Tuesday, October 11, 2011

(యమర్జెంటు) కబుర్లు - 78.....అవే!

పిచ్చిదంబరం ఇదివరకోసారి "ఆ రెండుపార్టీలూ (కాంగీ; తెదేపా) తమ అభిప్రాయం చెప్పేవరకూ......." అన్నాడు. మొన్న మళ్లీ, "ఆ నాలుగుపార్టీలూ (ఎం ఐ ఎం నీ, వై యెస్ ఆర్ నీ కలిపాడు!).........." అన్నాడు. రేపు నేనో కొత్త పార్టీ పెడితే, "ఆ ఐదు పార్టీలూ......" అంటాడేమో! బాగానేవుంది.

ఆజాద్ యేదో నివేదిక ఇచ్చాడట! "మీనీ కోర్ కమిటీ" సంప్రదింపులు పూర్తి అయ్యాయట. "మెగా కోర్ కమిటీ" ఇంకా మాట్లాడుకోవాలట.

ఈలోపల, "సకలజనుల సమ్మె విరమింపచేసే బాధ్యత" కి కు రె కి అప్పజెప్పారట.

గవర్నరోడూ, ముక్కుమంత్రోడూ, చిరంజీవీ వగైరాలూ--రాష్ట్రపతి పాలనకి అవకాశమే లేదు--"శాంతీ, భద్రతా" భద్రంగానే వున్నాయి, (యెప్పుడో) యెన్నికకాబడిన, ప్రసిధ్ధమైన ప్రభుత్వం పనిచేస్తుంది--అని సెలవిచ్చేశారు!

ఇంకోప్రక్క, వుద్యోగులు--మేము సమ్మె చేసుకుంటాం, మాజీతాలు ఒకటో తారీక్కల్లా ఇచ్చేయాలి, పండుగ అడ్వాన్స్లు ఇవ్వాలి, మూడు నెలలజీతం ముందుగానే ఇచ్చెయ్యలి".....ఇలా మొదలెట్టారు.

ఆర్టీసీ వాళ్లేమో, కొన్ని వందల బస్సులు నడిపిస్తున్నాం అంటారు. వాళ్ల గుర్తింపు పొందిన సంఘం, అనేక "లాభకరమైన" హామీలని పొంది, సమ్మె విరమిస్తున్నాము అన్నారు. అదేదో "ఫోరాన్ని" రద్దు చేశాము అన్నారు.

మళ్లీ టీవీలనిండా, బస్సులు తిరగడంలేదు అని గోల! రైళ్ల సంగతి దేవుడికే యెరుక!

గద్దరోడు కార్మికులకి కొన్ని అడ్వాన్సులూగట్రా ఇప్పించాడు. మళ్లీ ప్రభుత్వం "థూచ్" అందట!

ఇంకో ప్రక్క, "తెలంగాణా + నెల్లూరు, అనంతపురం, చిత్తూరు - హైదరాబాదు" అనీ, "ఆంధ్ర + ఖమ్మం - శ్రీకాకుళం, విజయనగరం" అనీ, "రాయల - నెల్లూరు, అనంతపురం, చిత్తూరు + మహబూబ్ నగర్" అనీ, కోస్తాంధ్ర/సర్కార్లు - నెల్లూరు, చిత్తూరు, గుంటూరు" అనీ, ఇలా యెవడికితోచిన పిచ్చివాగుళ్లు వాళ్లు వాగేస్తున్నారు!

మరి పరిష్కారం యెలా?

'69; '73 లోల్లా పూర్తిస్థాయి సీ ఆర్ పీ ఎఫ్; మిలిటరీ దళాలు దిగాలి!

పిరికోళ్లు "పండుగుల సందర్భంగా విరామం; పరీక్షల సందర్భంగా విరామం; పంటచేతికొచ్చేదాకా విరామం......"ఇలా వుద్యమాన్ని, "అహింస ముసుగులో" యెగదొయ్యలేకపోతూంటే, అక్కడ కేంద్రం సంప్రదింపులమీద సంప్రదింపులకి పోతూంటే, "జనజీవనం" మాత్రమే అస్థవ్యస్థం అవుతోంది!

నాకైతే, యే ప్రభుత్వమూ లేకుండా, "అంధేరా ప్రదేశ్"లోనే, నివశిస్తే బాగుండును అనిపిస్తోంది! మన రాష్ట్ర బడ్జెట్ ఓ రెండేళ్లక్రితమే లక్ష కోట్లు దాటింది. ఇప్పుడు లక్షా ఇరవై వేల కోట్లో యెన్నో. మన రాష్ట్ర జనాభా ఓ ఫది కోట్లనుకుంటే, "తలకి" 12 వేలు వస్తుంది. {పావలా వడ్డీలూ, కిలోరూపాయి బియ్యాలూ (తెలుగుమాటేనండి....ఒరియాకాదు) అఖ్ఖర్లేదు}......ఒక్కొక్కరికీ పంచేస్తే, "ఓ రాష్ట్ర ప్రజలారా! మీకింకేవిధమైన పన్నులూ వుండవు. పైగా మీ ఖాతాలకి సంవత్సరానికి 12 వేలు బదిలీ చెయ్యబడుతుంది. ఇంకా కేంద్ర గ్రాంటులు వస్తే, మీకు బోనస్ కుడా గిట్టుబాటవుతుంది! (ప్రభుత్వం నడపడానికీ, ప్రాజెక్టులు వగైరాలకీ ప్రపంచ బ్యాంకు వుండనే వుంది!)" అని యే "కశెన్నగాడో" ప్రకటిస్తే, మనవోట్లన్నీ వాడికే వేశెయ్యమూ!?

భలే బహ్లే! మంచి పరిష్కారంకదూ????!!!!

వెధవలు వోటర్ల లిస్టులో నా పేరు చేర్చడంలేదుగానీ, చేరుస్తేనా, బృహన్నలలకి వోటెయ్యకుండా, ఇలాంటి హామీ ఇచ్చేవాళ్లనే యెన్నుకొనేలా చేసేవాణ్ని!

యేం చేస్త్రాం!

2 comments:

సాధారణ పౌరుడు said...

ఏదయినా తెలంగాణా వాళ్ళని వదిలించుకోవటం తక్షణ కర్తవ్యమ్. మాకు ఒళ్ళు కాలిన పర్వాలేదు, ఎదుటి వాడికి వేలు కాలితే చాలు అని అనుకుంటున్నారు. ఏదో కొంతమంది తే వాదులు ఇలా చేస్తున్నారు అనుకోవద్దు. తెలంగాణా లో ఒకటో తరగతి చదివిన వాడికి కూడా ఆంధ్రోల్లు దోచేశారు అని అలోచన, చదువు రాని వాళ్ళు చాల బాగు ఇంకా. లక్ష ఎకరాలు మాగాణి పోయినా ఈ సారి కోస్తా నడి బొడ్డున ఉండాలి రాజధాని.

కృష్ణశ్రీ said...

డియర్ సాధారణ పౌరుడు!

అంతొద్దు! అవన్నీ జరిగేవి కావు. చూస్తూ వుండండి.

ధన్యవాదాలు.