Saturday, February 27, 2010

వివాహ భోజనంబు


ఘటోత్క(రో)శయ్య

ముఖ్యమంత్రిగా రోశయ్య మొదటిసారి పశ్చిమ గోదావరి జిల్లాకి వస్తున్నారట--27-02-2010 న.

ఆ సందర్భం గా, ఆరోజున ఆయన మధ్యాహ్న భోజనం కోసం క్రింది మెనూ ని సిధ్ధం చేశారట.

"అన్నంతో పాటు కొబ్బరి అన్నం, మరో యెనిమిది రకాల అన్నాలు, పులిహోర, చక్రపొంగలి, పెరుగావడ, గారె, గుత్తివంకాయ కూర, అరటికాయ కూర, బెండకాయ పులుసు, తోటకూర పెరుగు, బొబ్బట్లు, బిర్యానీ, కారప్పొడి, కరివేపాకు పొడి, శనగపొడి, నేతి ఆనపకాయ కూర, టమోటా...మునక్కాడ...జీడిపప్పు కూర, పెసరట్టు, మజ్జిగ చారు, పెరుగు, ఉలవచారు, సాంబారు, రసం, దొండకాయ కూర, ఆలూ చిప్స్, పన్నీపూల్ మఖాన్, మిక్స్ డ్ ఆవకాయ, బీరకాయ పుదీనా పచ్చడి, తాలింపు పప్పు, అప్పడాలు, వడియాలు, మామిడికాయ పప్పు, చల్ల మిర్చి, మిరపకాయ బజ్జి, పండ్లు...........ప్రత్యేక తాంబూలం!

పాపం ఆయనకి ఓ పంటిక్రిందకైనా వస్తాయో లేదో!

నేనే ముఖ్యమంత్రినైతే, అలాంటి మెనూ పురమాయించినవాడికీ, దానికి ఖర్చు పెట్టిన వాడికీ--ఓ వారం పాటు 'పావురాల కొండ ' చుట్టుపక్కలో, ఛత్తీస్ గఢ్ అడవుల్లోనో--కందమూలాలు తిని బతికే శిక్ష వేసేవాణ్ణి.

యెలా వుంది నా అయిడియా?


2 comments:

Rajendra Devarapalli said...

ఈ జాబితాలోని వాటిల్లో ఒక్కటీ ఆయన రుచి చూడకపోవచ్చు.మొన్నామధ్య వైజాగు వచ్చినప్పుడు ఇలాంటిదే స్టార్ హోటల్ నుంచి జాబితా తెప్పించారు వంటలు.కానీ ఆయన తనకుమార్తె తెచ్చిన వాటతోనే సరిపెట్టుకున్నారు.అక్కడ కూడాదగ్గరి బంధువులో స్నేహితులో ఉంటే అక్కడే ఆయన భోజనం అవ్వచ్చు.

A K Sastry said...

డియర్ రాజేంద్ర కుమార్ దేవరపల్లి!

మరి ఆ వివాహ భోజనంబు యెవరికోసం అంటారు? దానికి యెంత ఖర్చు పెట్టారు? ఆ డబ్బు యెవరిది?

ధన్యవాదాలు.