Thursday, February 27, 2014

కబుర్లు - 110అవీ, ఇవీ, అన్నీ

సౌదీ అరేబియా లో ఓ 30 యేళ్ల కుమారుడు తల్లితో కలిసి కారులో వెళ్తూండగా ఒక విషయం లో ఇద్దరికీ గొడవ వచ్చి, తల్లి ముఖం పై కొట్టడంతో ఆమె ఒక పంటిని కోల్పోయిందట. ఆవిడ పోలీసులకి ఫిర్యాదు చేస్తే, న్యాయస్థానం కొడుకు పన్నొకటి పీకెయ్యవలసిందిగా శిక్ష వేయడమే కాకుండా, 2400 కొరడా దెబ్బలు, (ఇంకా బతికి వుంటే) అయిదేళ్లు జైలు శిక్ష విధించాలని న్యాయ మూర్తి ఆదేశించారట.

"నేను విధి నిర్వహణలో కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నా. అసత్య ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల దృష్టి మరల్చాలని ప్రతిపక్షాలు చూశాయి. నేను బలహీనుణ్ణి కాను" అన్నాడట మొన్న  సుశీల్ షిండే. చూస్తే మన పాత తెలుగు సినిమాల అరవ విలన్‌  "కొట్టార్కఱ" లా వుంటాడు. అంత లావు లేడుగానీ "నెల్లూరు కాంతారావు" లా కూడా వుంటాడు. బలహీనుడు అని యెవరన్నారో మరి.

నిన్నేమో, "ఓ టీవీ ఛానెల్ వాళ్లు యేదేదో మాట్లాడుతున్నారు.......వాళ్లని అణిచేస్తాము" అన్నాడట. ఇంకా యెవరైనా అంటారా బల హీనుడు అని?

మొన్న ఒక ఉపాధ్యాయురాలు ఫరీదాబాద్ లో, హెడ్ ఫోన్‌స్ తో, మొబైల్ లో మ్యూజిక్ వింటూ పట్టాలు దాటుతుంటే, ఓ రైలు వచ్చి గుద్దేసి, వెంటనే తునాతునకలై చచ్చిపోయిందట.  ఆమెకి గతేడాదే వివాహం అయిందట. హెడ్ ఫోన్లు లేకుండావుంటే ఆ ప్రమాదమే జరిగేదికాదు అంటున్నారట పోలీసులు. చూశారా యెంత ఘోరమో! సంగీతం అంటే యెంత ఇష్టం అయినా వుండొచ్చు. అలా అని వేళా పాళా లేకుండా ఇలా చెయ్యడం యెందుకు?

రైళ్లలో కూడా చూస్తూ వుంటాం. అందరూ నిద్ర పోయే సమయం లో మొబైల్ లో పాటలు గట్టిగా పెట్టేస్తూ వుంటారు. అవి యెంత గొప్ప పాటలైనా అవ్వచ్చు, శాస్త్రీయ సంగీతం అయ్యుండవచ్చు, అందరూ మామూలుగా చాలా ఇష్టపడే పాటలే కావచ్చు. కానీ సమయం, సందర్భం ఉండొద్దూ? అంతకీ వినాలని వుంటే హెడ్ ఫోన్లు పెట్టుకొని వినొచ్చుగా? ఈ పిచ్చి మధ్యాహ్నం పూటకూడా వుంటుంది కొంతమందికి. ఏసీల్లోనూ, స్లీపర్లలోనూ ప్రయాణించేది విశ్రాంతిగా గమ్యాన్ని చేరడం కోసమే కదా? ఆలోచించండి.

2 comments:

TVS SASTRY said...

నేరచరితఉన్నవారైతే నేరస్తులను బాగా అదుపు చేస్తారేమో!

Ammanamanchi Krishna Sastry said...

డియర్ శాస్త్రిగారూ!

అలా అంటారా. నేనైతే, యేదో ఒక ఒప్పందం చేసుకొని, ఆ సౌదీ న్యాయమూర్తులని కొన్నాళ్లు మనం దిగుమతి చేసుకొంటే బాగుండును అనుకున్నాను.

ధన్యవాదాలు.