Monday, October 25, 2010

కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

చూశారా మన డీజీపీ యెంత గొప్ప డిఫెక్టివో--సారీ--డిటెక్టివో?

తూ ర క (తూటా రక్షణ కవచాలు) లని ప్రైవేటు గా అమ్ముకొనే ఆలోచన తోనే 'యెవరో' తరలించారు అని కనిపెట్టేశారు.

మనలాంటి వెర్రివాళ్లు ఇన్నాళ్లూ అవేవో "గొరక "ల్లాంటి చేపలేమో, కూరొండుకు తినేద్దామని యెవరో తరలించారేమో అనుకుంటున్నాము!

ఇప్పుడు వాటిని యెక్కడికి తరలించారో ఆ భవనం చిరునామా డోరు నెంబరు తో సహా కనిపెట్టేసి, అవి తరలించిన ఆటో డ్రైవరునీ, వాచ్ మన్ నీ అరెస్ట్ కూడా చేశారట.

ఇంకెవరినో సస్పెండు కూడా చేశారట. మరి అవి యెవరికి అమ్మడానికి తరలించారో అని 'విచారిస్తూనే' వుంటార్లెండి--మనకి చెప్పరు.

ట్వీటర్లూ--ఇదేదో బావుందని అస్తమానూ, కీబోర్డు చేతిలో వుందికదా అని, బోరవిరుచుకుని "ట్వీట్"లు వ్రాస్తే........?

ఒకాయన ఓ రాత్రి తన కారు స్వయంగా నడుపుకుంటూ వెళుతుంటే, ఘోర ప్రమాదం జరిగింది. కారు నుజ్జునుజ్జయిపోయింది. తేరుకొని, దెబ్బలూ గట్రాల సంగతి చూసుకొని, ఆనక బీమా కంపెనీకి సమాచారమిచ్చాడట. పోలీసుల దగ్గరనించి ఎఫ్ ఐ ఆర్ వచ్చాక, కంపెనీకి క్లెయిమ్ పంపించాడట, పరిహారం కోరుతూ.

3 రోజులు తిరక్కుండా, క్లెయిముని తిరస్కరించారట. కారణమేమిటీ అనడిగితే, "మద్యం మత్తులో కారు డ్రైవు చేశావు" అన్నారట. ఇదేమిటీ.....పోలీసు నివేదికల్లోగానీ, క్లెయిం దరఖాస్తులోగాని దీని ప్రస్తావన లేదే....అని ఆశ్చర్యపడి, లేచి, "మీకీ సమాచారం యెక్కడిది?" అంటూ నిలదీశాడట బీమా కంపెనీని.

వాళ్లు.....ప్రమాదం జరగడానికి అరగంట ముందు ఆయన ట్విట్టర్ లో "పార్టీ బాగా జరిగింది. చాలా మత్తుగా వుంది. కారు డ్రైవ్ చేసుకుంటూ ఇంటికెళ్తున్నాను" అని వ్రాసిన "కొక్కిరింత" ఆయన ముఖాన కొట్టారట!

ఓ 75 వేలకి కాళ్లొచ్చాయట!

నిర్లక్ష్యంగా మోటారు సైకిల్ నడుపుతూ, ఇద్దరిని ఢీకొట్టినందుకు, సెలెబ్రిటీ జాన్ అబ్రహాం కి 15 రోజుల సాధారణ జైలూ, 1500 జరిమానా విధించారట! బెయిలు మీద విడుదలయ్యాడుటలెండి.

12-10-10 : ఛత్తీస్ గఢ్ రాష్ట్రం, బిజాపూర్ జిల్లా పామేడు లో మార్కెట్ నుంచి తిరిగివస్తున్న కానిస్టేబుళ్లమీద పొంచివున్న మావిస్టులు కాల్పులు జరిపి, ఒకడు అక్కడే మరణించగా, రెండో అతన్ని వెంబడించి, కాల్చి, గొడ్డలితో నరికి చంపేశారట. ఇది పోలీసు స్టేషన్ సమీపం లోనేట. ఇందులో 15 మంది మావిస్టులు పాల్గొన్నారట.

14-10-2010 న పాకిస్థాన్ లో వుత్తర వజీరిస్థాన్ గిరిజన ప్రాంతాల్లో అమెరికా జరిపిన క్షిపణి దాడుల్లో 11 మంది తాలిబాన్లు హతమయ్యారట.  

2 comments:

జేబి - JB said...

హహ్హహా, కొక్కిరింత బాగుందండీ.

A K Sastry said...

డియర్ జేబి - JB!

చాలా సంతోషం. ఇది నా సొంత మాట కాదండోయ్! ఓ ప్రఖ్యాత హాస్య రచయిత, వెక్కిరింతకి ఆపోజిట్ గానో, దాంట్లో కొంటెతనం యెక్కువైతేనో, ఇలా వాడినట్లు గుర్తు. ఈ "ట్వీట్"లకి సరైన పదం అదే అనిపించి, వాడేశాను.

జవాబు ఆలస్యం అయ్యింది, యేమీ అనుకోకండేం? ధన్యవాదాలు.