Sunday, March 14, 2010

కరెంటు కష్టాలు


కోతలు--పరిష్కారాలు

ప్రతీ సంవత్సరం (సుబ్బారాయుడు మంత్రిగా వున్నా, మరో డబ్బా రాయుడు మంత్రి అయినా) తప్పని తద్దినాలే--ఈ కరెంటు కోతలు.

అయినా ప్రతీ యేడూ కొత్త కొత్తగా, మన ఉగాదిలా అలరిస్తూ వుంటాయి మన ప్రజలని.

ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చిన టైములో, పగలూ రాత్రీ అనక కరెంటు తీసేస్తారు--ప్రతీ యేడూ!

మళ్ళీ ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలూ, రాస్తా రోకోలూ, సిబ్బందిని వాళ్ళ కార్యాలయాల్లో బంధించి తాళం వెయ్యడాలూ, కొంతమందిని నడ్డి విరగదన్నడాలూ, మామూలుగా జరిగితే, అప్పుడు రాత్రి పూట కోతలు వుండవు! ఓ క్రమం ప్రకారం జరుగుతాయి ఈ కోతలు!

మరి ప్రతీ సంవత్సరం ఇలా నిర్దిష్టం గా ఓ పధ్ధతి ప్రకారం యెందుకు చెయ్యదు ప్రభుత్వం?

అదంతే! దాని చర్మం చాలా మందం!

పైగా ఓ ప్రైవేటు సంస్థ తను వుత్పత్తి చేస్తున్న 'కరెంటుని తమిళనాడుకి యెందుకు అమ్ముకోవాలి? వొప్పందం రద్దు చేసుకోవాలి' అంటారు కాంగీరేసు ప్రజా ప్రతినిధులు. (వాళ్ళవి నాలుకలో--తాటి పట్టెలో తెలీదు నాకు!)

'నేనెప్పుడో ఆ సంస్థనించి వైదొలిగాను. సామాన్య షేర్ హోల్డర్ని మాత్రమే' అంటాడు రాజగోపాల్. (నా వ్యక్తిగత అభిప్రాయం అడిగితే, ఓ ప్రజా ప్రతినిధిగా యెన్నికయ్యే అర్హతే లేదు వీడికి.)

మరి ఓ ప్రైవేటు సంస్థ తన వొప్పందాన్ని రద్దుచేసుకోవాలని డిమాండ్ చేసే తాటి పట్టెలు--తమ ప్రభుత్వం జల యఙ్ఞానికి, గాలి గాళ్ళకి కోట్లకి కోట్లు దొబ్బబెడుతున్న వొప్పందాలని యెందుకు రద్దు చేసుకోదు--అని ప్రశ్నించవేం?

మీరేం యేడ్చినా, కరెంటు కోతల్ని నివారించండి చాలు!

2 comments:

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

లగడపాటి పై మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.వై ఎస్సార్ పాదయాత్రకి డబ్బు ఖర్చు పెట్టిన ఒకే ఒక క్వాలిఫికేషన్ తో ఎంపీ అయ్యారు సారు.

A K Sastry said...

డియర్ '.......దండలూ!

అప్పట్లో మేము అనంతపురం జిల్లాలో వుండేవాళ్ళం కనుక కోస్తాంధ్ర లో రాజకీయాలని పెద్దగా గమనించలేదు.

అప్పట్లో కాంగ్రెస్ గెలవడానికి వేరే కారణం వుందన్నది నా నిశ్చితాభిప్రాయం.

ఓ కొత్త విషయం చెప్పినందుకు నా ధన్యవాదాలు!