Monday, October 12, 2009

అర్థం లేని సమర్థనలు.....

తానా అనేవాళ్ళకి తందానా అనేవాళ్ళూ!

మొన్ననే నా తెలుగురాడికల్ లో 'భావ వ్యక్తీకరణ కళ' పేరుతో ఇలాంటివాళ్ళకి యేమైనా బుద్ధి మారుతుందేమో అని చూశాను! కానీ పుట్టుకతో వచ్చినదనుకుంటా--ఇంకా మారలేదు!

సరే--ఇంక వాళ్ళని పోతిరెడ్డిపాడు పంపించినా, లాభం వుండదనిని నిశ్చయించుకొని, పాఠక దేవుళ్ళకే అర్జీ దాఖలు చేస్తున్నాను!

ఒక రకం వాళ్ళు--వీళ్ళు యేదీ పూర్తిగా చదవరు! చదివిందానిని అవగాహన చేసుకోడానికి ప్రయత్నించరు! యేవో మూడు ముక్కలు ముక్కున పట్టుకుని, తాము ఇంతకుముందు కొంతమంది వ్రాసిన వ్యాఖ్యలనించి కొన్ని 'ఫ్యాషనబుల్' యెంగిలి డైలాగులు వాడేసి, 'యెలా కొట్టాను దెబ్బ?' అన్నట్టు అందరివంకా చూస్తారు!

వీళ్ళ స్టాండర్డ్ యెంగిలి డైలాగుల్లో మొదటిది--'ఆధారాలు యేమిటి?'

ఇంతకు ముందు రెండో మూడో నెలలనించీ వ్రాసిన టపాలూ, వ్రాసిన ఆధారాలూ చదవాలనే ఇంగిత ఙ్ఞానం వుండదు వీళ్ళకి!

రెండోది, 'అక్కడ అలా వ్రాశారు........' అని!

వీళ్ళు ఒకటి మరిచిపోతుంటారు--ఒకళ్ళు వ్రాసే--తాను చెప్పదలుచుకున్న విషయాలూ, ఇతరులు అన్నవీ, విన్నవీ, చదివినవీ 'కోట్' చెయ్యడమూ--రెండూ ఒకటే అనుకుంటారు! (అందుకే 'ఉట్టంకింపులకి' చివర 'ట' చేరుస్తాను నేను!--దీన్నికూడా అపార్థం చేసుకున్నవాళ్ళున్నారు!)

ఇక మూడోది--రామాయణం అంతా విని, రాముడు కి సీత మేనత్త అవుతుందా? పిన్ని అవుతుందా? అని అడిగినవాళ్ళ గురించి విన్నాం! (నిజంగా వాల్మీకి రామాయణం ప్రకారం ఈ రెండు వరసలూ వున్నాయి అని నమ్మేవాళ్ళు వున్నారు--విఙ్ఞులెవరైనా వివరింపగలిగితే, సంతోషం!).

కానీ, రామాణయం చదవకుండానే, వినకుండానే, 'హనుమంతుడు రాముణ్ణి చేరాడు' అంటే--'అసలు ఈ రాముడెవరు?' అని కళ్ళెర్రజేస్తారు!

నాలుగోది--'యేళ్ళు వచ్చాయిగానీ బుధ్ధి రాలేదు'!

సందర్భ శుధ్ధి లేకుండా వీళ్ళు వాడే యెంగిలి వాటిలో ఇది మొదటిది!

తాతా మామ్మలూ, తల్లి తండ్రులూ పిల్లలని మందలించడానికి వాడే మాటలవి! చదవేసేవరకూ 'కాకరకాయ ' అన్నవాడు, బడినించి వచ్చాక 'కీకరకాయ ' అంటే--అలాంటివాళ్ళని ఇలా మందలిస్తారు!

మనిషి భౌతిక వయస్సుకీ, మానసిక వయస్సుకీ వుండే నిష్పత్తిని 'ఐ క్యూ' అని వ్యవహరిస్తారు! అది సమానంగా వుంటే--బాగుంది అనుకుంటారు, యెక్కువగా వుంటే--ఓహో అంటారు, తక్కువగా వుంతే--పాపం అంటారు! దాన్ని పెంచుకోమని చెప్పడమేకాదు, పెంచడానికి వాళ్ళుకూడా ప్రయత్నాలు మొదలెడతారు!

ఇలాంటి మాటలు విస్తృతంగా వాడేవాడిని నా విద్యార్థి అయితే, బెంచీ యెక్కించేవాడిని! నా కొడుకు ఆ మాట వాడితే, వాడి పెళ్ళాం చేత వాడికి బుధ్ధి చెప్పించేవాడిని! (ఇప్పుడు కార్పొరేట్ విద్యలో 'బెంచీ యెక్కడాలూ' అవీ లేవు! డైరెక్టుగా ఆత్మహత్యలే!)

ఇవీ 'తందానా' అనేవాళ్ళ కొన్నిసంగతులు!

తరవాత--తలా తోకా లేనివాటిగురించి! (మరోసారి)

నా విఙ్ఞప్తి :- పాఠకుల ముందుంచుతున్న నా 'కేసు ' పూర్తయ్యేవరకూ, మంగేష్ లూ, నారాలూ మాట్లాడకుండా వుండడం న్యాయ సూత్రాల రీత్యా అభిలషణీయం! తరవాత మీ యిష్టం!

7 comments:

Krishna K said...

ఒకళ్లను కించపరచాలని అనే ఉద్దేశ్యం లేకుండా ఉన్నంతవరకూ మీరు, మీరు చెప్పలనుకొన్నది మీ బ్లాగ్ లో హాయిగా చెబ్తునే ఉన్నండి. బ్లాగ్ లలో, మీరు చెప్పేది నచ్చని వాళ్లు, ఎదో కామెంట్ వ్రాస్తూ ఉంటారు, ఇవ్వాలని అనిపిస్తే సమాధానం ఇవ్వండి, వాళ్లు మీరు చెప్పేది సరిగా అర్ధం చేసుకోక అపోహలతో అడుగుతున్నారు అనుకొంటే మీ చెప్పాలనుకొంది మీరు మరో మారు వివరించండి, ఆ కామెంట్ లకు అంత సీన్ లేదు అనుకొంటే సుబ్బరంగా కామెంట్ ను తొలిగించేయండి, ఎందుకంటే మీ బ్లాగ్ కూ మీరే సుమన్ (ఈ టి వి కి లాగా ఒకప్పుడు) కాబట్టి.

చివరగా వీటిని అలోచిస్తూ మీరు చెప్పలనుకొన్నది చెప్పటం మానివేయవద్దు, అలా అని బ్లాగుల గురించి అలోచించాల్సిన దానికంటే ఎక్కువ అలోచించి మీ సమయం వ్రుధా చేసుకోవద్దు. ఇవ్వన్నీ మీకు తెలియవని కాదు, పాఠకదేముళ్ళు అన్నారు కదా, ఆ దేముళ్లలలో నేనూ ఒకడుగా, ఎందుకో వ్రాయాలనిపించిది.

Rajendra Devarapalli said...

నిరభ్యంతరంగా,సుబ్బరంగా చదవగలిగేది మీ బ్లాగు.చదివినవాళ్ళకు పైపెచ్చు కొన్ని విషయాలను ఇలా కూడా చెప్పవచ్చా అన్న విధానం ఒకతూందని కూడా అర్ధమవుతుంది.అనేవాళ్ళదేముందిలెండి మీరెటూ పట్టించుకోరు కాబట్టి మీరు కొనసాగించండి

Mangesh Devalaraju said...

కృష్ణశ్రీ గారూ!

నన్ను మనస్పూర్తిగా క్షమించండి. ఇంకెప్పుడూ మీలాంటి పెద్దలను బాధ పెట్టను.

-మంగేష్

A K Sastry said...

డియర్ Krishna! రాజేంద్ర కుమార్ దేవరపల్లి!

చాలా సంతోషం!

వీలైనంతవరకూ అపార్థాలు తొలగించి, అసలు విషయాన్ని అర్థం చేసుకునేలా చూడాలనే--నా తపన!

వదిలెయ్యాలంటేనూ, తొలగించాలంటేనూ అసలు అలోచనే అఖ్ఖర్లేదు కదా!

ధన్యవాదాలు!

A K Sastry said...

డియర్ Mangesh!

మనలో మనకి క్షమాపణలు వద్దు! కొంచెమైనా అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి--చాలు!

ధన్యవాదాలు!

Anonymous said...

I enjoy your scholarship very much. Sorry, I can read Telugu well enough, but can't write on the computer, yet. Please disregard shallow intellectuals and continue your excellent commentaries. They are a great contribution to contemporary thought. Just one little request though, could you combine your diverse blogs into a single website. It will ease navigation greatly. Thanks again, and keep up the good work!

A K Sastry said...

Dear sharmajee!

Sorry for replying late.

Thank you for your compliments. I am proud to have readers like you.

I have earlier also received suggestions for combining the blogs in a single website. But did not try seriously.

Now, I will try.

Thank you once again!

By the way, I have visited your blog and it is simply superb!