కరవుమనిషిని వణికించే భయంకరమైన మాట ఇది!
మొన్న 08-08-2009 న మన ప్రథాని రాష్ట్రాల మీద ‘ఉరిమారు’!
కరువుపై కదలరేం? అని రాష్ట్ర ప్రథాన కార్యదర్శుల సమావేశం లో ప్రశ్నించి, ఇకనైనా తగిన చర్యలు తీసుకోమన్నారు!
అంతేకాదు—కేంద్రం పూర్తిగా సహకరిస్తుందన్నారు!
ఇంకా, దేశవ్యాప్తం గా 141 జిల్లాలను కరవు జిల్లాలుగా ప్రకటించామనీ, అయినా యే ఒక్క రాష్టృఅం నించీ తమకు నివేదికలు పంపలేదని ఆవేదన వ్యక్తం చేశారు! రాష్ట్రాలు అక్రమ నిల్వలని వెలికితీసే చర్యలు వెంటనే చేపట్టాలన్నారట! మిగిలిన విసహయాల గురించికూడా మామూలుగానే హెచ్చరించారట!
శరద్ పవార్ గారు—కేవలం సరఫరా-గిరాకీల కారణం గానే పప్పుల ధరలు ఇలా పెరిగాయనడం లో అర్థం లేదు. మార్కెట్ వూహా గానాలే ధరల పెరుగదలలో కీలక పాత్ర పోషిస్తాయి! అక్రమ నిల్వలను, నల్లబజారును అరికట్టేందుకు (రాష్ట్రాలు) గట్టి చర్యలు తీసుకోనంతకాలం ధరలను నియంత్రించలేం!—అన్నారట.
బుధ్ధున్నవాడెవడైనా చెప్పే మాటలే కదా ప్రథానీ, వ్యవసాయ మంత్రీ చెప్పినవి!
మన బుద్ధిలేని రాష్ట్ర ప్రభుత్వం యేమి చేస్తోంది?
ఆరు నెలలనించీ బియ్యం ధరలు పెరిగిపోతున్నాయి అని, మూడు నెలలుగా పప్పులు పెరిగిపోతున్నాయి అనీ గగ్గోలు పెడుతున్న ప్రజలనీ పత్రికలనీ కేరేజాట్ అని, పక్కరాష్ట్రాల కన్నా మన రాష్ట్రం లో అన్నీ తక్కువ రేట్లే అని తప్పుడు ప్రకటనలు ఇస్తోంది!
(మనవాళ్ళెవరూ పక్క రాష్ట్రాల్లో లేరా—ఒక్క ఫోను కొడితే, అక్కడ రేట్లెలా వున్నాయో చెప్పరా? కర్ణాటకలో బిజినెస్ లు చేస్తూ ఆస్థులు సంపాదించుకుంటూ దాదాపు అక్కడే కాపరం వుంటున్న వీర జగన్ ని అడిగినా వాళ్ళ బాబుకి చెపుతాడే!)
ఇవన్నీ యెవర్ని వంచించడానికి? బియ్యమూ, పప్పుల నిల్వల్ని స్వాధీనం చేసుకొని, అక్రమ నిల్వ చేసినవాళ్ళకే, మళ్ళీ వేలం లో అవి తక్కువ రేటుకే అప్పచెపుతున్నారంటే—ఇది అక్రమార్కుల కొమ్ముకాస్తున్న దగాకోరు ప్రభుత్వం కాదా?
ఒకప్పుడు డైనమిక్ ఐ యే యస్ అనిపించుకున్న మన ప్రభుత్వ ప్రథాన కార్యదర్శి యేమంటున్నాడు?
మొత్తం 1186 మండలాల్లో, కనీసం 900 మండలాల్లో కరవు ‘లాంటి’ పరిస్థితే వుందట! ఇన్ని జిల్లాలు కరవు తో అల్లల్లాడుతున్నాయని యెలాంటి నివేదికా ఇంతవరకూ రూపొందించనేలేదట—కేంద్రానికి పంపడం సంగతి దేవుడెరుగు! పరిస్థితి తీవ్రం గా వున్నప్పటికీ, తదుపరి చర్యలు తీసుకోవడానికి ఇంకో 4, 5 రోజులు వేచి చూడాలని నిర్ణయించాము! ఆని. యెందుకూ? జెరూసలేము దేవుడేమైనా ఆ రెడ్డిగారికి కల్లో కనబడి మంత్ర దండమేమైనా ఇస్తాడేమోననా? దాన్నాయన ఈ రెడ్డిగారికిచ్చి, ‘హాం ఫట్’ అనమంటాడేమోననా? ఇంకా, అధికార యంత్రాంగం కరవు పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తోందనీ, వివిధ జిల్లాల నించి సమాచారం సేకరిస్తోందనీ, ఇప్పటివరకూ అందిన సమాచారం అందోళన చెందాల్సినంత తీవ్ర పసిస్థితే వుందనీ, అతి త్వరలో ఉన్నత యంత్రాంగం సమావేశమై, ఒక విధాన నిర్ణయం తీసుకుంటారనీ, క్షేత్ర పరిస్థితిని బట్టి కేంద్రానికి నివేదిక పంపి, కేంద్ర బృందాన్ని ఆహ్వానించే అవకాశం వుందనీ, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందువల్ల ఇంతకన్నా యేమీ మాట్లాడలేననీ—తాపీగా, పదినిమిషాలకో మాట సెలవిచ్చారు!
కడుపుకి అన్నం తింటున్నాడా—గడ్డి తింటున్నాడా?
యెవరి చెవుల్లో పువ్వులు పెడతారు?
వీడియో కాన్ ఫరెన్సులూ, యేరియల్ సర్వేలూ వున్నది చంక నాకడానికా!
అత్యవసరమైనప్పుడైనా యంత్రాంగాన్ని పరిగెత్తించగలిగే సత్తా మీకుందా?
యెందుకు నాటకాలు?
శ్రీ శ్రీ ప్రబోధాల స్ఫూర్తితో పీడిత జనాలు తిరగబడితే, మీ డీ జీ పీ లూ, వాళ్ళ దగ్గర ‘ఆర్డర్లీలు’ గా బతికే రక్షక భటులూ యెవరూ మిమ్మల్ని కాపాడలేరు!
ఇప్పటికైనా మేలుకోండి మరి.
4 comments:
గోదావరి డెల్టాలో భాగాలైన రాజోలు లాంటి మండలాలని కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ ఉంది. ఇక రాయలసీమలో కరువు ఎంత దుర్భరమో?
దక్కన్ పీఠభూమి లో బాగాలైన కొలంబో, పలాస లాంటి సముద్రాలని కూడా కరువు సముద్రాలు గా ప్రకటించాలని డిమాండ్ ఉంది. ఇక అమెరికాలో కరువు ఎంత బావుంటుందో ?
Dear Praveen Sarma!
గోదావరి డెల్టా అయినా, రాయలసీమ అయినా దుర్భిక్షానికి ఒకటే నిర్వచనం వుండాలి కదా?
ఇక 'పీఠభూమి ' 'కొలంబో' 'పలాసా 'సముద్రాలు ' అమెరికాలో కరువు.......@#$%^&*+!
Post a Comment