అవీ, ఇవీ, అన్నీ
బస్సుల్లో రిజర్వేషన్లకి వెయిటింగ్ లిస్ట్, సగం మంది మిగిలినా ఇంకోబస్సూ--ఇలా సంతోషించినంతసేపు పట్టలేదు--మళ్లీ మెలికలు పెట్టారు. ఇలా ప్రత్యేకంగా వేసిన బస్సుల్లో 50శాతం రుసుం అదనంగా వసూలు చేస్తారట! గరుడ బస్సుల్లో వెయిటింగులిస్ట్ అంటూ 5 టిక్కెట్లే ఇస్తారట. అలా 20 మంది దాటినా గరుడ బస్సులని మాత్రం ప్రత్యేకంగా వేయరట! మరి కేన్సిలేషన్లేవీ లేకపోతే, వెయిటింగ్ లిస్ట్ వాళ్ల గతేమిటో! సూపర్ లగ్జరీలకి అయితే, వాళ్లకి యే బస్సులో సీటు కేటాయించారో, ఎస్ ఎం ఎస్ పంపిస్తారట!
Indian Minerva పొరపాటున Indianrailways.gov.in లోకి వెళ్లి వుంటారు.
అనేకసార్లు "వెబ్ పేజ్ నాట్ అవైలబుల్" అని, యెప్పటికో వోపెన్ అవుతుంది. వెబ్ సైట్ ప్రారంభమైనప్పటినుంచీ, దాదాపు మూడునెలలకిపైగా "ఈ టికెటింగ్ ఫెసిలిటీ హేస్ బీన్ టెంపరరిలీ స్టాప్డ్...." అనే చూపిస్తోంది.
మిగిలిన ప్యాసెంజర్ సర్వీసెస్ లో, జర్నీ ప్లానర్, పీ ఎన్ ఆర్ స్టేటస్, ఎరైవల్/డిపార్చర్ లు బాగానే పని చేస్తాయి మన అదృష్టం బాగుంటే!
టికెట్ రిజర్వేషన్ కి మాత్రం ఇంకా ఐఆర్ సీటీసీనే బాగుంది.
మొన్ననే, కి కు రె మన రాష్ట్రంలో "స్త్రీనిధి" అని ఓ బ్యాంకులాంటిది--1098 కోట్లతో ప్రారంభించాడు. దీని వుద్దేశ్యం--డ్వాక్రా సంఘాల సభ్యులు, సూ ఋ సంస్థల బారిని పడకుండా, తమకి తామే అప్పులు ఇచ్చుకొంటూ, తీర్చుకొంటూ 'అభివృధ్ధి' చెందడానికట.
మరి అభివృధ్ధికల్లా మూలం యేమిటి? ఇంకేమిటి--రాష్ట్ర వ్యాప్తంగా 925 సంఘాలకీ, 925 కోట్లతో "కమ్యూనిటీ" భవనాల నిర్మాణం(ట). మిగిలే కోట్లతో, ఒక్కో సభ్యురాలికీ రూ.15,000/- మాత్రమే ఋణంగా ఇవ్వడం(ట).
లక్షల్లో అప్పులుచేసి, బంగారాలు కొనేసి, వాయిదాలు కట్టడానికి మళ్లీ వాటిని "ముత్తూట్"; "మణుప్పురం" లలో తనఖాపెట్టి, అవీ తీర్చలేక, ఇవీ తీర్చలేక కాదూ--మహిళలు విషవలయం లో చిక్కుకున్నది? వీళ్లకి 15 వేలు యేమూలకి?
ఇంక "వాళ్లేమో" బంగారాన్ని కరిగించేసి, లక్ష్మీదేవి బొమ్మతోనూ, మేరీమాత బొమ్మతోనూ.....ఇలా నాణాలు తయారుచేయించి, (అప్పట్లో తక్కువరేటుకి 'పడేసుకొన్న' బంగారాన్ని, ఇప్పటి యెక్కువరేటుతో అమ్ముకొని,) కొన్ని వందల కోట్లు కేరళకి తరలించుకుపోతున్నారు! ఆర్బీఐ యేమో ఇప్పుడు "ఎన్ బీఎఫ్ సీ"లకి కొన్ని నిబంధనలు విధించడం గురించి ఇంకా 'ఆలోచిస్తూంది!'(ట).
సరేలెండి. బాగానే వుంది కదా.
ఇంక, ఓ "క్రీడాధికారి" మొన్నంటాడూ--క్రీడలకి 'ఇతోధిక' ప్రోత్సాహం ఇవ్వడానికి, 923 కోట్లో యెంతో పెట్టి, అన్ని గ్రామాల్లో, "క్రీడా ప్రాంగణాలు" నిర్మిస్తారట! (ప్రాంగణాలంటే స్టేడియం లు కాదట--ప్రత్యేక భవనాలేమో!)
ఇంకో మంత్రంటాడూ, యేలూరులో యెప్పుడో నిర్మించిన "స్టేడియం" శిధిలమైపోయింది, దాన్ని త్వరలో, కొన్ని కోట్లతో పునర్నిర్మిస్తాము అని! (ఆ స్టేడియం నిర్మించాక ఒకటో రెండో రంజీ మ్యాచ్ లు తప్ప, అక్కడ యేక్రీడా జరగలేదు--మదన కామ క్రీడలు తప్ప!)
యెవరూ 1000 కోట్ల గురించి మాట్లాడడంలేదు చూడండి! అలా మాట్లాడితే, సీబీఐ వాళ్లు వెంట తరుముతారో యేమో ఖర్మ!
అసలు ఈ రానాలు మట్టినీ, ఇసుకనీ, సిమెంటునీ, కంకరనీ ఇలా తినేసి, అరిగించేసుకొంటూ, పొట్టలు పెంచేసుకొంటూ వుండగా, గాలో యెవడో ఇనుముని డెభ్భైనాలుగో యెన్నో కిలోల బంగారంగానూ, 23 యెన్నో కోట్ల నగదుగానూ మార్చుకున్నాడని యేడవడం యెందుకు???!!!
ఇంక మన ఆర్ టీ యే లగురించి యెంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. దశాబ్దాల క్రితమే "బ్రోకర్ల" వ్యవస్థ రద్దు చేసినా, మనం యేదైనా పనిమీద అక్కడికి వెళితే, అక్కడ అసలు వుద్యోగులు వుండరు--వాళ్లు నియమించుకున్నవాళ్లు వాళ్ల పని చేసేస్తూ వుంటారు. వాళ్లు "మీ బ్రోకరు యెవరు? అతన్ని పంపించండి" అంటారు. అక్కడి "హెల్ప్ డెస్క్"లు బ్రోకర్లకీ, వుద్యోగులకీ మధ్య సూపర్ బ్రోకర్లుగా మారాయి!
ఇంక, కోట్లతో టెస్ట్ ట్రాక్ లూ, సిమ్యులేటర్లూ యేర్పాటు చేస్తున్నాం, ఆన్ లైన్ లో అవి చేస్తాం, ఇవి చేస్తాం అంటారు గానీ, కొన్ని వందల ట్రాఫిక్ సిగ్నల్స్ లో యే రెండో మూడో అడిగి, లైసెన్స్ ఇచ్చేస్తారు! కొన్న బైక్ స్పీడ్ యెంత, సరిగ్గా బ్రేక్ వెయ్యగలడా, పార్కింగ్ చెయ్యడం వచ్చా, ఓవర్ టేకింగ్ యెలా చేస్తున్నాడు--ఇలాంటివన్నీ పరీక్షించరు! అలా జరిగి వుంటే, ఓ "అయాజ్" బలయి వుండేవాడుకాదు పాపం!
అన్నట్టు మన గవర్నరు గారు, స హ చట్టం మంచిదే గానీ, అది దుర్వినియోగం అయిపోతోంది....దానిపేరు చెప్పి అధికారులని బెదిరించేస్తున్నారు....అని వాపోయారట! తోలుమందం అధికారులని అలా "బ్లాక్ మెయిల్" చేసినా తప్పులేదంటాను నేను. మరి ఆయనకి అంత బాధ యెందుకు వచ్చేసిందో!
3 comments:
> నిర్మించాక ఒకటో రెండో రంజీ మ్యాచ్ లు తప్ప, అక్కడ యేక్రీడా జరగలేదు--మదన కామ క్రీడలు తప్ప!)
:-))
అవి "పూటకి" 2+ జరుగుయాయేమో?
typo in previous one.
:-))
అవి "పూటకి" 2+ జరుగుతాయేమో?
పై అన్నోన్!
అడపాదడపా అలాంటి వార్తలే వచ్చేవి పేపర్లలో!
ధన్యవాదాలు.
Post a Comment