……..య’ కాదండోయ్! కొత్తావకాశాలు!
మళ్ళీ రాశ్శేఖర్రెడ్డి మంత్రివర్గం కొలువు తీరింది—20 కొత్త ముఖాలతో!
(యెంతసేపూ పాతవాళ్ళకేనా అవకాశాలు—కొత్తవాళ్ళకి వద్దా—దోచుకోడానికి?)
జానారెడ్డిని ‘సం య మ మనం’ పాటించమన్నాడు!
జేసీని “నువ్వు స్టేట్ రౌడీ గానే వుండు—మంత్రివై, మీ తమ్ముడి తరఫున యే ఆర్టీవోనో ‘మంగల్నాకొడకా’ అంటే మళ్ళీ నేను కమిటీలు వెయ్యలేక చావాలి!” అన్నాడు!
పొన్నాలెలాగా ‘జల’సమాధి అయిపోయాడు!
ఇక రోశయ్య మచ్చలేని కోమటి! లెఖ్ఖలన్నీ ఆయనకే తెలుసుమరి!
ఇక కొత్త మంత్రులని గురించి భవిష్యత్తులోనే తెలియాలి!
భూతం లో మన బొచ్చె చేపలు పట్టుకొనే బొచ్చె అనే ఇంటిపేరు వున్న (బ్రాహ్మణ వ్యాకరణం లో ‘బొత్స’ అయిపోయిన) సత్యనారాయణ—తనకి ‘ఇన్ని’ కోట్ల ఆస్తులు వున్నాయని తన నామినేషన్ తో సమర్పించిన అఫిడవిట్ లోనే పేర్కొన్నాడు—యెలా సంపాదించావని మన రాజ్యాంగం అడగదు!
కొత్తమంత్రులారా! ‘బొత్సాదృష్ట ప్రాప్తిరస్తు!’
సవరణ : కౌంటింగులో పొన్నాల వెనకబడి వున్నాడు--అని టీవీల్లో చూసి, 'ఆయన జలసమాధి అయ్యాడు ' అన్నాను! మరి యే ఆఖరు రవుండు లోనో నెగ్గాడేమో! నిజానికి ఆయనక్కూడా మంత్రి పదవి దక్కిందిట!
మరి 'జల ' శాఖే ఇస్తారో లేదో చూడాలి! అదే శాఖ ఇస్తే మాత్రం--లొ గుట్టు పెరుమాళ్ళూకెరుక!
అదీ సంగతి!
2 comments:
భలేగా చెప్పారు.. బొత్స, బొచ్చె చేపలు highlight
డియర్ హరే కృష్ణ!
బాగుందన్నందుకు ధన్యవాదాలు!
హై లైట్ కోసం వ్రాయలేదు--నేను వ్రాసినది అచ్చ నిజం!
Post a Comment