Wednesday, July 8, 2009

పోలీసు సమర్థత!

5కే రన్!
‘అవునయ్యా! పోలీసు రిక్రూట్ మెంట్ అనగానే, కొన్ని వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు! వారికి కొన్ని పరీక్షలు పెట్టి, చాలా మందిని వడకట్టేసి, కొంతమందికే వుద్యోగాలు ఇవ్వాలి—సరే! అందుకని, చిన్నారి ప్రాణాలతో, వాళ్ళ ఆశలతో, ఆడుకొంటారా?’ అని ప్రశ్నించేవాడు యెవడూ లేడు!

ఒడ్డూ, పొడుగూ, (కనీసం టిఫిన్ కూడా తినకుండా, యెండలో, చొక్కాలు విప్పేసి, సర్టిఫికెట్లు చంకల్లోనో, పేంటు జేబుల్లోనో దోపుకొని) తట్టుకొనే సమర్ధత—ఇవి కాకుండా, ‘5 కిలోమీటర్లు ‘ పరిగెత్తాలట!

అందులో నేల రాలి పోతున్న ‘పిట్ట’లెన్నో!

వాటిల్లో మీడియాలోకొస్తున్నవి ఒకటో, రెండో!

(దీంట్లో, ‘అసమదీయులకి’ రన్ ప్రారంభమయ్యాక, యేదో ఒక మలుపులో, ప్రత్యర్థులూ, ఇతర చూసేవాళ్ళూ లేకుండ చూసుకొని, ఓ ఏ సీ వాన్ లో యెక్కించుకొని, బోర్న్ విటానో, బూస్టో ఇచ్చి, తీసుకెళ్ళి 4.6 కిలోమీటర్ల దగ్గర, యెవరూ చూడకుండా దింపేస్తున్నారట! వాళ్ళు మొత్తం పరిగెట్టేది ఓ కిలోమీటర్ లోపే! అదీ అందరికన్నా ముందు గమ్యం చేరేలాగ!—‘మేమెన్న తరమా నీ భాగ్య గరిమా!’)

జనవరి 26 న మన ‘రిపబ్లిక్ డే’ పెరేడ్ ఢిల్లీలో జరుగుతుంది—చూసే వుంటారు—ఆ మిలిటరీ వాళ్ళతో సమంగా, చిన్నారులూ, ఎన్ సీ సీ వాళ్ళూ—ఆడా మగా చక్కగా నడుచుకుంటూ వెళుతుంటే, కన్నుల పండువుగా వుంటుంది!

మరి రాష్ట్రం లో జనవరి 26 కి గరర్నరుగారూ, ఆగష్టు 15 కి ముఖ్యమంత్రిగారూ వందనం స్వీకరించే ‘మన పోలీసుల’ పెరేడ్ గమనించారా? ఇంతంత పొట్టలేసుకుని ఆఫీసర్లూ, ఒకరి కదలికకీ ఇంకొకరి కదలికకీ పొంతనలేని మార్చర్లూ—ఆహా! ఇదోరకం కన్నుల పండుగ!

మరి ఇలాంటి పోలీసుల్ని తయారు చెయ్యడానికి, 5కే రన్ లెందుకు? చిన్నారుల ప్రాణాలు తియ్యడమెందుకు? యెవరి బుఱ్ఱలో మెరిసిన ‘అవిడియా’రా ఇది తింగరోళ్ళలారా!

P.S.: ఐ న్యూస్ లో రాత్రి 11.00 గంటలకి ‘జీవన రహస్యాలు’ పేరుతో ఓ పిచ్చాడు ‘సాంబారు, రసం’ రోజూ అన్నం లో వేసుకుంటే, ‘మలబద్ధకం’ వస్తుందంటున్నాడు! విన్నారా?


No comments: