యంత్రాంగమా, గాడిదాంగమా?
మొన్న రాత్రి మళ్ళీ ఇండోనేషియా సముద్రం లో భూకంపం వచ్చింది--సునామీ బయలుదేరిందని వార్తలు వచ్చాయి.
ఇదివరకు ఇలాంటి భూకంపమే సునామీ తో మన తీర పట్టణాల కొంప ముంచింది.
ఇప్పుడు అందుకే అధికారులు ఉరుకులూ పరుగులూ పెట్టి, ఆఖరికి యేమీ లేదని ఊపిరి పీల్చుకున్నారు.
దేవుడు రక్షించాడుకాబట్టి సరిపోయింది.....లేకపోతే.....?!
2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీ మన తీర ప్రాంతాల్ని వణికించడం తో, కేంద్ర ప్రభుత్వం 'సునామీ హెచ్చరిక కేంద్రాలు' స్థాపించాలని నిర్ణయించి, మన రాష్ట్రానికి ఆరు కేంద్రాలు మంజూరు చేసింది.
ఒక్కో కేంద్రానికీ--యెంతో కాదు--4 లక్షల ఖరీదు చేసే, డిజిటల్ పరికరాలని సరఫరా చేశారుట. వాటి బాధ్యతని మత్స్యకారుల సంఘాలకి అప్పగించారట.
మరి మన ప్రభుత్వం గొప్పతనమేమిటంటే, ఆ పరికరాలు పనిచేసేటట్టు చెయ్యడానికి, 3 వేల రూపాయలతో విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలట. తరవాత నెలవారీ వచ్చే విద్యుత్ బిల్లుల్ని చెల్లించాలట. మత్స్యకారుల సంఘాలు ఈ అదనపు భారాన్ని వహించలేమంటే, ప్రభుత్వం కూడా నా వల్ల కాదు అనేసిందట.
ఫలితం గా, కేంద్రాల్లోని లక్షల విలువ చేసే పరికరాలు 'అచేతనం' గా వుండి పోయాయట!
మంత్రుల దగ్గరనించీ ప్రతీ పదవిలో వున్నవాడికీ, వాడినా వాడక పోయినా పాతికో ముఫ్ఫయ్యో వేలతో కంప్యూటర్లిచ్చి, వాటికి యూ పీ యెస్ లని సహితం యేర్పాటు చేసే ప్రభుత్వం, దాని యంత్రాంగం, సునామీ హెచ్చరిక కేంద్రాలకి విద్యుత్ కనెక్షన్ లు ఇవ్వలేక పోయిందంటే, వీళ్ళనేమనాలి?
శాసన సభ్యులూ, అధికారులూ అందరికీ, సముద్రం ప్రక్కనే ఖచ్చితం గా నివసించాలని ఓ ఆర్డరు పాస్ చేస్తే, ఈ సమస్య తీరుతుందంటారా?
ఖచ్చితం గా తీరుతుంది.
ప్రయత్నించండి!
4 comments:
మూడు వేలతో కనక్షను ..మినహాయింపు ఇవ్వవచ్చు..కరంట్ బిల్ నెలవారీ ఏర్పాటు చేయడం పెద్ద కస్టమ్ కాదు...సంకల్పం లేకపోవడమే...ఎప్పుడో మళ్ళీ సునామీ వచ్చినపుడు చూద్దాం..అన్న మన బ్యూరోక్రాట్స్..వాళ్ళ పద్దతులు ఎలా వుంటాయో..ఒకసారి దరిద్రగొట్టు బ్యూరోక్రసి...అంటూ నే చిరాకుపడ్డా..
దరిద్రగొట్టు బ్యూరోక్రసి లింక్ ఇక్కడ ..ఇన్తృస్ట్ వుంటే చూడండి..
http://kvsv.wordpress.com/2010/04/05/%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%97%E0%B1%8A%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AF%E0%B1%82%E0%B0%B0%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8/
డియర్ kvsv!
యేకీభవించినందుకు చాలా సంతోషం.
ఇంకో చిన్న విషయమేమిటంటే, కనిపించని భూతం 'బ్యూరాక్రసీ' ని నిందించుకుంటూ కూచుంటాం మనం.
అది యెక్కడుంది? 'రైట్ మ్యాన్ ఇన్ ది రైట్ ప్లేస్' చెయ్యలేని మనలోనే వుంది!
మరి ప్రయత్నిద్దామా?
మీ లింక్ కి వెళితే వచ్చిన సమాధానం--
క్షమించండి, మీ ప్రమాణాలకు సరిపోలిన టపాలేమీ లేవు.
ధన్యవాదాలు.
"Osaamaa....." గారూ...,
నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
Post a Comment