Wednesday, January 5, 2011

కృష్ణా జలాలు

ట్రిబ్యునల్ తీర్పు

"తాంబూలాలిచ్చేశా, ఇక తన్నుకు చావండి" అని తీర్పు ఇచ్చేసింది--బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్.

తీర్పుతో మన రాష్ ట్రానికి జరగబోయేది లాభమా? నష్టమా? యెంతశాతం? అనేది ప్రక్కన పెడితే, ట్రిబ్యునల్ ముందు మన ప్రభుత్వ నిర్వాకాన్ని ఇంకో ప్రక్కన పెడితే--అసలు విషయాన్ని బయటపెట్టడమే చెయ్యడం లేదు యెవరూ--దాన్ని అంగీకరించడం సంగతి తరవాత!

1976 లోనో యెప్పుడో బచావత్ ట్రిబ్యునల్ తన అవార్డ్ ప్రకటించింది. కృష్ణా జలాలని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ల మధ్య కేటాయింపులు చేసి, "మిగులు జలాలని 2000వ సంవత్సరం వరకూ, లేదా ఇంకో ట్రిబ్యునల్ అవార్డ్ వచ్చేవరకూ--ఆంధ్ర స్వేచ్చగా అనుభవించవచ్చు" అని.

అబ్బో! 2000వ సంవత్సరమా! ఇంకా చాలా దూరం వుంది--ఇప్పుడప్పుడే మరేమీ ఫరవాలేదు--అని నిశ్చింతగా వున్నాయి మన ప్రభుత్వాలు. అంతేగానీ, కాల సాగరంలో అది ఓ బిందువుకన్నా చిన్నది అని మరిచిపోయారు.

ఓ పదేళ్ల ముందు అంటే 1990 నించీ మన ప్రభుత్వం తగిన ప్రణాళికతో ప్రారంభిస్తే, ఇప్పుడు ఈ బాధ వుండకపోవును కదా? 

అప్పట్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలే వున్నా, మనం చేసిందేమీ లేదు. 
ఆలమట్టి మీద దెబ్బలాడాం, నిలువరించాం--అంటాడు చంద్రబాబు.

మధ్య మధ్యలో "చెరుకూరి వీరయ్య" లాంటివాళ్లు ఆక్రోశిస్తూనే వున్నా, మనవాళ్లు చేసింది హళ్లికి హళ్లి, సున్నకి సున్న!

ఇప్పుడు చేసుకున్నవాళ్లకి చేసుకున్నంత మహదేవా! అంతేనా?

ఇప్పటికైనా "డ్యామేజి కంట్రోలు" మొదలుపెడతాడా కిరణ్ కుమార్?

చూద్దాం!

2 comments:

Anonymous said...

Looks like it was a typing mistake...

మన రాష్ ట్రానికి ....

మన రాష్ట్రానికి

:)

A K Sastry said...

బాబూ!

టైపింగ్ మిస్టేక్ కాదు....లేఖిని వారి మిస్టేక్! చూశారుగా, మీ వ్యాఖ్యలో 'రా వత్తు' కనబడదు!
అందుకనే ఈ పాట్లు.

ఇదేకాదు....వత్తు వున్న ద్విత్వాక్షరాలు కూడా వత్తులు కనపడవు.

వారు సవరిస్తారని ఆశిద్దాం.

ధన్యవాదాలు.