అనగనగా ఓ మంత్రిగారు......
నిన్న ఇందిరమ్మ యిళ్ళగురించో, ఆరోగ్యశ్రీ గురించో ఆడబడుచులకి ‘యెవరైనా మిమ్మల్ని లంచం అడిగితే నాకు ఫలానా నెంబరుకి ఫోన్ చెయ్యండి—వాళ్ళ అంతు చూస్తాను!’ ఆని ఆవేశంలో వాగ్దానం చేశేసి,......
ఆనక నాలిక్కరుచుకొంటూ, ‘ఓ మోస్తరు లంచాలు అడిగితే ఇచ్చెయ్యండి! మీరు ఫోన్ చేస్తే మీ దగ్గరకి రావడానికి నాకు కారు డీజలుకి ముఫ్ఫై రూపాయలు అవుతాయి కదా?’ అని ఉవాచించారట!
‘ఓ మోస్తరు’ అంటే ఆయన దృష్తి లో యెంత?
ఆయన కొన్నివేల కోట్లకి అధిపతి కాబట్టి, పదులూ, వందలూ, వేలూ, లక్షల్లో అడిగినా, అవి ‘ఓ మోస్తరే’ కదా? కోట్ల లో అడిగితే మాత్రం ఆయనకి ఫోన్ చెయ్యాలేమో!
అయినా, ‘నీకు ఫోన్ చేస్తే, యే ‘యే సీ బీ’ వాళ్ళకో, ‘సీ బీ ఐ’ వెధవలకో ఫోన్ చేసి, లంచం అడిగినవాణ్ణి పట్టించాలి గానీ, మా దగ్గరకి ‘ముఫ్ఫై రూపాయల డీజల్’ ఖర్చు పెట్టుకొని యెందుకు రావాల్రా వెధవా?’ అని అడిగిన నా సోదరి యెవరూ అక్కడ లేదు! అదీ వింత!
“నిర్దోషులు ఓ ఇరవై మంది ఇబ్బంది పడినా ఫరవాలేదు, ఓ నలుగురికి శిక్షలు పడినా ఫరవాలేదుగానీ, ‘ఒక్క నేరస్తుడుకూడా తప్పించుకోడానికి వీల్లేదు’” అని మన శిక్షాస్మృతిని సవరించవలసిన సమయం ఆసన్నం కాలేదంటారా?
మనిషికి దేవుడు పెట్టిన ‘రోగ భయం, జరా భయం, మృత్యు భయం’ కాకుండా, ‘నేరానికి శిక్షాభయం’ కూడా వుంటే, నేరాలు ఆగిపోవూ?
ఆలోచించండి!
సాహిత్యం -- గ్రంథాలూ
-
*బుచ్చి బాబు కథలు**-*-
*ఆ ఉ ఓ లు*
“............ఆ ఊళ్లో రోడ్డు ప్రక్కన చాప మీద పరచిన పాత పుస్తకాల
వ్యాపారసంస్థను చూసి ఆశ్చర్య పడ్డాను.........
పుస్తకాలు ఈత...
4 years ago
2 comments:
చాలా బాగా చెప్పారు
డియర్ awarnece of indians!
చాలా సంతోషం!
Post a Comment