Wednesday, November 12, 2008

“మీసాలు”

తిరుపతి వేంకట కవులని యెవరో అడిగారట—‘అసలు మీకీ మీసాలు యెందుకండీ’ అని.

చెళ్ళపిళ్ళవారు వెంటనే ఓ పద్యం చెప్పారట—‘ఉభయ భాషలకు మేమె కవీశ్వరులమటంచు పెంచినారమీ మీసలు రెండు…………..(ఈ విద్యలో మమ్మల్ని ఓడించినవారి)……….కాల్మొక్కమే’ అంటూ!

అదీ పౌరుషమంటే! అదీ మీసమంటే!

‘రొయ్యకు లేవా తెగ బారెడు………..’ అన్నారు!

అయినా, ఏ కనుమూరి బాపిరజో తప్ప ఈ మధ్య తెలుగు వాళ్ళు మీసాలు పెంచదమే మానేశారు!

‘మీసాలకు సంపెంగ నూనె రాసుకోవడం’, ‘మీసాలమీద నిమ్మకాయల్ని నిలబెట్టడం’ ‘మీసాల్తొ టన్ను రాళ్ళెత్తడం’ ‘మీసాలకి తాళ్ళు కట్టుకొని విమానాలు లాగడం’—ఇలాంటివి మనం చూస్తూనే వున్నాం!

మరి మీసాల విలువ యేమిటి? యెంత?

2 comments:

శ్రీనివాస్ పప్పు said...

అలాగ పెంచితే మీలాంటోళ్ళు...మామగారి మీసంపై సీసం(సీస పద్యం)అంటారని భయపడి పెంచుకోడం మానేసారేమో...

A K Sastry said...

డియర్ శ్రీనివాస్!

మధ్యలో 'మామగారు 'ఎందుకు వచ్చారు?

మీసాలపై సీసాలు గుర్తున్నందుకు థాంక్స్!