Tuesday, August 4, 2009

మూర్ఖత్వం

పెళ్ళీ—పెటాకులూ!
నిన్నకాక మొన్న హర్యానాలో అదేదో వూళ్ళో ఇద్దరు ప్రేమికులు పెళ్ళి చేసుకున్నారట!

తీరా చేసి, తన పెళ్ళాన్ని తనతో పంపమని అడగడానికొచ్చిన పెళ్ళికొడుకుని—రాళ్ళతో కొట్టి చంపేశారట ఆ గ్రామస్తులు!

యెందుకంటారా—వాళ్ళిద్దరిదీ ‘ఒకే గోత్రం’ అట!

పోలీసులుగానీ, మత పెద్దలుగానీ యేమీ చెయ్యలేకపోయారట!

స్వలింగ సంపర్కాన్నే కోర్టులు గుర్తించిన ఈ రోజుల్లో, పాశ్చాత్య దేశాల్లో ‘ఇన్ సెస్ట్’ కూడా ప్రబలిన ఈ రోజుల్లో, ఈ స్వగోత్రాలూ, రాళ్ళతో కొట్టి చంపడాలూ యేమిటో!

నిజానికి మన హిందూ సమాజం యెంత దగ్గరవాళ్ళయినా, ఆడా మగా మధ్య ‘యేకాంతం’ కుదరనివ్వదు! వరసైన వాళ్ళయినా సరే—వేయి కళ్ళతో వాళ్ళని పరిశీలిస్తూ వుంటారు! ఇది మంచి పధ్ధతి. అందుకనే మనకి ‘ఇన్ సెస్ట్’ కేసులు చాలా తక్కువ! (ఒకటీ అరా వుండవని కూడా చెప్పలేమనుకోండి).

ఇక ఈ గోత్రాలూ అవీ యెందుకు? అసలు మానవ సంతతి అంతా ఒక అమ్మకీ అబ్బకీ పుట్టిందే కదా? అప్పటి సామాజిక అవసరాలకోసం కొన్ని నిబంధనలు యేర్పరచారు—కానీ, ఇప్పటి సామాజిక పరిస్థితుల్లో ఇవన్నీ అవసరమా?

‘వంశ వృక్షం’ సినిమాలో చూపించిందేమిటి?

మనకు చరిత్రలో పేరున్న ‘చంద్రగుప్త మౌర్యుడు’, ‘విక్రమాదిత్యుడు’. ‘శ్రీ కృష్ణదేవరాయలు’ వీళ్ళంతా ‘దాసీ పుత్రులు’ కాదా?

మరేమిటి కులాలూ, శాఖలూ, గోత్రాలూ……..!

న్యూక్లియర్ సబ్-మెరైన్ కి కూడా ‘అధర్వణ వేదం’ చదివి, ఓ సిక్కుమతస్థురాలిచేత ‘కొబ్బరికాయ’ కొట్టించి, జలప్రవేశం చేయిస్తాము!

ఇదేమి చోద్యం? ఇవన్నీ యెవరికోసం?

అసలు ఆ అధికార మదాంధురాలు ‘ఇందిరా నెహ్రూ గాంధీ’ రాజ్యాంగం లో ‘సెక్యులర్’ అన్నపదాన్ని తీసేసి, ‘సర్వమత సమభావనగల లౌకిక’ అని చొప్పించకుండా వుంటే, ఈపాటికి ఈ దరిద్రాలన్నీ రూపుమాసిపోయేవి!

అలా అయితే మా వోటు బ్యాంకులేమయిపోవాలంటారా? ఈ వోటు బ్యాంకులు శాశ్వతం కావని తెలిసిపోయిందిగా!

అయినా వీళ్ళు మారరు—కులాల మధ్యా, మతాల మధ్యా, రాష్ట్రాల మధ్యా, ప్రాంతాల మధ్యా, భాషల మధ్యా—ఇలా యెన్ని వీలైతే అన్ని ‘విభజించి పాలించు’లు చేసేసి, మన పబ్బం గడిచిపోయిందికదా అని సంబరపడతారు!

కానీ, ఓ మూర్ఖులారా—ఇవన్నీ భస్మాసుర హస్తాలే అని తెలుసుకోండి!
6 comments:

శరత్ 'కాలమ్' said...

చక్కగా చెప్పారు.

Indian Minerva said...

rightoooo!!

Krishna Sree said...

డియర్ శరత్ 'కాలం'!

సంతోషం--ధన్యవాదాలు!

Krishna Sree said...

డియర్ Indian Minerva!

Thank you.

Praveen Sarma said...

గుంటూరు జిల్లాలో ఒక మృగాడు తన సొంత మరదలికి పెళ్ళికి ముందు కడుపు చేసి వదిలేశాడు. ఇలాంటి వాళ్ళని చూసే మన వాళ్ళు పెళ్ళికి ముందు అడ-మగ కలుసుకోకూడదు అంటారు.

Praveen Sarma said...

నేను వ్రాసిన సిటీ ఎలైట్ కథ చదవండి. పాశ్చాత్య సంస్కృతి వల్ల యువకులు ఎలా చెడిపోతున్నారో తెలుస్తుంది. http://sahityaavalokanam.net/kathanilayam/2009/august/city_elite.html హిందూ వివాహ చట్టం ప్రకారం నాలుగు తరాల దగ్గరి బంధుత్వం ఉన్న వాళ్ళు పెళ్ళి చేసుకోవడం నేరం కానీ ఒకే గోత్రం ఉన్న వాళ్ళు పెళ్ళి చేసుకోవడం నేరం కాదు.