Wednesday, September 8, 2010

దండుమారాజులు


ఆధునికీకరణ

గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల్ని 'బలోపేతం' చెయ్యడానికి, గ్రామ సమాఖ్యలకి 'అంకోపరులు' (లేప్ టాప్ లు) అందజేస్తారట--ప్రభుత్వం వారు.

(ప గో) జిల్లాలో మొత్తం 1,728 గ్రామ సమాఖ్యలుండగా, పైలెట్ ప్రాజక్టుగా వీటిలో ఓ 100 సమాఖ్యలకి ప్రస్తుతం ఇవి అందజేస్తారట. (ఒక్కోదాని ఖరీదెంతో తెలీదు. బహుశా యే రూ.35,000/- లో అయ్యుండవచ్చు.)

ఓ మండలం లో వుండే కొన్ని వేల స్వయం సహాయక సంఘాలకి ఓ సమాఖ్య వుంటుంది. సంఘాల సంఖ్య యెక్కువైతే, రెండు మూడు సమాఖ్యలు కూడా వుండచ్చేమో.

ఈ స్వయం సహాయక సంఘాలగురించి అందరికీ తెలిసున్నదే! కొన్నింటిని మినహాయిస్తే, చాలా వాటిలో సభ్యులూ, నాయకురాళ్లూ అందరూ నిరక్షరాస్యులే!

బ్యాంకుల బలవంతమ్మీద, నాయకురాళ్లు మాత్రం తమ పేరు (కనీసం అక్షరాలు తెలిసేలా) వ్రాయడం నేర్చుకొన్నారు. దేనికీ సరైన రికార్డులు వుండవు.

వాళ్లకి ఋణాలు మంజూరు చెయ్యడానికీ, నవీకరించడానికీ, బ్యాంకర్లు పడుతున్న పాట్లు యెవరికీ తెలియదు. (వెలుగు పధకం వాళ్ల వల్ల కొంత బాధ తగ్గింది--కనీసం బ్యాంకులకోసం వాళ్లచేత పుస్తకాలు నిర్వహింపచేసి, సంతకాలు పెట్టిస్తున్నారు.)

మరి వీళ్లు ఈ లేప్ టాప్ లు--అదీ ఈ-బుక్ కీపింగ్ సాఫ్ట్ వేర్ తో--యెలా వుపయోగిస్తారో? పైగా, హైదరాబాదు నించే వీటిని పర్యవేక్షిస్తూ వుంటారట!

2000 వ సంవత్సరం నించీ, రెవెన్యూ డిపార్ట్ మెంట్ నించీ, మిగిలిన ప్రభుత్వ శాఖలన్నిటికీ--ఆధునికీకరణ, అనుసంధానం పేరుతో, యెన్ని కంప్యూటర్లకి యెంత ఖర్చు పెట్టారో, ఇప్పటిక్కూడా యే శాఖలోనూ పూర్తిస్థాయిలో ఇవి యెందుకు పని చెయ్యడం లేదో యెవరైనా అరా తీస్తే బాగుండును!


5 comments:

చిలమకూరు విజయమోహన్ said...

ఏంటండి మీకు ధరలే తెలియదు ల్యాపుటాపులేంది 35వేలకు రావటమేంది మూడున్నర లక్షండి బాబూ ఒక్కోటి.

Indian Minerva said...

విజయ మోహన్ గారు: మీరు సూపరు.

@ఒసామా గారు : మీరు కూడానూ... ఎంత అంకము అంటే ఒడి (లేదా తొడ) ఐనంతమాత్రాన అంకోపరులు అనెయ్యడమే!!

A K Sastry said...

డియర్ చిలమకూరు విజయమోహన్!

చాలాకాలానికి మీ వ్యాఖ్య.....సంతోషం.

ఇప్పుడుకూడా నిజం గా అంతంత రేట్లు వున్నాయా? పేపర్లో టెక్స్ట్ బుక్కులూ, నోట్ బుక్కులూ, గైడ్ బుక్కులూ అంటూ ప్రకటనలు చూసి, ఆ రేటుకి వచ్చేస్తాయేమో అనుకున్నాను!

ధన్యవాదాలు.

A K Sastry said...

డియర్ Indian Minerva!

అంకోపరులు అనేమాట నేను దాదాపు మూడేళ్లక్రితమే విన్నాను--'వీవెన్' దగ్గర. హైదరాబాదులో వాళ్లు విరివిగా వాడుతున్నారట! ఈ అనువాదం యేదో బాగానే వుంది అని నేనూ వాడాను.

ధన్యవాదాలు.

భాస్కర రామిరెడ్డి said...

"Osaamaa....." గారూ...,happy vinakayaka chavithi

హారం