Saturday, June 27, 2009

విచిత్రజీవి

వీడెక్కడోడండీ బాబూ!

‘……నీకొండకి నీవే…..’ యాత్రలో మేము చర్చించుకున్న మరో విషయం…’అన్యమతస్థుల’ ఆలయ ప్రవేశం గురించి!

హిందువులు కానివారెవరైనా శ్రీపతి స్వామిని దర్శించుకోవాలంటే, ఒక రిజిష్టర్ లో ఒక ధృవీకరణ క్రింద సంతకం చెయ్యాలి! అందులో ‘నేను అన్య మతస్థుణ్ణైనా, పూర్తిగా స్వామి మీద విశ్వాసం తో ఆయన దర్శనానికి వచ్చాను’ అని వుంటుంది!

మరి మన సీ యెం వచ్చినప్పుడల్లా సంతకం చేస్తున్నాడా? అంటే, మా గైడ్, ‘ఖచ్చితం గా చేస్తున్నాడండీ, జగన్ చేస్తున్నాడు, రాహుల్ చేశాడు’ అని నొక్కి వక్కాణించాడు! అయితే మంచిదే అన్నాము!

నేను, మరి బ్రహ్మోత్సవాలకీ, కళ్యాణాలకీ నెత్తిమీద పట్టు వస్త్రాలు పెట్టుకొని స్వామికి ఆయనే యెందుకు సమర్పించాలి? అంటే, ‘అది అఫీషియల్ కెపాసిటీ’ అన్నారు!

మరి ఈ ‘అఫీషియల్ కెపాసిటీ’ని యెందుకు మార్చరు?

ఆయనేమో ‘నేను 2004 లో జెరూసలెం యాత్ర చేసి వచ్చాను, రాష్ట్రం లో మంచి వర్షాలు పడ్డాయి……అయిదేళ్ళూ పడ్డాయి, మళ్ళీ ఇప్పుడు జెరూసలెం యాత్ర చేసి వచ్చాను…..ఇక చూడండి, అయిదేళ్ళూ వర్షాలే వర్షాలు….’ అంటాడు!

ఇప్పటిదాకా తొలకరి కూడా లేకపోయేసరికి, ‘అన్ని గుళ్ళలోనూ వరుణజపాలూ, విశేష పూజలూ, యఙ్ఞ యాగాలూ చెయ్యండి’ అంటాడు మళ్ళీ! అదీ ప్రభుత్వం తరుఫున!

అదేదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్టు ‘నువ్వు నాకర్థం కావురా బాబూ’ అని మొత్తుకోవడం తప్ప మనమేమి చెయ్యగలం!

7 comments:

Krishna K said...

"‘నువ్వు నాకర్థం కావురా బాబూ’ " :)) అర్ధం కావటానికి పెద్ద ఏమీ లేదండి, trying to take advantage on both sides, but we all know where is his real faith. It showed from his comments when he came from Jerusalem. Nothing wrong about it. కాకపోతే మిగతా నాటకాలే, చిరాకనిపిస్తాయ్యి.

elections ముందు, తిరుమలవాసుడు కావాలి. ఇంతవరకూ ఎప్పుడూ పెద్దగా వెళ్లని, జగన్ తో సహా. elections అవగానే మాత్రం జెరూసలేం మొక్కు తీర్చుకువచ్చింది కాక, అంతా "ఆ ప్రభువు" దయ వలనె వర్షాలు పడుతున్నయ్యి అని చెప్పటం!!!. వరుణదేవుడు ను కూడా ఈయన అల్లుడు ఎప్పుడు, కూటమి పెట్టి మతం మార్చాడొ తెలియదు. ఆ తరువాత, damage కంట్రొల్ కోసం, ప్రధానమంత్రి వచ్చినప్పుడో డ్రామా తిరుపతిలో.
ఇప్పుడెమో, వర్షాలు పడకపోతే, వరుణయాగాలు, ఇప్పుడు వర్షం పడితే వాళ్ల "ప్రబువు" పుణ్యమా, లేక వరుణయాగాల పుణ్యమా? ఇప్పడు కూడా వర్షాలు పడకపోతే, ఏ దేముడు fail అయ్యినట్లు?

అయినా ప్రబుత్వ అధినేతగా, ఇలా వరుణయాగాలు, లేక మా "ప్రభువే" గొప్ప లాంటివి చేయటం అవసరమా? తన మత విశ్వాసాలను వ్యక్తిగతం గా ఉంచి, మంచి పాలన అందిద్దాం అన్న ఆలోచన మాత్రం ఎందుకు రాదో?

ఇంకోకటి, వూళ్లొ వాళ్లందరనీ "కూటాలు" పెట్టీ మారుస్తున్న ఈ దేముడు గారి అల్లుడు, గాలి ని ఎందుకు ఇంతవరకూ మార్చలేదో!! మార్చివున్నట్లయితే, ఆయన ఇంకో 45 కోట్లో, 50 కొట్లొ పెట్టి ఓ మెగా చర్చి కట్టి ఇచ్చేవాడు కదా, గాలి డబ్బుతో.

A K Sastry said...

డియర్ Krishna!

మతం, నమ్మకం అనేవి పూర్తిగా వ్యక్తిగతమైనవి! మనం ఫలానా మతం లోనో కులం లోనో పుట్టాలి అని కోరుకొని పుట్టే చాన్స్ లేదుకాబట్టి, వీటిని మార్చుకొనే అవకాశం ప్రతీ మనిషికీ వుండవలసిందే!

మీరన్నట్టు, రాజకీయ లభ్ధి కోసం 'అనూచానం గా' ప్రవేశ పెట్టారు ముఖ్యమంత్రి నెత్తిమీద పెట్టుకొని పట్టువస్త్రాలూ, రామయ్యకి ముత్యాల తలంబ్రాలూ సమర్పించడం! దీనికీ గవర్నమెంటుకీ యే సంబంధం లేదు! అందుకనే, వీటిని వెంటనే మార్చాలి అని నేనన్నది--అన్య మతస్థుడు ముఖ్యమంత్రి అయినప్పుడైనా!

మరి యెందుకు మార్చరూ?

మనలోమనమాట--యేడు కొండలూ కాకపోయినా, మరో కొండమీద ఒక పెద్ద చర్చ్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నారట! పోప్ ప్రతినిధి ఒకడు నెలల తరబడి అక్కడ మకాం చేస్తున్నాడట! నేను నమ్మలేదనుకోండి--యేమో!

Krishna K said...

అక్కడ ఉన్న ఓ పెద్ద కొండ మీద చర్చి ప్లాన్ చేయటం మాత్రం నిజమండి. చిన రాజా వారు, వాటికన్ వెళ్లివచ్చినప్పటినుండి, ఈ పని మీదే ఉన్నారని విన్నాను. నా పాస్టర్ మిత్రుడు ద్వార నేను విన్నది ఏమిటి అంటె, ఓ మెగ చర్చి కట్టి, దానిని కూడా ఓ దర్శనీయ స్థలం గా, కొండ కు వచ్చే యాత్రికులకు చేయలన్నది వాళ్ల సంకల్పం అని. చూద్దాం ఆ ఏడుకొండలవాడు, ఈ "దేముడి" సంకల్పాన్ని అడ్డుకోగలడెమో!!

Unknown said...

చూద్దాం ఆ ఏడుకొండలవాడు, ఈ "దేముడి" సంకల్పాన్ని అడ్డుకోగలడెమో! ??????????????

దేముళ్ల మధ్య కజ్జాలు పెడుతున్నారా?

:-)

A K Sastry said...

డియర్ Krishna!

నేను హేతువాదిని!

పాస్టర్ మితృలూ, వాళ్ళూ చెప్పేది నమ్మను! పుకార్లు అసలు నమ్మను!

ఆ దేవుణ్ణి, ఈ దేవుడో--ఈ దేవుణ్ణి ఆ దేవుడో అద్దుకోవడం యెందుకు?

'నందో రాజా భవిష్యతి!' చూద్దాం!

ఒకటి మాత్రం చెప్పగలను--ఈ సృష్ఠి లో యేదీ శాశ్వతం కాదు!

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ bollojubaba!

మా బాగా చెప్పారు! దేవుళ్ళూ, దెయ్యాలూ, వాటి మధ్య కజ్జాలూ, మన తీర్పులూ........!

ధన్యవాదాలు!

Nrahamthulla said...

మన రాష్ట్రంలో కొన్ని మూఢనమ్మకాలు

* పెదకాకాని బాజీబాబా దర్గా ఉరుసు లో గుర్రానికి తినిపించిన ఎంగిలి మిఠాయి భక్తులు ఎగబడి తింటారు,
* పరోపకారం కోసం తన దేహాన్నే కోసి ఇచ్చిన గొప్ప దానశీలి త్యాగమూర్తి మయూరధ్వజుడు. అతని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభం నీడ గుడి మీదకానీ ఇళ్ళమీదకానీ పడకూడదంటారు.
* బుధవారం నాడు ఆడపిల్ల పుడితే అరిష్టం అని చంపేయటమో ఎక్కడో వదిలేసి రావటమో చేస్తారు.
* జాతర రోజులలో గ్రామశక్తి పోలేరమ్మ పట్టణంలో సంచరిస్తుంటుందని, అరిష్టం కలుగుతుందని శుభకార్యాలు చేయడం ఆపివేస్తారు. మసూచి ఆటలమ్మ లాంటి రోగాలను అమ్మవారికి ఆపాదిస్తారు.
* అనంతపురం జిల్లా హిందూపురం ఎస్‌.సడ్లపల్లిలో పిల్లలకు వచ్చిన కోరింత దగ్గు నయం కావడానికి కుక్క విగ్రహానికి పూజలు చేస్తారు.
* చేతబడి చేశారని పళ్ళు పీకడం, కిరోసిన్ పోసి నిప్పంటించడం, వివస్త్రలను చేయడం, కొట్టి చంపడం లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.
* చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోమాపురం గ్రామంలో చిన్న పిల్లల జబ్బులకు అక్కడి పూజారి చెక్క చెప్పు వైద్యమే మందు. అనారోగ్యంతో వచ్చే వారికి దెయ్యాలు ఆవహించాయని, వాటిని తరిమేస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని కొరడాతో బాదుతాడు. పిల్లలు లేని వారు తమ వీపుపై పూజారి పాదం పడితే పిల్లలు పుడతారని తొక్కించుకుంటారు.
* కొందరు గ్రహణం రోజు బోజనం చెయ్యరు, అమావాస్య నాడు పెళ్ళిచేసుకోరు. గర్బిణులు బయటకు రారు. వంటపాత్రలలో, నీటిలోగడ్డిపోచలు వేస్తారు. గ్రహణం కారణంగా దేవాలయాల్లో అన్నిసేవలు, దర్శనాలను రద్దు చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 వరకు ఆలయం తలుపులను మూసి వేస్తారు.
* బయలుదేరినప్పుడు ఎవరన్నా తుమ్మితే కాసేపు కూర్చొని మంచినీళ్ళు తాగి వెళ్ళమంటారు. పరీక్షల్లో కాపీకొడుతూ దొరికిపోయినా బయలుదేరేటప్పుడు తుమ్మిన వ్యక్తిదే తప్పు అతనిది మంచితుమ్ము కాదు అంటారు. తుమ్ము రాబోయే ప్రమాదాన్ని తమ్ముడై చెబుతుంది అంటారు.
* తండాల్లోని గిరిజనుల్లో ఎక్కువమంది ఆడపిల్లలు గలవారు ఆడపిల్లను దానమిస్తే మగపిల్లలు పుడతారంటూ మగపిల్లవాడికోసం ఆడపిల్లను దానం చేసి వదిలించుకుంటారు.
* కరీంనగర్ జిల్లాలో ఆవుకు మనిషి పుట్టాడని అందువలన కొడుకులు చస్తారని ఎంతమంది కొడుకులుంటే అన్ని దీపాలు వెలిగించారు.
* నాగమణి, నల్లపసుపు కొమ్ము, నేలగుమ్మడికాయ, నల్లపిల్లి, ఇరవైగోళ్ల తాబేలు, రెండుతలల పాము లాంటివాటికి అద్భుత శక్తులున్నాయనే కారణంతో లక్షలాది రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నారు .(సాక్షి గుంటూరు6.11.2009)
దేశంలో కొన్ని మూఢనమ్మకాలు

* ఒరిస్సా-జీవితం సుసంపన్నం అవుతుందన్న నమ్మకంతో దేవతల విగ్రహాలకు లక్షల రూపాయల కరెన్సీ నోట్ల దండలు వేసి నదిలో నిమజ్జనం చేస్తారు. నీళ్లలో వేసిన డబ్బును తీసుకుంటే దేవత ఆగ్రహానికి గురికావల్సి వస్తుందన్న భయంతో ఎవరూ వాటిని తీసుకోరు
* మధ్య ప్రదేశ్‌-జబల్‌పూర్‌కు చెందిన సర్జన్ బాబా-’సరోత బాబా’ ఈశ్వర్ సింగ్ రాజ్‌పుట్. గోళ్ళను కత్తిరించే గోరుగల్లు తో రోగుల కంటివ్యాధులను నయం చేస్తానని నమ్మబలికి పదకొండు ప్రాణాలను బలి తీసుకున్నాడు.http://telugu.webdunia.com/religion/believeitornot/article/0709/17/1070917027_1.htm
* కేరళ-నాడీ శాస్త్రంలో మీరు పాత జన్మలో ఎవరు, ఏమిటి అనే కాకుండా వచ్చే జన్మ లో ఎక్కడ ఎలా జన్మించబోతున్నారో కూడా చెప్పేస్తారు.
* నవరత్నాలు ధరిస్తే అపజయం ఉండదట. వజ్రాలు కొందరికి అదృష్టాన్ని కలిగిస్తాయని, కొందరికి అవి అరిష్టాన్ని తెస్తాయని నమ్మకం.
* గోదానం చేసినవారు పడవలో వైతరణి నదిని దాటగలరు గాని, గోదానం చెయ్యలేని పాపాత్ముడు సలసల కాగుతూ ఉండే ఆ నదిలో దిగి నడవవలసిందేనట,