ఒకటి నించి పది
ఒకటీ ఓ చెలియ
రెండూ రోకళ్ళు
మూడూ ముచ్చెలక
నాలుగూ నందన్న
ఐదూ బైదీలు
ఆరూ దారాలు
యేడూ బేడీలు
యెనిమిదీ యెనమంద
తొమ్మిదీ తోకుచ్చు
పదీ పట్టెడ.
ఇది బాల శిక్షల్లో వుందో లేదో తెలియదు. అమ్మమ్మలు పిల్లలకి అంకెలు నేర్పడానికి ఇలా చెప్పేవారు!
ఇందులో కొన్ని పదాలకి నాకు ఇప్పటికీ అర్థం తెలియదు.
పట్టెడ అనే ఆభరణం ఒకటి వుండేది అని తెలుసు. ఇప్పుడెవరూ వాటిని ధరించడం లేదు అనుకుంటా.
అన్నట్టు, ఓ ముఫ్ఫై యేళ్ళ క్రితం, కడియాలూ, కంటెలూ, కాసుల పేర్లూ, పలకసర్లూ, చంద్రహారాలూ--ఇవన్నీ మోటు నగలు!
సింపుల్ గా ఒంటిపేట చెయిన్ (వుంటే చిన్న లాకెట్ తో) ధరించడం ఫేషన్!
(చదవండి--మన ఆడ రచయిత్రుల నవలల్లో హీరోయిన్ల వర్ణనలు)
అప్పుడు అందని ద్రాక్ష పళ్ళు చేదు మరి.
ఇప్పుడో--గ్రాము దాదాపు 2000 కి పెరిగినా, యే బంగారం కొట్టూ ఖాళీ వుండటం లేదు.
'ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది కాబట్టే రేట్లు పెరుగుతున్నాయి' అని అమాత్యులు సెలవిస్తున్నారంటే.......మరి!
No comments:
Post a Comment