Tuesday, February 2, 2010

అదుగో పులి

వైష్ణవి

గత మూడురోజులుగా టీవీ '24 గంటల న్యూస్ ' చానెళ్ళు బ్రతుకుతున్నది ఈ మాట పైనే!

అది యెంతవరకూ వెళ్ళిందంటే, కాంగీరేసు, టీడీపీ, తెరాస, చిన్నా పెద్దా నాయకులూ, చిరంజీవీ, దత్తాత్రేయలే కాకుండా, తెలంగాణా జే యే సీ లో సంతాప తీర్మానం చేసీ, మీడియాలో దాని కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామి రెడ్డి 'వైష్ణవి, ఆమె తండ్రి మరణాలు మమ్మల్ని కలచివేశాయి ' అనేదాకా!

ఇంకా కొంతమంది యెంతవరకూ వెళ్ళారంటే, రేపు తెలంగాణా ఇచ్చేస్తే, విజయవాడ ఆంధ్ర ముఖ్యపట్టణమైతే, శాంతిభద్రతలు ఇలావుంటాయి అని చెప్పడానికి ఇదో హెచ్చరిక--అనేదాకా!

అసలు జరిగిందేమిటి?

నీచ, నికృష్ట, దీన మాన హీన స్థితిలో వుండే ఒకడు--కాపుసారా బట్టీలో వుద్యోగిగా చేరి, బాస్ గా యెదిగి, తెలుగు వారుణవాహిని పుణ్యమాని లక్షాధికారై, నిషేధం తీరాక సిండికేటై, ఇప్పుడు కోటీశ్వరుడై, ఇద్దరు పెళ్ళాల్నీ, లెక్కలేనన్ని ముండల్నీ నిర్వహిస్తూ, రెండో పెళ్ళం కోరిక మీద 'ఆ పిల్ల ' పుట్టిన రోజుల్ని ఘనం గా నిర్వహిస్తూ, 'వైష్ణవి నా ప్రాణం' అని ప్రకటించి, ఆస్థి అంతా ఆమె పేరే వ్రాసేశాడు అని వచ్చిన పుకారుని ఖండించకుండా ఆనందించిన ఒక మూర్ఖుడి మీద కక్ష తీర్చుకున్నారు--వాడి ప్రత్యర్థులు!

దీన్ని అదేదో రాష్ట్ర విపత్తు అన్నట్టు 'కలర్ ' ఇస్తున్న మన మీడియా చెంప పగలకొట్టేదెవరు?

ఇది ప్రపంచానికే ఆపద అన్నంత బిల్డప్ ఇస్తున్న ఈ రాజకీయుల నడ్డి విరిచేదెవరు?

'వైష్ణవి మా పిల్ల--ఆమె చిరునవ్వులు చిందిస్తూ తిరిగి వస్తుంది--లేకపోతే......' అంటూ 'హిస్టీరియానిక్స్ ' ఒలకబోసిన నా అక్కల్లారా, చెల్లెళ్ళారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా!....మైక్ మీ నోటి ముందు పెట్టగానే 'ఎమోషనల్ ' అయిపోయి, పిచ్చి మాటలు మాట్లాడకండి! 'వెధవల్లారా! నేను మాట్లాడనురా!' అనండి!

అప్ప్పుడైనా ఈ మీడియాకీ, రాజకీయులకీ బుధ్ధి వస్తుందేమో చూద్దాం!

P.S.:--వైష్ణవి శవం దొరకలేదు--బూడిదనే శవం అనుకోమంటున్నారు ABN టీవీ వారు! దానికే అంత్యక్రియలు నిర్వహించారు అంటున్నారు మిగతా ఈ మీడియా వారు!



10 comments:

శరత్ కాలమ్ said...

అతడెవరయినా కావచ్చు, ఎలాంటివాడయినా కావచ్చు - కానీ ఒక తండ్రి - ఒక చిన్నారికి తండ్రి. చిట్టి తల్లి చనిపోయిన వార్త అందరితో పాటు ఇంతదూరంలో వున్న నన్నూ కలతచెందించింది. తండ్రీ ఆ బాధ తట్టుకోలేక మరణించాడు.

ఇలాంటి స్థితిలో ఇలా వ్రాయడమేనా మీ సంస్కారం? ఆ తండ్రిని విమర్శించేముందు మీ హేయమయిన పద్ధతిని సవరించుకోండి.

కిరణ్ said...

వాళ్ళందరి కంటే నీ రాత చూస్తుంటేనే మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. అతడి తప్పులున్నాయి కావచ్చు.. నీ మూర్ఖత్వం తో తండ్రి తప్పులను ఎంచటం చేశావు కానీ... పాప పై దాడి ని అనటం మరిచి పోయావు... నీ ధోరణి చూస్తుంటే నా ఇష్టం ఏదైనా రాస్తా అనేలా ఉంది కాని...మీడియా ని విమర్శిస్తున్నట్ట్లు లేదు.

ainaa పాప ఏం చేసింది మధ్యలో.. నీలాంటి కఠిన పాషాణాన్ని ఎలా మార్చగలం...సనగడం తప్ప...

తెలుగు said...

మీ అవేదన చాలా బాగా వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు ఇండియాలో ప్రతి మూలా జరుగుతూనే ఉన్నాయి. అదే పాశవిక చర్య ఒక పేద రైతు లేక ఒక రిక్షాతోలే వాడి కుటుంబంలోనో జరిగితే ఈ మీడియా ఇదే అత్యుత్సాహం చూపిస్తుందా? పరిపాలనా యంత్రాంగం ఇలా స్పందిస్తుందా? అలా అయితే ముఖ్యమంత్రికి మరో పనేమి ఉండదు - రాష్ట్రమంతటా జరిగే ఇలాంటి కౄర విక్రుత చర్య్లలకు స్పందిస్తూనే గడపాలి. బహుభార్యా లోలుడైన తండ్రి కడుపున పుట్టడమే ఈ చిన్నారి పాప పాలిట శాపమైయింది. ఆస్తిపై ఆశ కారణంగా పసివారిని హతమార్చడం కన్న మించిన పాశవిక అనాగరిక చర్య మరొకటి ఉండదు. ఇలాంటి రాక్షసులను ప్రవర్తన మారే వరకు నడి బజారులో రాళ్ళతో కొట్టించాలి. ఈ అనాగరిక సమాజాన్ని సృష్టించడంలో మనలాంటి వారి ప్రతి ఒక్కరి ప్రమేయం ఉంది. డబ్బు సంపాదించడమే పరమావధిగా మసలుకునే ఇలాంటి కుటుంబాలకు ఇంతటి ప్రాముఖ్యాన్నిచ్చే అవసరం లేదు.

A K Sastry said...

డియర్ శరత్ 'కాలమ్'

ఇన్నాళ్ళూ మీవి మోడరేట్ కామెంట్స్ గా జమ కట్టి,
పెద్దగా పట్టించుకోలేదు.

నా సంస్కారం గురించి మాట్లాడే ముందు, నేను
విమర్శించినది 'ఆ తండ్రిని' కాదని మీకు గుర్తు రాకపోవడం మీ హేయమైన పధ్ధతిని సవరించుకోవలసిన అవసరాన్ని సూచించడం లేదూ?

నేను విమర్శించింది, 'కలతచెందిన' అన్నలూ,
అక్కలూ.......చిట్టితల్లి........నవ్వుతూ
తిరిగి వస్తుంది.......ఇలాంటి 'ఎమోషనల్' వాటిని!

మొన్నమొన్ననే, బోరుబావిలో పడిపోయిన ఓ బాలుడి
కథనం ఇలాగే అన్ని 24 చానెళ్ళలోనూ
రెండుమూడురోజులు వాయించారు! గుర్తుందా?

మరి అక్కడ ఇంత సీన్లు యెందుకు జరగలేదు?

సింపుల్! గత ఆరేడు సంవత్సరాలుగా ఇలాంటి
సంఘటనలు ఓ పాతిక కి పైగా జరిగాయి!

ఒకటి రెండు కేసుల్లో మాత్రం (తక్కువలోతులోనే
వదలిపెట్టేసిన బావుల నించి) సజీవంగా ఆ
పిల్లలు బయట పడడం, మర్నాడు పేపర్లో
'మృత్యుంజయుడు' అంటూ వాళ్ళ ఫోటోలు రావడం
జరిగింది.

ఇది జనాలకి అలవాటయిపోయి, బోరుబావి
అనగానే, 'ఇంకేమి బతుకుతాడు' అని పెదవి
విరిచేస్తున్నారు!

మరి మన రేటింగులు యెలా పెరుగుతాయి?

ఈ కేసులో అయితే, ఈనాడు సంపాదకీయం లో
వ్రాసినట్లు, ఓ అపహరణ, రెండు హత్యలూ, మూడు
మరణాలూ....(కాకుండా పదిమంది రాజకీయులూ!)

చూడండి యెంత వెరైటీనో!

అందుకనే ఇంత సీన్లు!

ముక్కూ, మొహం కనపడకపోయినా, ఈ పైన
'తెలుగు' అనే ఆయనో, ఆవిడో వ్రాసిన కామెంట్
చదవండి--మీ వ్యాఖ్యకి జవాబుగా సరిపోతుంది!

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

మీరు అన్ని సంఘటనల్నీ ఇదే స్థాయిలో పట్టించుకోమంటున్నారు. అంతవఱకు నచ్చారు. కానీ చనిపోయిన ప్రభాకర్ ని మీరు నిందించిన విధానం సరైనదేనని మీ మనసులో మీకు మాత్రం అనిపిస్తున్నదా ? అలా రాయడానికి ఆధారంగా మీ వద్ద ఉన్న సమాచారాన్ని మాతో పంచుకుంటే బావుండేది కదా ? "పెళ్ళాలూ, ముం...లూ" అన్నారు. ఇది అతని కుటుంబస్త్రీలని అవమానించడం అవుతుందేమోననే అనుమానం మీకు రాలేదెందుచేత ? భారతీయ/ హిందూ సంప్రదాయనుసారం రెండోపెళ్ళి చేసుకోవడం తప్పు కాదు. అలా చేసుకోబడ్డ స్త్రీలు భార్యలే అవుతారు గానీ మీరు వర్ణించిన "ముం..." ఎలా అవుతారు ? ఈ మధ్య ప్రభుత్వమూ, న్యాయస్థానాలూ కూడా రెండో భార్యని భార్యగానే గుర్తిస్తున్నాయి.

మద్యపానం మీకూ, నాకూ కూడా నచ్చదు. ఆ వ్యాపారం అసలే నచ్చదు. కానీ మన వ్యక్తిగత ఇష్టానిష్టాల్ని అందఱికీ అనువర్తించలేం. సంప్రదాయానుసారం కానీ, చట్టప్రకారం కానీ మద్యాన్ని తాగడమూ తప్పు కాదు, అమ్మడం అంతకంటే తప్పు కాదు. మఱి మీరు అతన్నెందుకు నిందిస్తున్నారు ? అతను గౌండ్ల కులస్థుడు. మద్యతయారీ, అమ్మకమూ అతని కులవృత్తి. పూజలూ, పునస్కారాలూ నా కులవృత్తి అయినట్లే.

దేవుడు పెర్ఫెక్ట్ మనుషుల కోసం వెతకడు. ఉన్న గుణాలలో కనీసం కొన్నిటికైనా పెర్ఫెక్షన్స్ ఉంటే సంతోషిస్తాడు. అంతే. ఉన్నంతలో మంచి కోసం వెతుక్కోవడం - అదే దైవీలక్షణం. We are not entitled to judging others.

Anonymous said...

హాట్స్ ఆఫ్ టు యూ .. తాడేపల్లిగారు..

A K Sastry said...

డియర్ srikanth!

మీ పరిచయం కలగడం చాలా సంతోషం!

నాకు ఎన్ రామ్, అరుణ్ శౌరీ మొదలైనవాళ్ళతో ముఖాముఖి పరిచయం లేకపోయినా, కలం పరిచయం వుంది. నేను వాళ్ళ వస్తువుల (అర్టికిల్స్) పై పత్రికలకి వ్రాసిన లేఖలూ, తరవాత వాళ్ళ దగ్గరనించి నాకు వచ్చిన వ్యక్తిగత జవాబులనీ అపురూపం గా దాచుకున్నాను!

మీరింకా జర్నలిజం లో విద్యార్థేనని వ్రాశారు--ఓ పాతికేళ్ళ క్రితం, 'ఇండియా టుడే' పక్ష పత్రికలో, 'కిడ్ కిడ్నాపింగ్--చైల్డ్ నాపింగ్' గురించి వచ్చిన వస్తువులు మీ పరిశోధనకి యెమైనా వుపయోగిస్తాయేమో చూసుకోండి!

మరి తాడేపల్లివారి వ్యాఖ్య సబబేనంటారా?

ఈ చానెళ్ళు, ఈ వార్త విషయం లో, మీ 'యేడు సూత్రాలని' పాటించాయంటారా?

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ 'తాడేపల్లి.....' వారూ!

పొరపాటు!--ఇలాంటి సంఘటనల్ని అసలు పట్టించుకోవద్దంటాను!

మీరింకో పదిసార్లు ఆ టపాని చదివితే బాగుండునేమో--నేనేక్కడా 'ఆ తండ్రిని' విమర్శించలేదని--ఆ పాప మరణానికి మొదటి కారణం అతడే అనే నా ఆవేదన ఆ మాటలకి కారణమని--మీరు గ్రహించేవారు!

ఇంకా, నేనెక్కడా అతని వృత్తినిగానీ, వ్యాపారాన్నిగానీ ప్రస్తావించలేదు! అతను 'స్వయం కృషితో' అంచెలంచెలుగా యెలా యెదిగాడో వ్రాసాను!

ఇక భార్యలని భార్యలు అనే వ్రాశాను--మీకు ఇంకోలా యెలా తోచిందో మరి!

నేను వ్రాసిందీ అదే--'అతన్ని' జడ్జ్ చెయ్యమని కాదు! వెనకున్నవాళ్ళని అంచనా వెయ్యమని!

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ తెలుగు!

చాలా చక్కని వ్యాఖ్య వ్రాశారు! సంతోషం!

రాళ్ళతొ కొట్టించడం, ఎన్కౌంటర్ చేసెయ్యడం, బహిరంగ వురిశిక్షలూ--ఇవన్నీ ఆవేశ ప్రకటనలు! తప్పు!

మొద్దు శీనుకీ, మద్దెలచెరువు సూరికీ కూడా 'అభిమానులు ' వున్నారని మరిచిపోకండి!

బై ది వే, మీ వివరాలెందుకు ప్రకటించరు?

ధన్యవాదాలు!

Ekalavya said...

గురూజీ! హ్యాట్స్ ఆఫ్!

చాలా చక్కగా వ్రాశారు ఈ టపా! అర్థం చేసుకోడానికే రెండురోజులు పట్టింది!

ఇక కామెంట్లు చూసి, మీ సమాధానాలు చదివి, భలే థ్రిల్ అనిపించింది--ఎస్ రాం కి ఇచ్చిన సమాధానం నచ్చింది!

హనుమంతుడి ముందా కుప్పిగంతులు?

ఇక .Net devil ని యెందుకు వదిలేశారా అని ఆలోచిస్తే, నాకోసమే అనిపించింది.

ఒరే! .Net devil!

అతడి తప్పులున్నాయి అని ఆయన వ్రాశారా?
వాటిని యెంచారా? పాపపై దాడిని 'అనటం' అంటే యేమిటి?

పాప యేం చేసింది (మధ్యలో) అని ఆయన యేమైనా అన్నారా?

నువ్వు సనుక్కుంటే సనుక్కో--అంతేగానీ ఇలా బ్లాగుల్లో వద్దు--తెలుగు బాగా అర్థమయ్యే పరిస్థితుల్లోనే మాట్లాడు....పోరా!