Sunday, February 28, 2010

సినిమాలు


మన తెలుగులో లెజెండ్ లూ, స్టార్ లూ, హీరోలూ, దర్శకులూ, కమెడియన్లూ, టెక్నీషియన్లూ తమ తమ్ముళ్ళూ, కొడుకులూ, మనమలూ, మేన కోడుకులూ, అల్లుళ్ళూ మొదలైన వారిని అందరినీ హీరోలు చేసేస్తూ, వివిధ రాష్ట్రాలనించి హీరోయిన్లని దిగుమతి చేసుకొంటూ, వాళ్ళ అందాలని ఆరబోయిస్తూ, తెలుగు భాషని ఖూనీ చేస్తూ, చేయిస్తూ, భవిష్యత్తులో యెప్పుడో
తియ్యవలసిన సినిమాలని ఇప్పుడే తీసేస్తూ, కోట్లు ఖర్చుపెట్టి, లాభాలు రాకపోయినా, టీవీ
చానెళ్ళకీ, సీడీలుగానూ అమ్ముకొంటూ, చింతించకుండా హంగామా చేస్తుండగా, బాలీవుడ్
వాళ్ళు ఇంకా షారుఖ్, సల్మాన్ మొదలైన ఖాన్లనీ, బచ్చన్లనీ, గోవిందాలనీ, అక్షయ్ లనీ, ముసలి హీరోయిన్లనీ వుపయోగించి, కొత్త కొత్త కథలతో, గొప్పగా సినిమాలు తీసి, కోట్లు దండుకుంటున్నారంటే--లోపం యెక్కడుంది?

బాలీవుడ్ కి దేశావ్యాప్తం గా, ప్రపంచ వ్యాప్తం గా మార్కెట్ వుంది--అన్నది కుంటి సాకు.

హాలీవుడ్ లో ఇప్పుడు అన్నీ 'విఠలాచార్య సినిమాలు ' తీసి, కోట్ల డాలర్లు నూకేస్తున్నారు!

మరి కీలకం యెక్కడుంది?

2 comments:

హరి said...

తెలుగు సినిమా అర డజను వ్యక్తుల చేతిలో కబ్జా చేయ బడి ఉంది. వీరికి వీరి బంధువులను తప్ప వేరే వారిని హీరోలుగా పెట్టి సినిమాలు తీసే ఉద్దేశం లేదు.

ఈ కుక్క మూతి పిందెలని ప్రొజెక్ట్ చేయడానికి ఏమేమి చేస్తారో చూడండి.

1. బాలీవుడ్ అమ్మాయిల అందాలని ఆర బోస్తారు.
2. అవసరం లేక పోయినా మారిషస్, స్విట్జర్లాండ్ వగైరా లోకేషన్స్ పెడతారు.
3. ఒక బ్రహ్మానందాన్ని వాడుకుంటారు.
4. అవసరం లేక పోయినా విపరీతమైన గ్రాఫిక్స్ వాడతారు.
5. విపరీత మైన హింసని చూపిస్తారు.
6. వీటన్నిటి కోసం సెన్సార్ బోర్డుని మేనేజ్ చేస్తారు.

ఇంకా కారణాలు ఉన్నప్పటికీ, ప్రధానంగా ఈ కారణంగానే తెలుగు సినిమాలో భావ దారిద్ర్యం రాజ్యమేలు తోంది.

Unknown said...

డియర్ హరి దోర్నాల!

మీరన్నది నిజమేనేమో!

మరి బాలీవుడ్, హాలీవుడ్ గురించి కూడా యేమైనా విశ్లేషించారా?

ధన్యవాదాలు.