నార, మంగేష్ లతో
అక్కడితో మా సంవాదానికి 'ఫుల్ స్టాప్' అనుకున్నాను!
అప్పుడు ప్రవేశించాడు, 'నార '.
నేను 'సంవాదం' టపాలకి ముందు--అర్థంపర్థంలేని వ్యాఖ్యలు అని వ్రాసిన టపాలో చెప్పిన అన్ని అవలక్షణాలూ వున్నాయి ఈయనకి!
నేను ఆత్మ గురించి వ్రాయగానే,
Nara said...
ఇది నిజం అనటానికి ఆథారాలు ఎమైనా వున్నాయా? ఆథారాలు లేకుండా దాన్ని ఎలా నమ్మటం?
--అని వ్యాఖ్య!
నేను,--'ఆధారాలు' అంటూ వ్రాశారంటే, మీరు నా ముందు టపా చదవలేదు అని తెలుస్తూంది. అందులో ముందే వ్రాశాను 'గరుడ పురాణం' అని!
వెంటనే అది సంపాదించి చదవడానికి ప్రయత్నించకండి! దాని పేరు సైతం తలవడం ఆశుభం గా భావించేవాళ్ళున్నారు!
అయినా నేను ముందునించీ చెపుతున్నాను--మనం నమ్మినా, నమ్మకపోయినా, ఇవన్నీ మన సంస్కృతిలో భాగమని!
చదువుతూ వుండండి!--అని సమాధానం ఇచ్చాను.
మధ్యలో 'పవన్' సమాధానం ఇచ్చారుగానీ, స్వయం గా నేను కలగజేసుకోడంతో అనుకుంటా, తరవాత వూరుకున్నారు.
మళ్ళీ, నార,--'మీరే మీ హేతువాదం బ్లాగులో అవెందుకు, ఇవెందుకు, అంతా వేలం వెర్రులు, శాస్త్రాలు, యోగాలు, అవసరమా అని వ్రాసారు. అలాంటప్పుడు వీటిని ఎలా నమ్మటం? అందుకనే ఆథారాలు వున్నాయా అన్నాను.........గరుడపురాణం ఎవరైనా చనిపోయినప్పుడు చదువుతారు...........అప్పుడే ఎందుకు చదువుతారు?........చదివితే అశుభం ఎలా అవుతుంది. మీరు చదవుతూ వుండండి అన్నారు. నేను రెండు, మూడు సార్లు చదివాను.'
(నేను వ్రాసింది, నా తరవాత టపాలు చదివితే మంచిదని! పాపం ఈయనకి అది కూడా అర్థం కాలేదు.....వారి బొంద!)
'......... జీవుడు (ఆత్మ) శరీరాన్ని అంటిపెట్టుకొనే వుంటాడట." అని చెప్పారు.........భువర్లోకము అంటే ఏమిటి? అది ఎక్కడ వుంటుంది?........' అంటూ వ్రాశారు.
తీరా ఆయన వివరాలు చూద్దామని ప్రయత్నిస్తే, 'profile not available'!
అందుకే, "నేను వ్రాసేవాటికీ--నేను చదివి, విని, చెప్పాలనుకున్నవాటికీ తేడా గ్రహించలేని వాళ్ళకీ, ముఖ్యంగా ముక్కూ మొహం లేని నారలూ, పీచులూ లాంటివాళ్ళకీ సమాధానం ఇచ్చి నా సమయం వృధా చేసుకోలేను!
క్షంతవ్యుణ్ణి!........" అని వ్రాశాను.
అక్కణ్ణించి, యెలా రెచ్చిపోయాడో చూడండి --'సమాధానము చెప్పలేనప్పుడు ఇలాంటి బూటకపు రాతలు రాయవద్దు. మిమ్మల్ని ఎవడు రాసి ఏడవమన్నాడు. నీకు వయసే తప్ప బుద్ది పెరగలేదు. నువ్వు రాసిన దానిని వివరణ అడిగితే చెప్పలేని అసమర్థుడవని అర్థమైనది. నిన్ను క్షమించవలసిన పనిలేదు. అంతా నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.'
అని వాగి, తన మిత్రులకి--'అర్థమైనదిగా. ఎవరైనా వివరణ అడిగితే తిడతాడు. జాగ్రత్త. ఎదుటి వాళ్ళను గౌరవించలేని వాడు ఎవడో గ్రహించండి. ఈయన బుద్దికి తోచినది రాస్తాడు. అదేమిటంటే నీలాంటి వాడికి సమాథానము ఇచ్చి నా సమయం వృథా చేసుకోను అంటాడు. ఇక మీరే అర్థం చేసుకోండి. అంటే ఈయన రాసింది గుడ్డిగా చదవాలి. అందుండి ఏమైనా ప్రశ్న వస్తే తిరిగి చెప్పలేడు. పాపం. ఇలాంటివి చదివి మీ సమయం వృథా చేసుకోకండి. అనవసరంగా మాట పడాల్సి వస్తుంది.'
అని సలహా కూడా ఇచ్చారు!
అంతవరకే అయినా ఓ రకం గా వుండును--కానీ, ఈయనకి మంగేష్ వత్తాసు పలుకుతూ, 'చాలా బాగా చెప్పారు. అయన ఏదో రాస్తారు.. కానీ సందేహములను తీర్చలేరు. అవి తీర్చలేకే విసుగు చెందుతూ వుంటారు.........మీకు కలిగిన సందేహాలు నాకు బాగా నచ్చాయి. ఎక్కడైనా సమాధానములు దొరికితే ఇక్కడ తెలియ పరచండి.'
అని వ్రాశారు!
మళ్ళీ, నార, 'మీ మద్య జరిగినవి చూసాను. అవి చదివాక మీరు చెప్పినది నిజమే అనిపించినది.
ముక్కు మొహం లేనివాళ్ళకి అంటారు ఈయన.. అంటే కృష్ణశ్రీ గారికి తెలియని వాళ్ళెవరు కూడా ఈ బ్లాగు చదవకుడదేమో?...........అహ.. ఓహో అనేవాళ్ళు మాత్రమే చదవాలి అని బ్లాగులో చెప్పండి.' అన్నారు.
ఇలా తానా అంటే తందానా అనుకున్నారిద్దరూ!
నేను పాఠక దేవుళ్ళముందు ఇదంతా బయటపెట్టడం మొదలుపెట్టగానే, పాపం మంగేష్--
నన్ను మనస్పూర్తిగా క్షమించండి. ఇంకెప్పుడూ మీలాంటి పెద్దలను బాధ పెట్టను.
October 13, 2009 10:18 AM
అని వ్రాశారు.
వెంటనే ఆయనకి 'మనలో మనకి క్షమాపణలు వద్దు! కొంచెమైనా అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి--చాలు!'
అని జవాబు వ్రాశాను!
మరి నార కి ఇంకా ఙ్ఞానోదయం అయినట్టులేదు!