‘……నీకొండకి నీవే…..’ యాత్రలో మేము చర్చించుకున్న మరో విషయం…’అన్యమతస్థుల’ ఆలయ ప్రవేశం గురించి!
హిందువులు కానివారెవరైనా శ్రీపతి స్వామిని దర్శించుకోవాలంటే, ఒక రిజిష్టర్ లో ఒక ధృవీకరణ క్రింద సంతకం చెయ్యాలి! అందులో ‘నేను అన్య మతస్థుణ్ణైనా, పూర్తిగా స్వామి మీద విశ్వాసం తో ఆయన దర్శనానికి వచ్చాను’ అని వుంటుంది!
మరి మన సీ యెం వచ్చినప్పుడల్లా సంతకం చేస్తున్నాడా? అంటే, మా గైడ్, ‘ఖచ్చితం గా చేస్తున్నాడండీ, జగన్ చేస్తున్నాడు, రాహుల్ చేశాడు’ అని నొక్కి వక్కాణించాడు! అయితే మంచిదే అన్నాము!
నేను, మరి బ్రహ్మోత్సవాలకీ, కళ్యాణాలకీ నెత్తిమీద పట్టు వస్త్రాలు పెట్టుకొని స్వామికి ఆయనే యెందుకు సమర్పించాలి? అంటే, ‘అది అఫీషియల్ కెపాసిటీ’ అన్నారు!
మరి ఈ ‘అఫీషియల్ కెపాసిటీ’ని యెందుకు మార్చరు?
ఆయనేమో ‘నేను 2004 లో జెరూసలెం యాత్ర చేసి వచ్చాను, రాష్ట్రం లో మంచి వర్షాలు పడ్డాయి……అయిదేళ్ళూ పడ్డాయి, మళ్ళీ ఇప్పుడు జెరూసలెం యాత్ర చేసి వచ్చాను…..ఇక చూడండి, అయిదేళ్ళూ వర్షాలే వర్షాలు….’ అంటాడు!
ఇప్పటిదాకా తొలకరి కూడా లేకపోయేసరికి, ‘అన్ని గుళ్ళలోనూ వరుణజపాలూ, విశేష పూజలూ, యఙ్ఞ యాగాలూ చెయ్యండి’ అంటాడు మళ్ళీ! అదీ ప్రభుత్వం తరుఫున!
అదేదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్టు ‘నువ్వు నాకర్థం కావురా బాబూ’ అని మొత్తుకోవడం తప్ప మనమేమి చెయ్యగలం!