Monday, September 28, 2009

ఆత్మ

ప్రయాణం

జీవి మరణించాడు అని ప్రకటించబడ్డాక కూడా, జీవుడు (ఆత్మ) శరీరాన్ని అంటిపెట్టుకొనే వుంటాడట.

శరీరం దహనం చెయ్యబడుతున్నా, ఆఖరివరకూ--కపాలమోక్షం అయ్యేవరకూ శరీరాన్నీ, ఆ తరవాత చితాభస్మాన్నీ అంటుకొనే వుంటాడట.

ఆస్తిసంచయనం జరిగి, అస్థినిమజ్జనం అయ్యాక, కర్మ చేసేవాళ్ళద్వారా, ఆత్మని మంత్రాలద్వారా ఒక శిలలోకి ఆవాహన చేస్తారు--అపరకర్మలు చేయించేవాళ్ళు.

అక్కణ్ణించీ ప్రతీరోజు, నిత్యవిధి చేస్తూ, 'ప్రేతాన్ని దహించడంవల్ల ఆత్మకి కలిగిన వేడి తగ్గడానికి ' అంటూ అనేకసార్లు మంత్రసహితంగా ఆ శిల మీద నీళ్ళు జల్లడమేకాదు, దాన్ని వుంచిన పిడతనిండా నీళ్ళు పోసి, క్రింద చిల్లుపెట్టి, దానిలోంచి ఓ త్రాడు క్రిందికి వేళ్ళాడేలాగ చేసి, ఆ పిడతని జీవుడు మరణించినచోట పైన గాలిలో వేళ్ళాడగడతారు--అందులోంచి చుక్క చుక్కగా కారి, ఆత్మ చల్లబడుతూ, మరణప్రదేశాన్ని కూడా చల్లబరుస్తుందని. కర్మ పూర్తయ్యేవరకూ, ఆపిడత ఖాళీ అవకుండా, అప్పుడప్పుడు నీళ్ళతో నింపమంటారు!

ఇలా పదమూడోరోజు పూర్తయ్యేసరికి ఆత్మ వైతరణిని కూడా దాటి, భువర్లోకానికి ప్రయాణం సాగిస్తుందిట.

అక్కడనించి ప్రయాణానికి లెక్కలు వున్నాయిట--మొదటి నెల ఆత్మకి 'ఒక రోజు ', ఇలా! మధ్యలో 'త్రైపక్షికం' కూడా పెడతారు--ఆ లెఖ్ఖల్లో భాగంగానే.

ఆ తరవాత నించి మనకో నెల అయితే, ఆత్మకి ఒకరోజు, మనకి 12 నెలలయ్యాక (సంవత్సరీక కర్మలు అయ్యాక), అక్కడనించీ మనకి ఓ సంవత్సరమైతే ఆత్మకి ఒక రోజు అనీ చెపుతారు!

చితా భస్మం పూర్తిగా నిమజ్జనం అయ్యేవరకూ--ఆత్మ ప్రయాణం మొదలుపెట్టదుట. (మొన్నామధ్య యేదో మ్యూజియం లో గాంధీగారి చితాభస్మం నిమజ్జనం కాకుండా ఓ పాత్రలో వుంచబడి కనిపించిందట! అందుకే ఇప్పటివరకూ ఆయన ఆత్మకి శాంతి లేదు, ఆయన మళ్ళీ జన్మ యెత్తలేదు--అనుకుంటా!)

ఇక భువర్లోకం లో యెన్నాళ్ళుండాలి--అక్కణ్ణించి ఆత్మ యేమి చేస్తుంది? అనేవాటికి ఇంకా లెఖ్ఖలు వున్నాయట.

అవి ఇంకోసారి!

15 comments:

Unknown said...

Are you believing all this trash?

కత పవన్ said...

Osaamaa.....
నైస్ సార్

నారా గారు
ఇందులో మీకు ట్రాష్ ఏమి కని పించిందో కాస్తా సేలవు ఇస్తారా సార్

Unknown said...

ఇది నిజం అనటానికి ఆథారాలు ఎమైనా వున్నాయా? ఆథారాలు లేకుండా దాన్ని ఎలా నమ్మటం?

A K Sastry said...

డియర్ Nara!

'ఆధారాలు' అంటూ వ్రాశారంటే, మీరు నా ముందు టపా చదవలేదు అని తెలుస్తూంది. అందులో ముందే వ్రాశాను 'గరుడ పురాణం' అని!

వెంటనే అది సంపాదించి చదవడానికి ప్రయత్నించకండి! దాని పేరు సైతం తలవడం ఆశుభం గా భావించేవాళ్ళున్నారు!

అయినా నేను ముందునించీ చెపుతున్నాను--మనం నమ్మినా, నమ్మకపోయినా, ఇవన్నీ మన సంస్కృతిలో భాగమని!

చదువుతూ వుండండి!

ధన్యవాదాలు!

A K Sastry said...
This comment has been removed by the author.
A K Sastry said...

డియర్ పవన్!

చాల సంతోషం!

ధన్యవాదాలు!

Unknown said...

కృష్ణశ్రీ గారికి,

మీరే మీ హేతువాదం బ్లాగులో అవెందుకు, ఇవెందుకు, అంతా వేలం వెర్రులు, శాస్త్రాలు, యోగాలు, అవసరమా అని వ్రాసారు. అలాంటప్పుడు వీటిని ఎలా నమ్మటం? అందుకనే ఆథారాలు వున్నాయా అన్నాను.

గరుడపురాణం ఎవరైనా చనిపోయినప్పుడు చదువుతారు అని విన్నాను. అప్పుడే ఎందుకు చదువుతారు? అసలు గరుడపురాణం చనిపోయిన వాళ్ళకా లేక బతికి వున్నా వాళ్ళకా? ఇటువంటి విషయాలు చెప్పే గరుడపురాణం చదివితే అశుభం ఎలా అవుతుంది.

మీరు చదవుతూ వుండండి అన్నారు. నేను రెండు, మూడు సార్లు చదివాను. నాకు కొన్ని ప్రశ్నలు కలిగాయి. అవి ఇవి:

"జీవి మరణించాడు అని ప్రకటించబడ్డాక కూడా, జీవుడు (ఆత్మ) శరీరాన్ని అంటిపెట్టుకొనే వుంటాడట." అని చెప్పారు. జీవి, జీవుడు ఒకటి కాదా? ఒకడు మరణిస్తే ఇంకొకడు శరీరాన్ని ఎలా అంటి పెట్టుకుంటాడు? అలా అంటి పెట్టుకుంటే మరణించిన వాడు ఎలా అవుతాడు. దహనం అయ్యే వరకు కూడా వుంటాడు అన్నారు. అది ఎలా? కొంచెము వివరింప గలరు.

"'ప్రేతాన్ని దహించడంవల్ల ఆత్మకి కలిగిన వేడి తగ్గడానికి '" అని వ్రాసారు కదా? మరి వేడిని అనుభవించటానికి శరీరము లేదు కదా? అప్పుడు ఆత్మకు వేడి ఎలా కలుగుతుంది? నీళ్ళు పోస్తే ఎలా చల్లబడుతుంది.

మనకో నెల ఐతే ఆత్మకు ఒక రోజు అన్నారు. అంటే 12 రోజులలో సంవత్సరీకము అయ్యాక లెక్కలు ఎలా మారతాయి?

గాంధీ గారి ఆత్మకు శాంతి కలగలేదనియు, మళ్ళీ జన్మ ఎత్తలేదు అని ఎలా నిర్థారించగలరు?

భువర్లోకము అంటే ఏమిటి? అది ఎక్కడ వుంటుంది?

వివరంగా వివరింపగలరు....

A K Sastry said...

డియర్ Nara!

నేను వ్రాసేవాటికీ--నేను చదివి, విని, చెప్పాలనుకున్నవాటికీ తేడా గ్రహించలేని వాళ్ళకీ, ముఖ్యంగా ముక్కూ మొహం లేని నారలూ, పీచులూ లాంటివాళ్ళకీ సమాధానం ఇచ్చి నా సమయం వృధా చేసుకోలేను!

క్షంతవ్యుణ్ణి!

నమస్కారం!

Unknown said...

సమాధానము చెప్పలేనప్పుడు ఇలాంటి బూటకపు రాతలు రాయవద్దు. మిమ్మల్ని ఎవడు రాసి ఏడవమన్నాడు. నీకు వయసే తప్ప బుద్ది పెరగలేదు. నువ్వు రాసిన దానిని వివరణ అడిగితే చెప్పలేని అసమర్థుడవని అర్థమైనది. నిన్ను క్షమించవలసిన పనిలేదు. అంతా నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.

మిత్రులారా!

అర్థమైనదిగా. ఎవరైనా వివరణ అడిగితే తిడతాడు. జాగ్రత్త. ఎదుటి వాళ్ళను గౌరవించలేని వాడు ఎవడో గ్రహించండి. ఈయన బుద్దికి తోచినది రాస్తాడు. అదేమిటంటే నీలాంటి వాడికి సమాథానము ఇచ్చి నా సమయం వృథా చేసుకోను అంటాడు. ఇక మీరే అర్థం చేసుకోండి. అంటే ఈయన రాసింది గుడ్డిగా చదవాలి. అందుండి ఏమైనా ప్రశ్న వస్తే తిరిగి చెప్పలేడు. పాపం. ఇలాంటివి చదివి మీ సమయం వృథా చేసుకోకండి. అనవసరంగా మాట పడాల్సి వస్తుంది.

సెలవు.

Mangesh Devalaraju said...

నారా గారు,
చాలా బాగా చెప్పారు. అయన ఏదో రాస్తారు.. కానీ సందేహములను తీర్చలేరు. అవి తీర్చలేకే విసుగు చెందుతూ వుంటారు. కోప్పడకండి...
పెద్దాయన... అర్ధం చేసుకోండి.

నాకు ఆయనకు చాలా వాద ప్రతివాదనలు జరిగాయిలెండి... ఆ అనుభవముతో చెపుతున్న... పోనీలెండి పాపం...

మీకు కలిగిన సందేహాలు నాకు బాగా నచ్చాయి. ఎక్కడైనా సమాధానములు దొరికితే ఇక్కడ తెలియ పరచండి. .. కృష్ణశ్రీ గారికి కూడా తెలుస్తాయి.

ధన్యవాదములు.

Unknown said...

Mangesh గారూ!

మీ మద్య జరిగినవి చూసాను. అవి చదివాక మీరు చెప్పినది నిజమే అనిపించినది.

ముక్కు మొహం లేనివాళ్ళకి అంటారు ఈయన.. అంటే కృష్ణశ్రీ గారికి తెలియని వాళ్ళెవరు కూడా ఈ బ్లాగు చదవకుడదేమో?

క్షమించండి కృష్ణశ్రీ గారూ ఇంకెప్పుడూ చదవను లెండి. మీకు బాగా తెలిసిన వాళ్లకి, అహ.. ఓహో అనేవాళ్ళు మాత్రమే చదవాలి అని బ్లాగులో చెప్పండి.

వుంటాను.

Unknown said...

ఆత్మ నిజంగా మనుషులను పిడిస్తుంద.

Anonymous said...

hello hasini gaaru,
aatmalu manushulanu peedinchavu. aatma lenide ee deham manishi anabadadu kanuka mee sandehaalaku manchi pustakam chdivi telusukondi.

Anonymous said...

To Krishna sri
sir,
you could have cleared the doubts of Mr. Nara, since those are very simple doubts. Instead you have slipped you tongue which is not good.
regarding Gandhi ji, what you said is wrong. aatma santhiste malli janma undadu. santhi lekapotene janma untundi.

Anonymous said...

To Mr. nara
my dear friend, your doubts are simple. the answers for your question are below
1. u said its trash. if so can you define or show the air?? everybody know that it is every where on this earth. but is there any body who has seen it??
2. Regarding the Garuda Puraanam what you said is right. Reading it is good and not bad as told by Mr.Krishna Sri.
3.Jeevi means the body and Jeevudu means aatma. when the soul is inside the body then the body is with life, when the soul is outside the body, then its said as deadbody.
4. After the death, the soul wanders in the sourroudings of the deadbody, i think now you are clear.
5, regarding Gandhi Ji, if the sould attain peace it will not take birth again. Mr. Krishna sri is wrong in this.
6.Never give place to ego or anger when discussing a point which is very sensible. though Mr. Krishna Sri is wrong side still you have to show you maturity. Hope now your doubts were cleared., BTW iam sreenivasarao and very much interested in this type topics.,