Friday, October 1, 2010

తాజా కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

ఆలస్యం అయితే అయ్యిందిగానీ, బంగారం లాంటి తీర్పు వచ్చింది అలహాబాదు హైకోర్టు ధర్మాసనం నించి! ఇంతకన్నా యెవరూ గొప్పగా తీర్పు చెప్పలేరు--అనవసర రాధ్ధాంతాలకి తావులేకుండా!

ముస్లిం సున్నీ వక్ఫ్ బోర్డ్ మాత్రం, దాదాపు వాళ్లు లేవనెత్తిన ప్రతీ విషయాన్నీ, ముగ్గురు న్యాయమూర్తులూ
కొట్టేసినా, "  అంతా నాకే కావాలి "   అని సుప్రీం కోర్టుకి వెళ్లడానికి ఆలోచిస్తామంటోంది!

వీళ్లని చూసి, హిందూ మహాసభ కూడా, అదే ఆలోచనని వెళ్లగక్కింది!

సుప్రీం కోర్టు వీళ్ల అప్పీళ్లని మొదట్లోనే కొట్టేస్తుందని ఆశిద్దాం!

తీర్పు ముఖ్యాంశాలని చదవాలంటే.......www.rjbm.nic.in కి వెళ్లండి.

సెప్టెంబర్ 18 నాటికి ఆహార ద్రవ్యోల్బణం 16.44 శాతానికి చేరిందట. ఇంకా అసలు పండగలు దసరా, దీపావళీ ముందే వున్నాయి! అప్పటికి 30 శాతానికి చేరినా ఆశ్చర్యపోనక్కరలేదు!

బియ్యం రేట్లు తగ్గిపోతున్నాయని, మిల్లర్లు మళ్లీ మంత్రాంగం చేస్తున్నారట--సంబంధిత శాఖ ద్వారా సిఫార్సు చేయించుకొని, ముఖ్యమంత్రిని కలవడానికి సిధ్ధం గా వున్నారట--బియ్యాన్ని యేజిల్లాలో అయినా ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవచ్చు--అనే ప్రతిపాదన తో! (ఆ వంకన ఇతర రాష్ట్రాలకీ, దేశాలకీ ముసుగుల్లో అమ్మేసుకోవచ్చు అని వాళ్లల్లోనే కొంతమంది సంబరపడుతున్నారు! రోశయ్యా......వులకొద్దు, పలకొద్దు!)

ఆరు బ్యాంకులు తమ బేస్ రేటుని పెంచాయట--ఓ అర శాతం! మిగిలిన బ్యాంకులూ పెంచడానికి సిధ్ధం గా వున్నాయి. 

వాటితోపాటే ప్రత్యేక స్కీముల కింద డిపాజిట్ల మీద వడ్డీ రేట్లూ పెరుగుతాయి! ఋణాలమీద "టీజర్" రేట్లు డిసెంబరు నెలాఖరు దాకా కొనసాగవచ్చంటున్నారు. ఇదంతా యెంతసేపు--మళ్లీ రిజర్వ్ బ్యాంకు 'తగ్గించండి, తగ్గించండి ' అనేంతవరకూ!

"  తృటిలో.........."--రంగారెడ్డి జిల్లా, బషీరాబాద్ మండలం, మంతట్టి రైల్వే స్టేషన్ లో, గురువారం (30-09-2010) న రాత్రి 7-30 కి గోరఖ్ పూర్ నించి సికిందరాబాదు వెళ్తున్న ఎక్స్ ప్రెస్సూ, హైదరాబాదు నించి వాడీ వెళ్తున్న ప్యాసింజరూ, ఒకే పట్టాలపై, యెదురెదురుగా వచ్చేశాయట! పాపం ఆ డ్రైవర్లే జాగ్రత్తపడి, గుద్దుకోకుండా ఆపేశారట! రెండు రైళ్లలోనూ కొన్ని వందలమంది ప్రయాణిస్తున్నారట! 

ఒకవేళ డ్రైవర్లకి సాధ్యం కాకపోయి వుంటే!!!???...............గాడ్ ఓన్లీ హెల్ప్డ్ డ్! రైల్వే అధికారులు "విచారించడం" మొదలెట్టారట. మమతాదీ--యెన్నికోట్లు కేటాయించిందో--రైల్వే భద్రతకి!--అవేమౌతున్నాయో!

అవండీ సంగతులు.

2 comments:

భాస్కర రామిరెడ్డి said...

వార్తల బదులు మీ బ్లాగు చదివితే సరి, మూడు ముక్కల్లో వారం రోజుల కబుర్లు చెప్పేస్తున్నారు. Keep it up sir.

A K Sastry said...

డియర్ భా రా రె!

చాలా పెద్ద కితాబు ఇచ్చేశారు.....చాలా సంతోషం!

నా ప్రయత్నం కూడా అందుకే. అంతే కాకుండా, ముఖ్యమైన విషయాలమీద చర్చని ఆహ్వానించడం.

రెండోది ఇంకా నెరవేరలేదు.....త్వరలో అవుతుందని ఆశిస్తా!

ధన్యవాదాలు.