అవీ, ఇవీ, అన్నీ
ప్రణాళికా సంఘం వారేదో, పట్టణాల్లో "తలకి" 32 రూపాయలూ, పల్లెల్లో "తలకి" 26 రూపాయలూ--"రోజుకి" సంపాదించేవాళ్లందరూ "దారిద్ర్యరేఖకి" పైనున్నట్టే అని నిర్ధారించి, కోర్టువారికి చెపితే, భాజపావారు, మన్మోహన్ సింగ్ పేరనొకటీ, సోనియాగాంధీ పేరనొకటీ రూ.32/- చొప్పున రెండు డీడీలు తీసి పంపించి, "ఈడబ్బులతో మీరు ఒక రోజు బ్రతికి చూపించండి!" అని సవాలు విసిరారట! (పాపం వాళ్లా డీడీలు మార్చుకోడానికి కూడా భయపడి మానేశారట!)
యోగాగురు 'బారాందే' "నల్లధనానికి వ్యతిరేకంగా" వుద్యమించి, బొక్కబోర్లా పడ్డాడు. ఇంకా వుద్యమం కొనసాగుతోంది అని ప్రకటిస్తున్నాడు! దానికి బదులు, దేశంలోని భక్త ప్రజలనబడే వారందరికీ "భక్తిపేరుతో మీ వేలంవెర్రుల్ని తగ్గించుకోండిరాబాబూ!" అని ఒక్క పిలుపిస్తే, సంతోషించేవాళ్లలో మొదటివాడిని నేను.
ఇంకా, నల్లధనాన్ని చాలావరకూ వెలికితీసే మార్గం నాకోటి తోచింది. అదేమిటంటే......గణపతి నవరాత్రులతో మొదలెట్టి, భారీ విగ్రహాలూ, భారీ లడ్డూలూ లాంటివే కాకుండా, కొత్తగా "కరెన్సీ" నోట్లతో అలంకరించడం అనే వెర్రి బాగా ముదురుతోంది! దసరా సందర్భంగా, పెద్ద పెద్ద అమ్మవారి గుళ్లేకాదు, వేంకటేశ్వర మొదలైన ఆలయాలేకాదు, పుంతలో ముసలమ్మదగ్గరనించీ, పెంటమీది పేరమ్మ వరకూ కనీసం పదో పదిహేనో లక్షలతో అలంకరిస్తున్నారు!
ఈమధ్య కొన్నిచోట్ల యేకంగా కోట్లలోకి కూడా చేరింది! నిన్నెక్కడో ఒకచోట కోటీ పదకొండు లక్షల పదకొండు వేలతో, ఇంకో రెండుమూడు చోట్ల కోటికి పైగా, అలంకరించారట!
ఈ డబ్బు యే ఖాతాల్లోంచి వస్తోంది, యే బ్యాంకుల్లోంచి వస్తోంది, ఒకవేళ పాతనోట్లు ఇచ్చి, కొత్తనోట్లు గ మార్చుతున్నారంటే, యే బ్యాంకు అధికారులకి భక్తి యెక్కువై అలాంటి పనులు చేస్తున్నారో.....ఇలాంటి విషయాలు వెలికి తీస్తే సరి! చాలా కష్టం అంటారా! అఖ్ఖర్లేదు. ఇలాంటి వివరాలన్నీ స్థానిక పోలీసు ఐ డీ పార్టీ కానిస్టేబుళ్లు సేకరించి, పై అధికారులకి పంపిస్తూనే వుంటారు. వారినే ఇంకొన్ని వివరాలు సేకరించమంటే సరి! యెలా వుంది అవిడియా?
మొన్న ఓ రోజు, చిన్నతిరపతి లో ఓ పెద్దమనిషి, ఖద్దరు చొక్కా, ఖరీదైన కళ్లజోడూ వగైరాలతో "నేను హైదరాబాదులో పెద్ద వ్యాపారిని. ఇక్కడ ఓ కల్యాణమండపం కట్టించడానికి 30 లక్షలు విరాళం ఇవ్వాలని నిశ్చయించుకున్నాను. ప్రస్తుతానికి, అన్నదాన పథకానికి గానూ ఓ లక్ష కి చెక్కు ఇస్తున్నాను" అనగానే, ఆలయ అధికారులు యెందుకైనా మంచిదని దేవస్థానం ఛైర్మన్ కి ఫోను చేసి మరీ....రాచమర్యాదలతో శ్రీవారి అంతరాలయ దర్శనంతోపాటు, పెద్దమొత్తంలో ప్రసాదాలూ వగైరాలన్నీ చదివించి, సాగనంపారట. ఆయన మళ్లీ ఓ పదిరోజుల్లో కల్యాణమండం గురించి మాట్లాడ్డానికొస్తానని చెప్పి మరీ వెళ్లాడట.
తీరా బ్యాంకుకి వెళ్లి చూస్తే, చెక్కుజారీ చెయ్యబడిన ఖాతాలో రూ.16/- మాత్రమే వున్నాయి అనీ, అంతకు ముందుకూడా ఆ ఖాతాలో ఐదువేలకి పైబడి లావాదేవీలు జరగలేదనీ తేలి, మింగలేక, కక్కలేక అధికారులందరూ సతమతమయ్యారట!
అవునుకదూ.....యెవరినైనా.....మెడలో కుక్కల గొలుసుల్లాంటివివేసుకొని, దానికి వేళ్లాడవలసిన "ఐడీ" కార్డులని చొక్కాజేబులో దాచుకొనే వాళ్లనైనా, అవి చూపించమని అడగడానికి మనవాళ్లకి అదేంటో....సిగ్గో, భయమో!
ప గో జి, కాళ్ల మండలం, పల్లిపాలెం గ్రామంలో, మొన్న ఓ యేడేళ్ల బాలుడు "విషపుటీగల" బారిన పడి మృతిచెందాడట. దాంతో, రెవెన్యూ అధికారులు, కొందరు గ్రామ సహాయకులతో (ఇంగ్లీషు సినిమాలు చూడడంలో నిపుణులేమో!) "ఆపరేషన్ రెస్క్యూ" నిర్వహించారట.
ఆ వూరి రామాలయం గోపురంలో ఆ విషపుటీగల "తుట్టె" వుండడంతో, బ్రహ్మాండమైన ప్లాను వేసి, సిబ్బంది "ఫైర్ ప్రూఫ్" దుస్తులు ధరించి, ముందుగా గోపురానికి నాలుగుప్రక్కలా వున్న రంధ్రాలని బంకమట్టితో పూడ్చేశారట.
తరవాత, ఇంకో రంధ్రంద్వారా, "మొనోక్రోటోఫాస్" పిచికారీ చేశారట. తరవాత, సిధ్ధంగా వుంచుకొన్న "పెట్రోలు" ఆ రంధ్రంగుండాపోసి, నిప్పంటించారట!
ఇంకేముందీ! ఆపరేషన్ సక్సెస్, బట్ పేషంట్ డెడ్ అన్నట్టు, పెద్ద విస్ఫోటం సంభవించి, ఆ గోపుర శిఖరం విరిగిపడి, ఒకతనికి తీవ్రగాయాలవగానే క్రిందకు దూకేసి, మిగిలినవాళ్లకి కూడా గాయాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, అధికారులతోపాటు.... "హమ్మయ్య! విషపుటీగలని సమూలంగా నిర్మూలించాం!" అని సంతోషిస్తున్నారట.
ఇలాంటి "ఆపరేషన్" సరియైన భద్రతా చర్యలు లేకుండా, ప్లాను చేసినవాళ్లకీ, నిర్వహింపచేసినవాళ్లకీ మీరు యే యెవార్డు ఇప్పిస్తారు?
6 comments:
"ఈడబ్బులతో మీరు ఒక రోజు బ్రతికి చూపించండి!"
:-D
> ప్లాను చేసినవాళ్లకీ మీరు యే యెవార్డు ఇప్పిస్తారు?
జలయగ్నంలో డ్యాములు కట్టే ఇంజనీర్లు
>నిర్వహింపచేసినవాళ్లకీ మీరు యే యెవార్డు ఇప్పిస్తారు?
మంత్రులు, MLA/MP లు గా
ప్రమోషన్ ఇవ్వవొచ్చేమో ఆలోచించండి
డియర్ Indian Minverva!
అదంతా రాజకీయ డ్రామా! జనాలని క్యామెడీతో వెర్రివాళ్లని చెయ్యడం.
నిజానికి, సరాసరిని 5గురు సభ్యులున్న కుటుంబంలో "తలకి" 32 చొప్పున రోజుకి రూ.160/-; అంటే నెలకి ఆ కుటుంబం మొత్తం రూ.4,800/- ఖర్చుపెడితే, ఆ కుటుంబం ఆ "రేఖ"కి పైన వున్నట్టే అని ఆ సంఘం తాత్పర్యం అని మొత్తుకుంటున్నారు వాళ్లు. నిజమే కదా?
ధన్యవాదాలు.
పై అన్నోన్!
అలా ప్రమోషన్లు ఇప్పించి చూడండి.....ప్రతీవాడు ఒక్కో ఫీల్డులో నిపుణులమని చెప్పుకొని, వుదాహరణకి మీవూళ్లో యెలకలు వున్నయంటే, భూమిలో "పేలుళ్లు" నిర్వహించి, వూరితోపాటు వాళ్లూ సజీవ దహనమైపోరూ!
ధన్యవాదాలు.
http://archives.eenadu.net/10-06-2011/News/Nationalnewsinner.aspx?qry=natio4
ªÃ†¾ZX¾AÂË Âê½ÕÂ¹× ª½Ö.6 ÂîšÇx?: «ª½Õºý ’âDµ
ÊÖu-œµË-Mx: ªÃ†¾Z-X¾A “X¾A¦µÇ ¤ÄšË©ü Âê½Õ Â¢ ª½Ö.6 Âî{Õx „ç*a¢ÍŒ-{¢åXj ¦µÇ•¤Ä N«Õª½z-©Õ ’¹ÕXÏp¢*¢C. ªîVÂ¹× ª½Ö.32-Åî¯ä ‚„þÕ‚-Dt °N¢ÍŒ-’¹-©-œ¿E “X¾¦µ¼Õ-ÅŒy¢ ¦µÇN-®¾Õh-Êo ÅŒª½Õ-º¢©ð.. ªÃ†¾Z-X¾A Âê½Õ-Â¹× Æ¢ÅŒ œ¿¦Õs Ȫ½Õa Í䧌Õ-{¢ Ê«Ûy ÅçXÏp-²òh¢Ÿ¿E ¦µÇ•¤Ä èÇB§ŒÕ Âê½u-Ÿ¿-Jz «ª½Õ-ºý-’âDµ ‡Ÿäl„à Íä¬Ç-ª½Õ. ÆŸµ¿Õ-¯Ã-ÅŒÊ ˜ãj-ª½Õx, ŌʢŌ ÅÃÊÕ «â®¾Õ-¹×-¤ò§äÕ ƒ¢Ÿµ¿Ê šÇu¢Â¹×, ¦Ç¢¦Õ-©-Â¹× å®jÅŒ¢ Íç¹׈Íç-Ÿ¿-ª½E ¨ Âê½Õ “X¾A-¦µÇ-¤Ä-šË©ü Â¢ Íä®Ï¢ŸÄ? ©ä¹-¤òÅä ®¾ÖX¾-ªý-£ÔÇªî ¦Çušü-«Õ¯þ Â¢ ª½Ö¤ñ¢C¢*¢ŸÄ? ÆE ‚§ŒÕÊ šËy{d-ªý©ð æXªíˆ-¯Ão-ª½Õ.
డియర్ panipuri123!
సంతోషం.
నా టపా చదవండి.
http://krishnasreevisurlu.blogspot.com/2011/10/blog-post_07.html
ధన్యవాదాలు.
Post a Comment