సినిమా పాటలు
'ఆహా! యేం వ్రాశాడండీ.....ఫలానా ఆయన!' అంటారు సినిమాపాటలో సాహిత్యం నచ్చితే.
'ఉరుముకు జడిసే నెచ్చెలి, అడుగక ఇచ్చెను కౌగిలీ' అన్నా, 'క్షణం ఆగనంటూంది వోణీ' అన్నా--ఇదే మాట.
మరి సినిమా పాటలు ఆడ కవయిత్రులు యెందుకు వ్రాయరో?
('ఆడ' అని ప్రత్యేకం గా అంటున్నానని కోప్పడకండి. ఇప్పుడున్నారో లేదో గానీ, ఇదివరకు మగ రచయిత్రులూ, కవయిత్రులూ కూడా వుండేవారు.)
సమాధానం 'చింపులూ'!--నిర్మాతా, దర్శకుడూ, సంగీత దర్శకుడూ వగైరాలతో పాటల 'డిస్కషన్' లో రాత్రి తెల్లవార్లూ కూచోవాలి--స్టార్ హోటళ్ళలో--అందుకని.
ఆడ రచయిత్రుల్లో బొమ్మదేవర నాగకుమారి అని (ఈపాటికి అమ్మా, అమ్మమ్మా అయిపోయి వుంటుంది) శృంగారాన్ని కూడా సిగ్గుపడకుండా వర్ణించేది తన నవలలూ, కథల్లో. ఆవిడకి ఆంధ్ర భూమి వీక్లీ సంపాదకుడు 'సికరాజు' మంచి ప్రోత్సాహం ఇచ్చేవాడు.
అలా అవకాశమొస్తే మహిళా దర్శకురాళ్ళు వచ్చినట్టే, ఈ రచయిత్రులూ, కవయిత్రులూ కూడా వస్తారు. స్టోరీ డిస్కషన్లూ వగైరా రాత్రుళ్ళు హోటళ్ళలో కాకుండా, ప్రొడక్షన్ ఆఫీసుల్లోనే జరుగుతాయి.
రెండు, మూడు రోజుల్లోనే డిస్కషన్లు ముగిసిపోవడం, సినిమా రీళ్ళు గబగబా చుట్టేసి, ఆనక సీడీలు చేసి అమ్ముకునే బాధ తప్పుతుంది.
ఆకాశం లో సగం నీవు--అంటాడు మగాడు. యెక్కడ సమానత్వం సినీరంగం లో?
2 comments:
hi na peru madhuri.. mi sandehaniki na vadda konthamatuku samadhanam undi...nalanti rachayitrulu ...kavithalu patalu rasthu, unna patalaku paradylu rasthu prathi zilla lo vandalamandi naarimanulunnaru...kani chitra ranganiki ela proceed avalo thelika...(nalaga) proceed
ayinda akkada c-class rajakeeyalu, digajaarudutanam tattukoleka oka cinemaku kuda patalu rayakanda venakki vachchsina mahilalu naku padula sankhyalo telusu...memu aakasamlo sagame kani bhoolokamlo mottam magallega....
డియర్ sweeyapraneetham!
ఈనాటి గొప్ప సినీ కవులు వేటూరి, సిరివెన్నెల సైతం కొన్నాళ్ళు 'ఘోస్ట్' లు గా వున్నారని, వారి పాటలని తమ పేర్లతో ప్రచురించుకున్న దర్శకులున్నారని తెలిస్తే, మీకు కాస్త వూరట కలుగుతుందనుకుంటాను.
లేఖిని ని బాగా వుపయోగించుకోవడం నేర్చుకోండి. ప్రచురించే ముందు వ్రాసిన దాన్ని అనేకసార్లు చదివి, సవరించండి. అక్షర దోషాలు నివారించండి. మీ భావాన్ని యెంత బాగా 'ఎక్స్ ప్రెస్ ' చెయ్యగలిగారో మీరే సరిచూసుకోండి.
యేమో--రేపెప్పుడో ఓ మహిళా దర్శకురాల్నించి మీకే పిలుపు రావచ్చు!
కీపిటప్!
Post a Comment