Thursday, July 29, 2010

'మెమరీ' అనే ఙ్ఞాపక శక్తి


"గూ......'గుల్ల'యితే"

..........అవుతుందా? యేమో! ఈ ప్రపంచం లో యేదైనా జరగవచ్చు!

ఓ పన్నెండేళ్ళ క్రితం, ప్రైవేట్ ఇంటర్నెట్ కనెక్షన్ కోసం అక్షరాలా మూడువేల రూపాయలు చెల్లించి, నెలకి ఐదో, యెనిమిదో వందలు వాడికి చదివించుకుంటూ, 256 కే బీ పీ ఎస్ మోడెం తో, (వర్షాలు వచ్చి చెన్నై ములిగి పోయింది కదండీ--ఇంకో వారం దాకా నెట్ కనెక్ట్ అవక పోవచ్చు--మా ఇంజనీర్లు పాపం ఆ వానలోనే ప్రయత్నిస్తున్నారు--లాంటి క్లారిఫికేషన్లతో) "కనెక్ట్" అన్న తరవాత ఓ పావు గంటకి--అయితే--అయ్యే కనెక్షన్లతో, నెట్ బ్రౌజింగ్--ఓ తప్పనిసరి తద్దినం!

అప్పుడే, "నెట్ స్కేప్" బ్రౌజర్ వాడు, 0.5 కే బీ నో, 5.0 కేబీనో "ఫ్రీ డిస్క్ మెమరీ" అని అనౌన్స్ చేస్తే, ఓ రాత్రి తెల్లవార్లూ, "దీన్నెలాగైనా సాధించాలి--అంత మెమరీ అంటే మాటలా!?" అనుకొంటూ, చివరికి సాధించిన రోజు నాకు బాగా గుర్తు.

మరి ఇప్పుడు?

ఒక్క గూగుల్ వాడే, 7,481.558803 మెగాబైట్స్ (అండ్ కౌంటింగ్) ఫ్రీ అంటూ సెకెనుకి 4 మెగాబైట్ల చొప్పున పెంచుకుంటూ పోతున్నాడు (మెగా బైట్లు కాదేమో--బిట్లో, బైట్లో అయి వుంటాయి.)!

ఇప్పుడు, మనం మెయిల్స్ గానీ, ఇంకేమైనా సమాచారం గానీ, "డిలీట్" చెయ్యడమే మానేశాం. కాకుండా, కొన్నెవేల బ్లాగులూ, వాటి మీద లక్షలకొలదీ కామెంట్లూ!

పోనీ బ్లాగుల్లో విషయం చూస్తే, ఆశమ్మ, బూశమ్మ పోచుకోలు కబుర్లూ, వంటలూ, దేవుళ్ళూ, చెట్లూ, పుట్టలూ, పువ్వులూ, కాయలూ--ఇంకా ఒకళ్ళమీద ఒకళ్ళు పడి యేడవడం! ఇంకా కాలక్షేపం లేకపోతే, వుండనే వున్నాయి, వేదాలూ, పురాణాలూ, ఉపనిషత్తులూ, ఇతిహాసాలూ, వైద్యాలూ--ఇంకా చాలా!

మొన్నామధ్య పసిఫిక్ లోనో, అట్లాంటిక్ లోనో--కాదు మధ్యధరా లో, అదేదో ఓడకి తగిలి కేబుల్స్ తెగిపోతే, ఓ వారం పాటు కొన్ని దేశాల్లో నెట్ సంథానం తెగిపోయింది. మిగిలిన దేశాల్లో వేగం తగ్గిపోయింది. పాపం ఆ ఇంజనీర్లు కష్టపడి, సముద్రం క్రింద 24 గంటలూ పని చేసి, మళ్లీ నార్మల్ కి తెచ్చారు.

మరి రేపేమవుతుందో చెప్పలేని పరిస్థితుల్లో, వున్న మెమరీ ని కాస్త "నిర్మాణాత్మకం"గా వుపయోగించుకోలేమా?

ఆలోచించండి!

2 comments:

పానీపూరి123 said...

> పాపం ఆ ఇంజనీర్లు కష్టపడి, సముద్రం క్రింద 24 గంటలూ పని చేసి
సముద్రం క్రింద ఇంజనీర్లు కష్టపడ్డారా లేక ఇంజనీర్లు సముద్రం పైనుండి ఇంజనీరింగ్ పరికరాలతో పనికానించేశారా?

A K Sastry said...

డియర్ పానీపూరి123!

నేను చదివిన వాటి ప్రకారం, ఇంజనీర్లు అవేవో 'సబ్ మెర్సిబుల్ ' ఓడల్లో (వెసల్స్) వెళ్ళి, బాగు చేశారనే!

అయినా అది అంత ముఖ్యమా?