అవీ, ఇవీ, అన్నీ
"కృష్ణా ట్రిబ్యునల్ తీర్పును పరిశీలిస్తే....కేవలం సాంకేతిక అంశాలే కాకుండా రాజకీయాలు కూడా పనిచేశాయా? అనే అనుమానం కలుగుతోంది. దీనిపై రైతులు, ప్రజలు ఉద్యమించకపోతే వచ్చే నలభై యేళ్లదాకా రాష్ ట్రానికి విముక్తి వుండదు."
-- చెరుకూరి వీరయ్య
ఈ మధ్య విజయవాడ పోలీసు కమీషనర్ పి. సీతారామాంజనేయులు, తగిన సాక్ష్యాధారాలతో మీడియా తనమీద ఆరోపణలు చేస్తే, తనకి కొంతమంది స్త్రీలతో పరిచయం వున్న మాట నిజమేగానీ, తన క్యారెక్టర్ బ్లెమిష్ లెస్ అనీ, కావాలంటే తాను ఇంతకు ముందు పనిచేసిన ఐదారు జిల్లాల్లో ఎంక్వైరీ చేసుకోవచ్చు అనీ కుప్పిగంతులు వేయడం చూస్తుంటే, ఇన్నాళ్లూ ఆ వుద్యోగం యెలా వెలగబెట్టాడా అని అనుమానం వస్తూంది. పైగా ఇటీవలే పదోన్నతి కూడా ఇచ్చారట! ఇంకా బదిలీయే చెయ్యలేదట. ఇప్పుడు సస్పెండు అయినట్టున్నారు.
మావిష్టులు :
"......ఏ వో బీ (ఆంధ్రా ఒడిసా బోర్డర్) లో మాత్రం చెలరేగిపోతున్నారట. అక్కడ 'బహిరంగ కార్యక్రమాలు ' నిర్వహిస్తున్నారట. ప్రభుత్వ ఆస్థుల దహనం, ఇన్‌ఫార్మర్ల హత్య, మారుమూల అటవీ ప్రాంతాల్లో బహిరంగ సమావేశాలూ నిర్వహిస్తున్నారట. ఫలితంగా, పోలీసులు నిర్వహిస్తున్న దాడుల్లో, మొన్న అన్నవరం పరిధిలో జరిగిన ఎన్‌కవుంటర్లో 5 గురు మావిష్టులు మరణించారట. తరవాత విజయనగరం పరిధిలో ఒక మావిష్టు మరణించాడట. కొంతమంది పట్టుబడ్డారట".
ఇలా పోలీసులు తమ ఆధిపత్యం నిరూపించుకుంటున్నారట.
No comments:
Post a Comment