో దిగగానే, (తానే ప్రణవ్ ఇంటికి వెళ్లాల్సిన ప్రోగ్రాము! కానీ, ప్రణవే, కొన్నిగంటలముందు వచ్చి వీడిరాక గురించి పడిగాపులు పడ్డాట్ట!--పైనుంచొచ్చిన ఆదేశాల ప్రకారం!) నలుగురైదుగురు "ప్రముఖ" కేంద్ర మంత్రులు వాడిని కలుసుకొని, చర్చలు జరిపారట! మధ్యమధ్యలో మన్మోహన్ విఙ్ఞప్తులట! 

"స్పష్టమైన హామీ లభించేవరకూ" లక్షమందితో దీక్షను విరమించేదిలేదని వీడి ప్రకటన!

చెట్టు ముందా, విత్తు ముందా అన్నట్టు, "జనలోక్ పాల్ ముందా? నల్లధనం ముందా?" అంటే, బుధ్ధున్నవాడెవడైనా, 'కొంత ముందుకు వెళ్లిన ' జనలోక్ పాలే ముందు అంటాడు

ఈ రాజకీయ చంటిపిల్లాడు మాత్రం, "తనకి" మీడియాలోనూ, ప్రభుత్వంలోనూ అంత ప్రాముఖ్యత వచ్చేసినందుకు, మురిసి ముప్పందుమైపోతున్నాడు! తనకు తెలియకుండానే, "రాజకీయ" యెత్తుగడలకి బలైపోడానికి సిధ్ధమౌతున్నాడు!

పౌర సమాజం ఇలాంటివాళ్లని వెలివెయ్యాలి! ఫేస్ బుక్, ట్విట్టర్ మెంబర్లూ! మీ బుధ్ధి వెర్రితలలు వెయ్యకుండా, యెవరూ అలాంటి "ఆమరణ" నిరహారదీక్షలలో పాల్గొన వద్దు!

దయచేసి వినండి......ఇది నా విఙ్ఞప్తి మీకు!

తరవాత మీ యిష్టం!

4 comments:

శరత్ కాలమ్ said...

నిజమే. అన్నా దీక్ష అంటే హర్షించాను కానీ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఈ యోగ్బాబా దీక్ష ఏంటా అనుకుంటూవుంటుంటే కేంద్రం అలా సాగిలపడిపోవడం చూసి ఈ బాబా గారికి హంత సీనుందా అని అవాక్కాయ్యాను.

y.v.ramana said...

రాందేవ్ బాబా అన్నా హజారేకి పోటీ దుకాణం నడుపుకుంటున్నాడు . ఎవరి దుకాణం వారిది . ఈ రెండు దుకాణాలకి ఎంత పోటీ ఉంటే ఏలినవారికి అంత గిట్టుబాటు . అన్నా హజారేలా రాందేవ్ బాబా కూడా ఓ నాల్రోజులు పాటు రియాలిటీ షో నడుపుదామని ముచ్చట పడుతుంటే మధ్యలో మీ గోలేమిటి మహాశయా ?

A K Sastry said...

డియర్ శరత్!

అంత సీను క్రియేట్ చేసి, "పౌర సమాజాన్ని" దెబ్బతియ్యాలని వాళ్ల యెత్తుగడ.

అందుకే అందరినీ హెచ్చరించడం!

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ ramana!

అడ్డంగా కోట్లు సంపాదించాడేమో--ప్రైవేటు విమానాల్లో ప్రయాణిస్తూ, రాజకీయ పార్టీ పెడతానన్నాడు. నాలుగు రోజులు కాకపోతే, నలభై రోజులు యెన్నైనా షోలు పెట్టుకోమనండి.

కానీ, లక్షమంది చేత "ఆమరణ నిరాహార దీక్ష" అంటూ బిల్డప్పులెందుకు? వాడు గాలి తినైనా బతికేస్తాడేమో గానీ, లక్షమందిలో యెంతమంది నాలుగురోజులు నిలబడగలరు? తరువాతి పరిణామాలకి యెవరిది బాధ్యత?

"ఈజిప్టు తరహా" అనే వేలం వెర్రిలో ఇలాంటివాటికి బలి కావద్దనే "నెట్ మిత్రులకి" నా హెచ్చరిక!

ధన్యవాదాలు.