అవీ, ఇవీ....
"అజీమ్ ప్రేమ్జీ".....భారతరత్న ఇవ్వదగ్గ ఇంకో 'కర్ణుడు'!
"నా పిల్లలు రోడ్డున పడవలసిన అవసరం రాకుండా మాత్రమే వాళ్లకిస్తాను" అంటూ తన ఆస్థి లో 99% దానం చేసిన వారెన్ బఫెట్ మాటలని ఇంకోరకం గా చెపుతూ......
"(నా)పిల్లలకు నా ఆస్థుల్లో చాలా కొద్దిభాగమే ఇచ్చినా.....తిని అరిగించుకొనేందుకు అది వారికి తరతరాలకు జన్మజన్మలకు సరిపోతుంది. అందుకే నా ఆస్థుల్లో అధిక మొత్తాన్ని దాతృత్వానికి, సమాజ సంక్షేమానికి ఇవ్వాలనుకుంటున్నా!" అంటూ రూ.8,846 కోట్లు వితరణ చేశాడు--అదీ--విద్య నిమిత్తం!
మహాత్ముడి సూచనని అక్షరాలా పాటిస్తున్న గాంధేయుడిగా చెప్పుకోవాలి ఈయనని.
తన 'నటనకి' కొన్ని కోట్లూ, తన కొడుకూ, కోడలూ తమ తమ 'నటనలకి' కొన్ని కోట్లూ సంపాదించుకుంటున్న ఓ పెద్దాయనకి ఈ మాటలు వినిపిస్తున్నాయో లేదో?
(అయినా అది వారి స్వవిషయం అనుకోండి....!)
చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకుంటున్న ఓ ఇటాలియమ్మ ప్రాపకం తో, తానెప్పుడో ఉత్తర ప్రదేశ్ లో కొన్న భూమి ద్వారా 'రైతు' అని ముద్ర వేయించుకొని, ఒక రాష్ట్రం లో రైతు అని ముద్ర పడితే, దేశావ్యాప్తం గా ఇంకే రాష్ట్రం లోనైనా రైతే అవుతాడు అనే నిబంధన లొసుగుని వుపయోగించుకొని, మహారాష్ట్ర లో కొన్న కొన్ని యెకరాలలో వ్యవసాయం కోసం ట్రాక్టరు దున్నుతున్నట్టు పేపర్లలో ఫోటోలు వేయించుకొని, నేను రైతునే సుమా అని స్వడబ్బా కొట్టుకొంటున్నాడీయన!
ప్రథాని లా ఆయన కూడా "ఆదరణీయుడే" మరి!
యేమంటారు?
ఇక, అజ్మల్ కసబ్ అనేవాడు "సంఝౌతా ఎక్స్ ప్రెస్ లో పాకిస్తాన్ నుంచి ఢిల్లీవచ్చి.....కేవలం 'హిందీ సినిమాలు చూడడానికి మాత్రమే' ముంబాయికి వస్తే, వుగ్రవాదులతో సముద్రం మీద పడవలో వచ్చాడని తప్పుడు కేసు పెట్టారు" అనీ, వాడు "వుగ్రవాదులతో పడవలో వచ్చాడు అనడానికి ఆథారాలు లేవు" అనీ, వాడి తరఫు వాదిస్తున్నారట న్యాయవాదులు అమిన్ సోల్కార్, ఫర్హానా షా అనేవాళ్లు!
నేనిదివరకే చెప్పినట్టు, వాడికి నేచెప్పిన శిక్ష విధించి, వాడి మద్దతుదారులకి కూడా ఆ ప్రక్కనే అలాంటి శిక్షే వేస్తేగానీ ఇలాంటి దేశ ద్రోహులకి బుధ్ధి రాదంటాను.
అవునా?
14 comments:
నిజమే.
మాస్టారూ బాగున్నై కబుర్లు.
కానీ మీరింత చమత్కారంగా రాస్తే మాతృదేశంలోని మసాలా విషయాలు చూచాయగామాత్రమే తెలుస్తుండే నాలాంటి వాళ్ళకి ఆ నటనల పెద్దమనిషి ఎవరో, ఉత్తరప్రదేశు రైతుగారు ఎవరో అర్ధం కాలేదు
బిగ్ బీ గారి తాజా ఫోజు వెనక ఇంత కుట్ర వుందా ?
ఆ కోట్లు పోతాయేమో అని పెద్దాయన ఇంట్లోకి ఇంకో నంబరు కోసం డిలే చేస్తున్నారు?
ఓహో నటనల పెద్దమనిషి బచ్చన్.
రైతు = ??
డియర్ చిలమకూరు విజయమోహన్!
చాలా సంతోషం.
ధన్యవాదాలు.
డియర్ కొత్తపాళీ!
జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా అన్నట్టు మీకు వివరించి చెప్పేంతటివాడినా!
ఆ నటనల పెద్దమనిషీ, వుత్తరప్రదేశ్ రైతూ ఒక్కరేనేమో, క్రింద వ్రాసిన లలితమ్మ చెప్పినాయనేనేమో మీరే చెప్పండి.
ధన్యవాదాలు.
డియర్ లలిత!
అది కుట్ర కాదులేమ్మా! చిన్నసైజు కుంభకోణం మాత్రమే.
ధన్యవాదాలు.
డియర్ పానీపూరి123!
ఆ వచ్చే బుల్లి బీ కోసం వాళ్లమ్మా, నాన్నా గడిస్తున్నారుకదా? ఇంకా ఈ ముసలాయనకి యెందూకో కాపీనం అనుకుంటాను నేను.
అయినా పిచ్చిగానీ, యెవరు యెన్ని కోట్లు సంపాదించినా, యెన్ని రాజ్యాలు యేలినా, వాళ్లకి 'దక్కేది ' యేమిటో!
ధన్యవాదాలు.
డియర్ కొత్తపాళీ!
హమ్మయ్య. చెప్పేశారన్నమాట.
కాదంటే, ఆయన వొప్పుకోవడం లేదే!
ధన్యవాదాలు.
సార్, జగం బ్రాహ్మణున్ని ఎరుగున్నదేమో గానీ పాపం ఆ బ్రాహ్మడిక్కూడా జగం కొంచెం తెలియాలిగదా! :)
అయ్యా కొత్తపాళీ!
నేనన్నది జగమంతటి 'గురించి ' (బ్లాగులోకం) తెలిసిన బ్రాహ్మణుడనే! యెందుకంటే అనేక బ్లాగుల్లో మీ కామెంట్లు చూస్తూ వుంటాను కాబట్టి.
(ఇంతకీ మీరు 'పన్నే'శారా, నేను వేశానా?)
మరింకోసారి ధన్యవాదాలు!
కృష్ణశ్రీగారు, పన్నుల్దేముంది, తుంటిమీద కొడితే అవే రాల్తాయిగదూ! :)
ఈ టపా మొదట కొంచెం హడావుడిగా చదివేసి అర్ధంకాక అలా మొదటి కామెంటు పెట్టేశా. నింపాదిగా చదివిన మీదట + కింద కొన్ని వ్యాఖ్యల సాయంతోనూ అసలు విషయం అర్ధమయింది.
ఏదేమైనా ఈ సందర్భంగా మీలా మంచి చమత్కారులతో చతుర్లాడే అవకాశం వచ్చినందుకు సరద్గాగా ఉంది. మళ్ళీ కలుద్దాం.
డియర్ కొత్తపాళీ!
తప్పకుండా కలుస్తూ వుందామనే నా ఆకాంక్ష.
నా మిగతా బ్లాగుల్లోని టపాలపై కూడా మీ అమూల్యాభిప్రాయాల్ని వెలువరిస్తూ వుండండి.
Post a Comment