అవీ, ఇవీ, అన్నీ
ముకేష్ అంబానీ ముంబాయిలో "యాంటిల్లా" పేరుతో నిర్మించిన 27 అంతస్తుల నివాస భవనం లోని పనివాళ్ల సంఖ్య 600 ట. వాళ్ల జీతాలు ఒక్కొక్కరికీ 6000 నించి 6500 మధ్య వుంటాయట.
(ఇంతకు ముందే 17 అంతస్తులో యెన్నో వున్న నివాస భవనం వుంది కదా, మళ్లీ ఇదెందుకు అని అడిగితే, ఇది మా సంస్థల వున్నతోద్యోగులకి అని జవాబిచ్చాడోసారి--ఈయనేనో, ఇంకో అంబానీనో.)
పుడితే--గాలి గనులతో సంబంధం వున్న ప్రభుత్వ శాఖల్లోనైనా, అంబానీల ఇళ్లలో పనివాళ్లగానైనా పుట్టాలని చాలామంది అనుకుంటున్నారట!
అరుంధతీరాయ్ అని ఒకావిడవుంది. (అధోగతీరాయ్ అని పేరుపెట్టారో బ్లాగరు ఈమెకి!). యెప్పుడో ఓ పుస్తకం వ్రాసి, అదృష్టం బాగుండో, పైరవీలు పనిచేసో దానికి ఓ ఎవార్డు సాధించింది. తరవాత చెయ్యడానికి పనేమీలేక, పేపర్లకి యెక్కుతూ, వుద్యమకారిణి అని వ్యవహరించబడుతోంది.
అన్నా హజారే వుద్యమం "ప్రపంచ బ్యాంకు అజెండా"కి నకలు అనీ, అలాంటి వుద్యమాలని "నిర్మించడానికి" ప్రపంచ బ్యాంకూ, ఫోర్డ్ ఫౌండేషన్ "నిధులు" అందజేస్తాయి అనీ, హజారేను "ఆరాధ్యుడు" గా ప్రచారం చేశారనీ, అది ఆందోళనకరమైన విషయం అనీ, ఆయన బృందం రూపొందించిన జనలోక్ పాల్ బిల్లు పైనా తనకి అనేక సందేహాలున్నాయి అనీ--రెచ్చిపోయిందట ఓ టీవీ ఛానెల్లో!
చూశారా--యెవరికీ తెలియని విషయాలని ఈవిడ యెలా కనిపెట్టి ప్రచారం చేసేస్తోందో? జనాలు వెర్రి పుచ్చకాయలు అనుకుంటారో యేమిటో ఇలాంటి కుహనా మేధావులు!
"కాస్త నదురుగా వున్న ఓ బ్లాగులో ఓ అడ్డమైన కామెంటు వ్రాసేస్తే, నాకు పాపులారిటీ వస్తుందని అలా చేశాను....నన్ను క్షమించండి" అన్నాడిదివరకో కుర్రాడు. ఆ కుర్రాడికీ, ఈవిడకీ తేడా యేమీ కనిపించడంలేదు నాకు.
మా వూళ్లో, గణపతి వుత్సవాల సందర్భంగా "రాష్ ట్ర స్థాయి సినీ డ్యాన్స్; పాటల పోటీలు" పెట్టారు! బహుమతులు వరుసగా, రూ.1500/-, షీల్డు; రూ.1000/-, షీల్డు; రూ.600/-, షీల్డు; ఇంకా "కన్సొలేషన్" ఇచ్చారట. ఎంట్రీ ఫీజు ఒక్కొక్కరికీ రూ.50/- మాత్రమేనట.
ఇంక యెలా నిర్వహించారో మీరే వూహించుకోండి!
భక్తి వ్యాపారులూ--జిందాబాద్!
"చిరు" కాంగీలో విలీనం అయినా, "తనదైన ముద్ర" కోసం "వ్యూహాత్మకంగా" అడుగులు కదుపుతున్నాట్ట! ప్రత్యేకంగా ఓ క్యాంపు కార్యాలయం యేర్పాటు (అంటే--ఇంతకు ముందు ప్రరాపా ప్రథాన కార్యాలయం పేరు మార్పు!), త్వరలో ఒక టీవీ ఛానెల్ (దీనికి "ఎస్ న్యూస్" అని పేరు పెడతారట. "ఎస్" కి సంబంధించిన సెంటిమెంట్ యేమిటో మరి!) యేర్పాటు, వివిధ కేంద్రాల్లో "ప్రాంతీయ విలీన మహాసభలు" నిర్వహించడం (పనిలో పనిగా బలప్రదర్శనకి వాటిని వేదికలుగా వుపయోగించుకోవడం), ఇంకా ఓ న్యూస్ పేపరు పెట్టడం--ఇలా పడుతున్నాయట ఆ అడుగులు.
యెన్నికల ప్రచారంలోనూ, ఆ తరవాతా, పాటీయా....పిచ్చా....?రోజుకి ఓ అరలక్షమందికి తీర్థ ప్రసాదాలు (అనేక వెరయిటీల్లో) అందించి, కాటాకి వచ్చేసి, కాంగీలో చేరినందుకు వాళ్లు ఇచ్చిన (తొడుక్కునే) కోట్లు--ఈ పథకాలన్నింటికీ సరిపోతాయా? యేమో!
"స్వంత పనుల" నిమిత్తం మలేషియా ప్రయాణం కూడా పెట్టుకొన్నాట్ట.
ఇవన్నీ "అధిష్టానం" సీసీ కెమేరాల్లో రికార్డు అవుతున్నాయనీ, తోక కాదు--దానిలోని వెండ్రుకలు కదిలినా, తోక మొత్తం తెగిపోతుందనీ గుర్తుంచుకొంటాడా?
చూద్దాం!
2 comments:
అరుంధతి రాయ్ చెప్పినదాంట్లో తప్పేమీ లేదు. అవినీతి కంటే పెద్ద సమస్యలు ఉండగా వాటి గురించి మాట్లాడకుండా కేవలం అవినీతి గురించి మాట్లాడితే ప్రజలు ఎలా మోటివేట్ అవుతారు? http://telugu.stalin-mao.in/69203719
డియర్ ప్రవీణ్ శర్మ!
మిగిలిన విషయాలు తరవాత.....దేనికైనా సమయం సందర్భం వుండాలని ఇదివరకో టపా వ్రాశాను. చదవండి. 'బారాందే' దీక్ష యెందుకు ఫెయిల్ అయ్యింది? అందుకే! ఇంక, "అరుణా రాయ్" అనే ఆవిడెవరో ఇంకో ముసాయిదా ప్రకటించగానే, దాన్ని కూడా "స్థాయీ సంఘానికి" పంపించేసింది ప్రభుత్వం!
ఈ చికెన్ బ్రెయిన్స్, రాజకీయుల చేతుల్లో పావులుగా, తమకు తెలియకుండానే, వార్తల్లో వుండాలనే తపనతో, మారుతున్నారని వాళ్లు యెప్పుడు గ్రహిస్తారో!
Post a Comment