Thursday, January 6, 2011

కబుర్లు

అవీ, ఇవీ, అన్నీ

మన రాష్ ట్రపతులు బాబూ రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధా కృష్ణన్, డాక్టర్ జాకీర్ హుస్సేన్ లాంటి వుద్దండుల్ని స్మరించుకుంటూనే, ఇందిరాగాంధీ కి వత్తాసు పలికిన వాడెవడో రాష్ ట్రపతి నించీ, "రబ్బరు స్టాంపు" అని పేరు తెచ్చుకొన్నవాళ్లగురించీ, మధ్యలో నీలం సంజీవరెడ్డి, వీ వీ గిరి లాంటి వాళ్ల గురించీ తలుచుకొంటూంటే, ఈ వ్యవస్థ యెలా దిగజారి, రబ్బరు స్టాంపు నించి, "ప్రభుత్వ చిహ్నం" దాకా యెలా భ్రష్టుపట్టిందో అనిపిస్తుంది.

"గంగా కూలంకష....." పద్యం ఙ్ఞాపకం వస్తూంది.

ఎన్ డీ యే హయాములో, ఏ పీ జే అబ్దుల్ కలామ్! ఈయనని 'నాన్ కాంట్రవర్షియల్' క్యాండిడేట్ గా ప్రతిపాదిస్తే, అడ్డుకొనే దమ్ములు యెవరికీ లేకపోయాయి.

(గమనించండి--నేను ఆయన్నీ, ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్నీ కించపరచడం లేదు--ఆయన మీద 'హైప్' క్రియేట్ చేసిన వాళ్లనే అంటున్నాను. ఆ పదవికి అప్పట్లో ఆ క్వాలిఫికేషన్ కి మించి ఆయన కి యేమైనా వుందా?) 

ఇంతకీ ఈయన యెవరు? 'ప్రఖ్యాత శాస్త్రవేత్త?!' ఈయన యేరకం శాస్త్రవేత్తో నాకు తెలియదు. 1940 ల్లో, మద్రాస్ విశ్వవిద్యాలయం నించి "ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగు" లో పట్టా పుచ్చుకున్నాడు. (అప్పటికి మనకి డకోటా విమానాలు కూడా లేవు!).

తరవాత్తరవాత, ఓ బుర్రోవాదిగా, కర్రపెత్తనం చేస్తూ, తన క్రింది వాళ్లని పరుగులు పెట్టించి, లక్ష్య సిధ్ధిని పొందాడాయన--సి సీ ఎం బీ లోనూ, ఇస్రో లోనూ--ఇలా. 

ఇస్రో శాస్త్రవేత్తలు ఓ తేలికపాటి లోహాన్ని కనిపెడితే, (రాకెట్ల సంగతి తరవాత), పోలియో వ్యాధిగ్రస్తులకి కేలిపర్స్ లో ఆ లోహం వాడితే బాగుంటుంది కదా?! అని ప్రశ్నించి, దాన్ని నిజం చేసిన మానవతావాది ఆయన!

ఇక మన ప్రథమ మహిళ దగ్గరకొస్తే, ఆ రోజుల్లో వున్న రాజకీయాలకనుగుణంగా, కేవలం లింగ ప్రాథాన్యంతో (ప్రథమ పౌరుడు--ఆవిడ భర్త మీద కొన్ని ఆరోపణలున్నా) పీఠాన్నెక్కిందీమె!

చక్కగా వుపదేశాలు చేస్తోంది--ఆ పీఠం నించి. వినదగునెవ్వరు చెప్పిన.....కదా!

రేపొచ్చేవాళ్లెవరో మరి!

ఆత్మ హత్య మహా పాపం! చేసుకోకండి!

అని చెప్పాల్సిన ప్రభుత్వం, మన రా నా లూ, ఈ మాట చెప్పడం లేదు. 

చేసుకొన్న వాళ్ల కుటుంబాలకి ప్రభుత్వం ఓ 2.5 లక్షలూ, జగన్ ఓ లక్షా, చిరంజీవి ఓ పాతిక వేలూ, సూ ఋ సంస్థలు బీమా ద్వారా ఓ లక్షా.....ఇలా ఇస్తూ పోతూ, మిగిలినవాళ్లని ప్రోత్సహిస్తున్నారు.

ఒకప్పుడు యెండమూరి వీరేంద్రనాథ్ నవల్లో, సలీం శంకర్ బదులు యెవడో, కొంత మొత్తానికి ఆశపడి, వాడి స్థానం లో వెళుతున్నాడంటే.....ఇలా జరిగే అవకాశం వుందా? అని అలోచించేవాళ్లం. ఇప్పుడు.......యేదైనా జరగొచ్చు! అని నిర్వేదం!!!!

బాబులూ.....ఆత్మహత్యల్ని ప్రోత్సహించకండి! అవి మహా పాపం అనే చెప్పండి!

6 comments:

shankar said...

"బాబులూ.....ఆత్మహత్యల్ని ప్రోత్సహించకండి! అవి మహా పాపం అనే చెప్పండి!"

అలా చెప్తే ఎలా? ఆ చావుల పేరు మీదే వీళ్ళు ఓట్లు దండుకునేది. ఉద్వేగాలు రెచ్చగొట్టేది.
ఎందుకు చచ్చాడు, ఎలా చచ్చాడు, ఎవరు ప్రోత్సహించారు? అనేవి ఎవరికీ అవసరం లేదు
చచ్చాడు అన్నది ఒక్కటి చాలు. చెప్పుకుని ఓట్లు తెచ్చుకోడానికి.
దీన్నే శవ రాజకీయం అనుకుంటే.....నాకేం అభ్యంతరం లేదు

తెలుగు said...

అయ్యా ఒసామా...! ఇది నిజంగా నసగడమే...
1930లోనే హైదరాబాదు బేగంపేట విమానాశ్రయం ఉండెడిది... అప్పట్లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు విమానంలో ముంబై, కరాచి, జైపూర్ వంటి నగరాలకు వెళ్ళి అక్కడి రాజులతో టెన్నిస్ ఆడుకునేవాడని మా తాతలు ముచ్చట్లాడితే విన్న గుర్తు. మరీ ఇంతగా దెప్పిపొడవాల్సిన అవసరమా...

Snkr said...

:) పెసురుంట్ల గురించి మీరు చెప్పిందాంతో ఏకీభవిస్తున్నా. కలాం అవకాశాన్ని బాగా వాడుకున్నారు, మలుచుకున్నారు. ఆయనకు పిల్లలంటే ప్రేమ అట! కూడా.. (అబ్బే, మాకు వల్లమాలిన ద్వేషమయినట్టు!). ప్రభుత్యోద్యోగులకు నిద్రపోయి కలలు కనమన్న ఆయన పిలుపు మెచ్చుకోవాల్సిందే. అంతకన్నా ఏంచేయగలరు?

మిడిగుడ్ల స్పీకర్ మీరాకుమారి అర్ధనిమీలిత నేత్రాలతో ఆవిడ ప్రవచనాలపై మీ ఆలోచనలేమిటి? :))

కృష్ణశ్రీ said...

డియర్ shankar!

దాన్ని 'శవ రాజకీయం' అనేకన్నా, ప్రభుత్వ హత్యలు అనీ, రాజకీయ 'కిరాయి' హత్యలు అనీ అనచ్చునేమో.

లేకపోతే, "విద్యార్థులూ! ఆత్మహత్యలు చేసుకోకండి" అని పిలుపిస్తున్నారు అంటే--"ఇప్పుడే హత్యలు చెయ్యం" అని హామీ ఇస్తున్నారో, "రేపణ్నించీ హత్యలు చెయ్యక తప్పదు సుమా" అని హెచ్చరిస్తున్నారో అర్థం కావడం లేదు జనాలకి!

రేపటినించి పేపర్లూ, టీవీలూ చూసేదాకా అర్థం కాదు!

ధన్యవాదాలు.

కృష్ణశ్రీ said...

డియర్ తెలుగు!

నాది నసుగుడు కాదు 'సణుగుడు' అండోయ్!

మీరు విన్నది అతిశయోక్తి అనుకోవచ్చు యెందుకంటే......

JRD టాటా 15-10-1932 న తాను పైలట్ గా "సింగిల్ ఇంజన్‌డ్ డి హావిల్లాండ్--పుస్ మోథ్" విమానాన్ని కారాచీలోని ఏరోడ్రోం నించి అహమ్మదాబాద్ మీదుగా, బోంబే జూహూ 'ఎయిర్ స్ట్రిప్' వరకూ నడిపాడు!

1930 లో మీ నవాబుగారికి 18 యేళ్లు. 1948 లో అయన చనిపోయేనాటికి 37 యేళ్లు. అప్పటికి బోంబేలోనే ఎయిపోర్టు లేదు--బేగంపేటలో వుందంటారా?

1944 వరకూ జరిగిన ప్రపంచ యుధ్ధం లో వాడినవే--ఓ మోస్తరు విమానాలు. కార్లకి వుపయోగించే మోటార్లనే వాటికీ వాడేవారు. పాత సినిమాలు చూస్తే, కారు మెకానిక్కులు వాటిని రిపేరు చెయ్యడం చూస్తారు! నేతాజీ చనిపోయింది అలాంటి విమానం లోనే!

అబ్దుల్ కలాం వయస్సు 1951 నాటికి 20 యేళ్లు--అప్పటికే ఆయన పట్టా తీసుకున్నాడనుకున్నా, ఆ 'ఇంజనీరింగు' విలువ యెంత?

మీ విమర్శకి ధన్యవాదాలు.

కృష్ణశ్రీ said...

డియర్ Snkr!

అలా అనకండి. నిజంగా ఆయన ఓ విలక్షణ వ్యక్తి. 'కలలు కనండి......' అని ఆయన ప్రబోధించినది అందరికీ! ఈ రోజు చిన్నారులు విలక్షణ కలలు కని, ఆవిష్కరణలు చేస్తున్నారంటే....ఆయన చలవే!

తిట్టవలసింది....ఆయన పదవిలోకి వచ్చాక అనవసరంగా పొగిడినవాళ్లనీ, రెండోసారి పదవిలోకి రాకుండా అడ్డుకున్నవాళ్లనీ.....అంతే!

మీరా కుమార్ ప్రవచనాలని ఇంతవరకూ విన లేదు. విన్నాక వ్యాఖ్యానిస్తా!

ధన్యవాదాలు.