Tuesday, June 2, 2009

లోక్ సత్తాకి

తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అర్హతలేమిటో నాకైతే తెలియదుగాని, ఆయన కొన్ని ప్రశ్నలని లేవనెత్తాడు—లోక్ సత్తా, జయప్రకాష్ నారయణ్ ల మీద!

1) కడపలోనూ పులివెందుల్లోనూ అభ్యర్థుల్ని యెందుకు నిలప లేదు?

2) ఖైరతాబాద్ నించి కాకుండా కుకట్ పల్లి నించి యెందుకు పోటీ చేశారు? దాని వెనక వున్న కాంగ్రెస్ వాళ్ళు యెవరు?

3) వారసత్వ రాజకీయాలు గిట్టవని చెప్పి, యూపీయే ప్రభుత్వానికి చెందిన జాతీయ సలహా మండలి లో యెలా పని చేశారు?

4) కార్పొరేట్ కాళాశాలలమీద పోరాడాతాం అని, చుక్కా రామయ్యకి యెందుకు సీటు ఇచ్చారు?5) మద్యం పంచడానికి వ్యతిరేకం అని చెప్పారుగాని, మీ యేజంట్ తెర్లాం ఉపయెన్నికల్లో మద్యం సేవించి వస్తే, రిటర్నింగ్ ఆఫీసరు మెడపట్టి గెంటేశారు కదా?

6) అసెంబ్లీ నించి వాకౌట్లూ గట్రా చెయ్యబోమని ప్రకటించారు—కాంగ్రెస్ తో మాచ్ ఫిక్సింగా?7) యెన్నికలయ్యాక, స్టార్ హోటెల్ లో విలేకర్ల సమావేశం పెట్టి, మీడియా కి విందు ఇచ్చారు—ఇదా స్వచ్చత?8) యే సామాజిక న్యాయం పాటించారు?

9) గత అయిదేళ్ళలో అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యే పోరాటాలూ యెందుకు చెయ్యలేదు?

ఇవీ ప్రశ్నలు!

వీటికి జేపీ కూడా దీటుగా జవాబు చెపుతాడని మనందరం ఆశిస్తాం కదా?
జేపీ తరఫున నేను చెప్పగల జవాబులు :

1; 2 : యే నియోజక వర్గాల్లో యెవరు పోటీ చెయ్యాలనేది, పార్టీలో యెన్నికలు నిర్వహించి నిర్ణయించారు కదా!
3. వారసత్వ రాజకీయాలకీ, యూపీయే ప్రభుత్వానికి సంబంధం లేదు కదా?
4. చుక్కా రామయ్య ఓ మేధావి! ఆయన కాలేజీలు రద్దు చేసినా ఆయన పట్టించుకోరు! (ఇవి నిజాలా?)
5. యేజంటు యెవడో మద్యం సేవించడానికీ, పార్టీ మద్యం పంచడానికీ సంబంధం యేమిటి?
6. వాకౌట్ చెయ్యను అంటే—లోపలే వుండి పోరాడతానని!—దీన్నేదో ఫిక్సింగంటే యెలా?
7. పార్టీ యెన్నికల్లో ఖర్చుపెట్టగా మిగిలిన డబ్బులతో పెట్టాం! తప్పా?
8. సామాజిక న్యాయం పార్టీ మాది కాదు—చిరంజీవిది!
9. పేపర్లలో ప్రకటనలిస్తూనే వున్నాం! జల యఙ్ఞాన్నీ, కాగ్ నివేదికపై, ఖండనలూ మండనలూ ప్రకటిస్తూనే వున్నాముగా?

యెలా వున్నాయి?

ఇంతకీ జేపీ యేమన్నారు?

1. ప్రధాన ప్రతిపక్షానికి ప్రతిపక్షం గా వుంటామని వాళ్ళు భయ పడుతున్నారు!
2. డబ్బులూ మద్యం పంచకుండా వోట్లు యెలా సంపాదించుకోవాలో మాకు తెలుసు!
3. నన్ను ప్రభుత్వం నియమించింది—సోనియా గాంధీ కాదు! దీని ద్వారా—పాలనా సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ పధకం, గ్రామ న్యాయాలయాల చట్టం, జవహర్లాల్ నెహ్రూ పట్టణ పునర్నిర్మాణ పధకం, జాతీయ ఆరోగ్య పధకం—ఇవన్నీ సాధించ గలిగాం! (ఇది మాత్రం నిజం—నిజం గా హేట్స్ ఆఫ్ టు జేపీ!)
4. నా పోరాటం తప్పంటే, యే రకం గా తప్పో ప్రజలే చెప్పాలి!

బాగుంది కదూ!

మీరేమంటారు?

4 comments:

Panipuri123 said...

చుక్కా రామయ్య కాదు...విజ్ఞాన్ రత్తయ్య

Vinay Chakravarthi.Gogineni said...
This comment has been removed by the author.
Krishna Sree said...

Dear Panipuri123!

ఏమో! రామయ్యో, రత్తయ్యో!

ఈ తప్పుమాత్రం నాది కాదు--ఆ రెడ్డిదో, ఆ పేపరోడిదో!

ధన్యవాదాలు!

Krishna Sree said...

బాబూ Vinay Chakravarthi.Gogineni!

ఈ తెలింగ్లీషు కన్నా, చక్కగా లేఖిని వాడచ్చుగా!

ఇక ఐయేయస్ కి రాజీనామా ఇచ్చిన మొదటివాడు అన్నానా నేను? ఆయనేదో గొప్ప అన్నానా? ఆయనకేదో ఒక ప్లాన్ వుందన్నానా? 16 యేళ్ళుగా యేమి చేశాడో నాకర్థం అయ్యింది అన్నానా? యెక్కడా?!

నీ చూద్దాం, చూద్దాం లకి నావి కూడా చూద్దాం, చూద్దాం లే!

ధన్యవాదాలు!