అవీ, ఇవీ, అన్నీ
"బోఫోర్స్!"......ఇప్పటికి యెన్నో నిలువుల లోతున పాతిపెట్టినా, అప్పుడప్పుడూ దానిమీద టన్నులకొద్దీ మట్టి పోస్తున్నా, "మమ్మీ రిటరన్స్" లెవెల్లో మళ్లీ పైకొస్తూనే వుంది.
ఈమధ్య ఇన్కమ్ టాక్స్ ట్రిబ్యునల్--ఖత్రొచీ, విన్ ఛడ్డాలకి రూ.41 కోట్లు లంచంగా ముట్టాయి అనీ, దాని మీద పన్ను కట్టవలసిందే అనీ--తీర్పు ఇచ్చింది. ఆ సొమ్ము లంచమేననీ, అది వాళ్లకి యెలా చేరిందో కూడా వివరించింది.
అసలు కమీషన్ల ప్రసక్తే లేదని తమ దర్యాప్తులో తేలింది అని అనేకసార్లు చెప్పిన సీబీఐ ఇప్పుడేమంటుందో? కాంగీ వారీసారి దాన్ని యెలా పూడుస్తామంటారో?
వంశధార పై మన ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్తుల వల్ల తమకి నష్టం అని ఒడిసా సుప్రీం కోర్టుకి వెళితే, 2007 లో కోర్టు 'ప్రాజెక్టులని నిలిపివేయాలనీ, జల వివాద ట్రిబ్యునల్ యేర్పాటు చేయాలనీ' తీర్పు ఇచ్చింది.
కేంద్రం ట్రిబ్యునల్ నైతే యేర్పాటు చేసింది గనీ, కార్యాలయం యేర్పాటు చెయ్యలేదట! మొన్న నవంబరు 23 నుంచీ కార్యకలాపాలు ప్రారంభించవలసిన ట్రిబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ బీయెన్ అగర్వాల్ అందుకు నిరసనగా రాజీనామా ఇచ్చారట!
మరి మన ప్రాజెక్టుల గతేమిటో!
విన్నారా? మొన్న డిసెంబరు 31 న మద్యం అమ్మకం ద్వారా రూ.135 కోట్లు ఆర్జించిందట మన రాష్ట్ర ప్రభుత్వం. క్రితం సంవత్సరం రు.100 కోట్లేనట.
ఈసారి రాత్రి 12 వరకూ అమ్మించడం, బార్లు ఒంటిగంటవరకూ తెరవడం వల్ల ఇంకా యెక్కువ వచ్చిందట.
హైదరబాదు, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే అమ్మకాలు పెద్ద యెత్తున జరిగాయట. అక్కడ క్రితం సారి 45 'ఈవెంట్లు ' మాత్రమే జరిగితే, ఇప్పుడు 86కి పెరిగయట.
యేమి ప్రగతి!!!
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1 నుంచి 8వ తరగతి పిల్లలందరికీ ఆప్కో ద్వారా వుచిత దుస్తులు సరఫరా చేయిస్తామని మంత్రి అంటే, ఠాట్! మా మాటేమిటి? అంటున్నారట మిల్లు బట్టలవాళ్లు.
చూద్దాం యేం జరుగుతుందో!
....................................................................................................................................
ప్రకటన :
శ్రీ దత్త చరితం
తొలి జగద్గురువు, విఙ్ఞానపు కాంతులను విరజిమ్మిన క్రాంతి పుంజం, అత్రి, అనసూయల గర్భ సుక్తి ముక్తాఫలం--శ్రీ దత్తాత్రేయుడు.
ఆపురూప గురుహారం ఈ శ్రీ దత్త చరితం.
ఈ డాక్యుమెంటరీ కి నిర్మాత, కెమేరామన్ : చిట్టావఝల కృష్ణ; వ్యాఖ్యనం/దర్శకత్వం : చక్రావధానుల రెడ్డప్ప ధవేజీ; సంగీతం/గానం : గోగులమండ రాజు & మోహిని కుమారి; సహ నిర్మాత : సవరం కృష్ణానందం. ప్రవచనం : 'భారతీపుత్ర ', కడిమెళ్ల వర ప్రసాద్ 'గురు సహస్రావధాని '.
(దత్తచరిత్ర యథాతథంగా, కూర్పులూ, చేర్పులూ లేకుండా చెప్పబడింది--అనుచిత వ్యాఖ్యలు లేకుండా! దత్తపీఠలూ, క్షేత్రాలూ వగైరలు కూడా చూడండి.)
ఈ సీడీలు కొనండి....ఒక్కొక్కటీ రూ.59/- మాత్రమే! ఈ ప్రకటన చూసి, ఆర్డరు ఇచ్చినవారికి రూ.54/- మాత్రమే.
చిట్టావఝల కృష్ణ పేరున "మాకు అందేలా" కేరాఫ్ నర్సాపూర్ బ్రాహ్మణ సమాఖ్య, నరసాపురం, ప.గో.జిల్లా, 534275 కి (మనియార్డరు/పోస్టల్ ఆర్డరు/డీడీ) యెలాగైనా పంపించండి....ఓ సీడీ సొంతం చేసుకోండి! (ఇందులో వ్యాపారం లేదు.)
మీరు కోరితే, మీ మెయిల్ ఐడీ కి వీడియో పంపించడానికి ప్రయత్నిస్తాము.
4 comments:
Krishna Sri Garu,
I am a regular visitor to your blog. Impressed with your depth of knowledge, courage, conviction in choosing the subject matter and expressing views in concise form.
In many posts, directly/indirectly you have spoken about the rotten state of our society in India.
Anti-nationals (foreigners) have captured supreme command in political, Media, Economy, Culture, and Religious spheres.
1) Politics: Sonia, YSR (Jagan), North-East States, WB, TN, Kerala.
2) Media: Read the link.
http://hindulinebengal.wordpress.com/2010/11/16/how-the-subversive-media-in-india-goes-against-%E2%80%9Cindia-and-her-people%E2%80%9D/
3) Economy: intentional Rupee devaluation.
4) Culture: Western culture dominating the India.
5) Religion: Abrahamic Cults are in ascendancy. Political power and Soul Harvesting go in hand-in-hand all over the world.
You might have some thoughts and some possible solutions. Please share them with us.
In some other recently, some one pointed out that there is a great potential (at least One Million full time paid jobs) for Hindu religious workers if the Govt. relinquish profit making Hindu Temples and handed them to Hindus.
Do you see any potential for this? Or it is just a trash talk?
Have a good Day.
పై అన్నోన్!
హమ్మయ్య. ఇప్పటికి గూగుల్మిత్రుల సహాయంతో, మీ వ్యాఖ్య 'స్పామ్' లో కనిపించి, అది స్పామ్ కాదు అని చెప్పగానే పబ్లిష్ అయ్యింది.
చాలా సంతోషం!
అలాగే, మీరు ఇంగ్లీషులో వ్రాసినా, ఇది తెలుగు బ్లాగుకాబట్టి తెలుగులోనే జవాబిస్తాను.
నా బాధ్యతని బాగా పెంచేస్తున్నారు.
క్లుప్తంగా జవాబులివ్వడానికి ప్రయత్నిస్తాను.
1) మొదటిగా--భారతదేశం లో యెవరూ 'యాంటీ నేషనల్స్' కారు--మీరు చెప్పిన చోట్ల, రాజకీయాల్లో--కాశ్మీర్ తో సహా!
కేసీఆర్ తెలంగాణా విడిపోవాలంటున్నాడు గానీ, యెవరూ భారత్ నుంచి వేరుపడతామని
అనడం లేదు. మహా అయితే స్వయం ప్రతిపత్తి అడుగుతున్నారు. అంతే.
అంతవరకూ మనం అదృష్టవంతులమే!
2) మీడియా విషయానికొస్తే, మీరిచ్చిన వ్యాసం నూటికి నూరుపాళ్లు బాగా పరిశోధించి వ్రాసిందే!
నిన్ననే ఓ బ్లాగులో చదివాను--ఓ తెలంగాణా వాది, 'అరుంధతీ రాయ్ తో పాటు, డీ ఏస్ యూ (ఢిల్లీ స్టూడెంట్స్ యూనియన్--ఎక్స్ ట్రీం లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్....అని ఆయనే చెపుతున్నాడు!) లాంటి వాళ్ల మద్దతు కూడా కూడగడతాం' అని! ఇక అరుంధతి సెసెషనిస్టు కాదు కానీ, ఓ స్టాండ్ పొరపాటున తీసుకొని, చచ్చినట్టు దానిమీదే నిలబడిపోతోంది! G O H H!
3) రూపాయి విలువ తగ్గింపు--అంతర్జాతీయ వొత్తిళ్లకు లోబడే--ఇదివరకెప్పుడో జరిగింది. ఇంతకు ముందు రూపాయి బలపడింది. ఇప్పుడు సెన్సెక్స్ దిగిపోతుంటే, ఎఫ్ ఐ ఐ ల పెట్టుబడులు వెనక్కు పోతే, మళ్లీ బలహీన పడుతుంది--ద్రవ్యోల్బణం పెరుగుతుంది!
4) ఇది కూడా ద్రవ్యోల్బణం ప్రభావాల్లో ఒకటే! పాశ్చాత్య ధోరణులే కాదు, అన్ని దేశాల ధోరణులూ పెరుగుతున్నాయి మన దేశం లో! చేతిలో డబ్బులు యెక్కువ ఆడుతుంటే, యువత (గ్రామీణే కాదు, పట్టణ, నగర కూడా) చైనీస్, కాంటినెంటల్ రెస్టారెంట్లకీ, పబ్బులకీ, డిస్కోలకీ యెగబడుతుంది. అలాగే విలువల పతనం!
5) మీరన్నది నిజమే. దీనికి పరిష్కారం--"మత ప్రసక్తిలేని" లౌకిక రాజ్యాంగాన్ని అనుసరించి, ప్రపంచానికి మనం ఆదర్శం కావడమే!
ఇక పరిష్కారాల విషయానికొస్తే, అత్యుత్తమం--ఫాసిజం తో కూడిన నియంతృత్వం. (ఇటలీ మైనస్ ముస్సోలినీ; జర్మనీ మైనస్ హిట్లర్--ఇలా అన్నమాట). యెటొచ్చీ నియంత మన ఎన్ టీ ఆర్ కన్నా చాలా యెక్కువ నిస్వార్థపరుడూ, నిష్పక్షపాతీ, రాజకీయపండితుడూ కావాలి! తొందరపడి ఆయన్ని దేవుడు పిలిపించుకోకపోతే, కొంతవరకు నా ఆకాంక్ష నెరవేరేది--ఆయన ప్రథాని కావడం ద్వారా! (అప్పుడు దేశ చరిత్ర ఇంకోలా వుండేది!)
మన ఖర్మ కొద్దీ, ఆయన స్థానం లో, నిద్దరమొహమోడూ, జాతి ద్రోహీ దేవె గౌడ ప్రథాని అయ్యాడు!
(పైవాటినన్నింటినీ వివరించుకుంటూ పోవాలంటే, నాకు రోజుకి 24 గంటలు చాలవు!)
వుద్యోగాల విషయానికీ, 'హిందూ దేవాలయాల అప్పగింత' గురించీ, మళ్లీ ఓ సారి వస్తాను!
ధన్యవాదాలు.
"వుద్యోగాల విషయానికీ, 'హిందూ దేవాలయాల అప్పగింత' గురించీ, మళ్లీ ఓ సారి వస్తాను!"
Please post your views on this matter. Thanks.
పై అన్నోన్!
కాస్త వెసులుబాటు చిక్కగానే, తప్పక వ్రాస్తాను.
ధన్యవాదాలు.
Post a Comment