అవీ, ఇవీ, అన్నీ
ఖత్రోచీ (బోఫోర్స్) విషయం లో మొన్న 4వ తేదీన, సీబీఐ తరఫున--ఐటీ ట్రిబ్యునల్ చెప్పినదాంట్లో కొత్త విషయం యేమీ లేదు అనీ, అందుకని ఆయన పై కేసు వుపసం హరణకి అనుమతి ఇవ్వాలనీ, నిస్సిగ్గుగా, ఢిల్లీలో చీఫ్ మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు వాదించాడట--అదనపు సొలిసిటర్ జనరల్ మల్హోత్రా!
ఇంకోవైపు, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం, టెలికాం విధానాలపై 2001 నించీ ఇప్పటివరకూ యేదైనా నేరం జరిగిందా అన్నకోణం లో విచారణ జరుపుతుందట--అదే సీబీఐ. గుర్తు తెలియని వ్యక్తులని ఇందుకు బాధ్యులుగా పేర్కొని, విచారించడం మొదలెట్టిందట. కొండనే తవ్వుతుందో, యెలకనే పడుతుందో, వాజపేయీనే పట్టుకుంటుందో....చూద్దాం!
మన సుప్రీం కోర్టు మాజీ ప్రథాన న్యాయమూర్తి, మానవహక్కుల కమిషన్ చైర్మన్, జస్టిస్ కేజీ బాలకృష్ణన్ మరిన్ని వివాదాల్లో చిక్కుకొన్నారట. ఆయన తమ్ముడూ, మరో అల్లుడూ ఆదాయానికి మించిన ఆస్థులున్నాయని ఆరోపణలు యెదుర్కోవడంతో, భాస్కరన్ ను తన కేరళ 'ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ' పదవిని వదులుకొని, సెలవులో వెళ్లవలసి వచ్చిందట. రెండో అల్లుడు ఎంజే బిన్నీ రెండేళ్లలో, కోచి శివార్లలో విలువైన ప్లాట్ల కొనుగోలు చేశారట.
ఆయన అల్లుడు పీవీ శ్రీనిజన్ అక్రమాస్థుల వ్యవహారంలో విచారణ విషయం పై సీఎం సిఫార్సులు, మళ్లీ 'హోం శాఖ కార్యదర్శి ' పరిశీలనలో వున్నాయట.
ఓ ప్రక్కన యూపీలోనూ, ఇతర హై కోర్టుల్లోనూ, "అంకుల్ జడ్జ్" వ్యవహారాలు శృతి మించుతున్నాయని గోలొకటి! శాంతి భూషణ్ ఆయన కొడుకూ ఓ డజను మంది సుప్రీం కోర్టు ప్రథాన న్యాయమూర్తులందరూ అవినీతిపరులేనని ఢంకా బజాయించి, కోర్టు ధిక్కరణ చర్యలు మీకు దమ్ముంటే తీసుకోండి అని సవాలు విసిరారు.
బాగుంది కదూ! మన న్యాయ వ్యవస్థ!
'సీనియర్ ' కాంగీ నేత దిగ్విజయ్ సింగ్--ముంబాయి వుగ్రవాద దాడుల్లో బలైపోయిన మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారి హేమంత్ కర్కరే చనిపోయేముందు--తనకి ఫోను చేశాడని ప్రకటించిన విషయం తెలుసుగా?
ఇప్పుడు, పిల్లికి యెలక సాక్ష్యంగా, 'ఆరోజున ఏటీఎస్ కార్యాలయం (ల్యాండ్ లైన్) నుంచి తన సెల్ ఫోన్ కి కాల్ వచ్చిందని ', బీ ఎస్ ఎన్ ఎల్-భోపాల్ కార్యాలయం నుంచి సంపాదించిన 'కాల్ రికార్డ్స్ ' చూపిస్తున్నాడట. అంతేకాదు ఇంతవరకూ తనను విమర్శించినవారందరూ తనకి క్షమాపణ చెప్పాలి అని డిమాండు చేశాడట.
(ఆ కాల్ లోనే తనకి 'హిందూ తీవ్రవాదుల ' నుంచి ప్రాణభయం వుందని కర్కరే తనకు చెప్పాడు అని ఇదివరకు ఆయన చేసిన ప్రకటన! దీనికి యెలాంటి ఆథారాలూ లేవని ముంబాయి పోలీసు శాఖ ప్రకటించింది.)
మరి, తన పై అధికారులకీ, తమ రాష్ట్ర హోం మంత్రికీ, ముఖ్యమంత్రికీ--ఇలా యెవరికీ ఆ విషయం చెప్పకుండా, తనకీ, వాడికీ, పాకిస్థాన్ తీవ్రవాదులతో సంబంధాలు వున్నందుకే 'హిందూ తీవ్రవాదుల ' నుంచి తనకి ప్రాణభయం వుంది అని చెప్పాడా? అనే విషయం వాడు బయటపెట్టలేదు మరి!
అసలు వాడిని మన మావిస్టు వ్యతిరేక పోలీసులకప్పగించి, వాళ్ల పధ్ధతిలో ప్రశ్నించమంటే, ఆ రికార్డు అయిన కాల్ యెవరు, యెందుకు, యేమని, చేశారో బయటపెట్టునేమో! ప్రయత్నించేవాళ్లెవరు?
మన రాష్ట్ర ఆశా వర్కర్లు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా వున్న తమ కనీస వేతనాలు, పారితోషికాలు వగైరాల కోసం, జడ్పీ సమవేశం లో వున్న చెల్లెమ్మ సబిత బయటికి వచ్చి, తమ సమస్యలు వినాలని బైఠాయించి నినాదాలు చేస్తుంటే, ఆవిడ మెప్పుకోసం "తోటి ఆడ" పోలీసులు వాళ్లని చితక బాదారు.
అయితేనేం, ఆశా వర్కర్లు అనుకున్నది సాధించారు. జీతాలూ అవీ బాగానే పెరిగాయి అంటున్నారు.
2 comments:
> ఆవిడ మెప్పుకోసం "తోటి ఆడ" పోలీసులు వాళ్లని చితక బాదారు
వాళ్ళు నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలిగా!
అయ్యా! panipuri123!
పైన అన్ని విషయాలుండగా, మీకు "ఆడ పోలీసుల" మీద అంత సానుభూతి యెందుకో? అయినా నాలుగురాళ్లు వెనకేసుకోడానికి అదే మార్గమంటారా?
యేదైనా టపా పూర్తిగా చదివినందుకు ధన్యవాదాలు. (అదీ మొదటిపేరా, చివరి పేరా ట్రిక్కేనా?!)
సరదాగానే వ్రాశాను. యేమీ అనుకోవద్దు.
Post a Comment