అవీ, ఇవీ, అన్నీ
మన బుర్రోవాదుల బుర్రల్లోని ఆలోచనలు యెన్ని వెర్రితలలు వేస్తున్నాయో చూడండి!
సామాన్యులకి యేడాదికి 4 గ్యాస్ సిలిండర్లు సరిపోతాయట. అందుకని, ఐదో సిలిండరు కావాలనేవాళ్లకి ఒక్కోటీ రూ.800/- కి తక్కువకాకుండా అమ్మాలట. అప్పుడు సబ్సిడీ భారం తీరిపోతుందటా!
అసలు ఈ గొడవంతా యెందుకు? ఆ గ్యాసు కంపెనీలని ప్రతీవూళ్లోనూ చిల్లరకొట్లు తెరిచి, వాళ్లకిష్టం అయిన రేటుకి సిలిండర్లు అమ్ముకోమంటే వొదిలిపోతుందికదా? దీపం పథకాలూ వగైరా చెట్టెక్కి, అందరూ యెండుపుల్లలతో వంటలు ప్రారంభిస్తారు? హబ్బే! గ్యాసు యేజన్సీలు రద్దుచేస్తే, మా పలుకుబడీ, సంపాదనా యేమికాను? అంటారు రాజకీయులు!
మళ్లీ దానికీ "ఆథార్" సంఖ్యే ప్రమాణమట!
ఇంక ఈ ఆథార్ యెలా పాము మెలికలు తిరుగుతూ నడుస్తోందో చూశారా? ఇప్పటి వరకూ మనకి యెన్ని రకాల "కార్డులు" వున్నాయో గమనించారా?
ఆథార్ సంఖ్య కోసం బెంగుళూరు లాంటి మహానగరంలో, ఓ 12 పోస్టాఫీసులని యెంపికచేసి, అన్ని లక్షలమందినీ అక్కడే అప్లికేషన్లు తీసుకోమన్నారట. తీరా రెండురోజుల్లో ఇచ్చిన అప్లికేషన్లకి సంఖ్యలు కేటాయించాలంటే రోజుకి గరిష్ఠంగా 50 వేసుకున్నా, (ఆ 50 పూర్తయ్యేవరకూ కొన్ని వందలమంది పడిగాపులు పడాలట!) 2012 జనవరి నెలాఖరువరకూ జారీ పూర్తి కాదట! అందుకని అప్ప్లికేషన్లని ఇవ్వడం మానేశారట!
ఇంక అప్లికేషన్ తోపాటు ఒక "గుర్తింపు" పత్రమూ, ఒక "నివాస ధృవీకరణ" పత్రమూ, ఇంకా ఫోటోలూ, వేళ్లూ, కళ్లూ వగైరాలు తీసుకెళ్లాలట! (పిచ్చి కుదిరితేగానీ పెళ్లి కాదు, పెళ్లైతేగానీ పిచ్చి కుదరదు అన్నట్టు, ఆ జాబితాలలోని కార్డులు పొందడానికి "ఆథార్" కావాలట. ఆథార్ కావాలంటే, ఆ పత్రాలు వుండాలట!). ఆ జాబితాలు పరికించండి......
గుర్తింపు పత్రాల జాబితా--పాస్ పోర్ట్; పాన్ కార్డ్; రేషన్ కార్డ్; వోటరు కార్డ్; డ్రైవింగ్ లైసెన్స్; గవర్నమెంటువారు జారీచేసిన ఫోటో గుర్తింపు కార్డ్; వుపాధి హామీ జాబ్ కార్డ్; గుర్తింపు పొందిన విద్యాసంస్థ జారీ చేసిన కార్డ్; ఆయుధ లైసెన్స్; ఫోటోతో వున్న బ్యాంక్ ఏటీఎం కార్డ్; ఫోటో వున్న క్రెడిట్ కార్డ్; పెన్షనర్ ఫోటో కార్డ్; స్వాతంత్ర్య సమరయోధుల గుర్తింపు కార్డ్; ఫోటో వున్న రైతు పాస్ బుక్; హౌసింగ్ వాళ్లిచ్చిన ఫోటో కార్డ్; పోస్టల్ వాళ్లిచ్చిన ఫోటో, చిరునామా వున్న కార్డ్--ఇవేమీ లేకపోతే, ఓ గ్రూప్ 'ఏ' గెజిటెడ్ అధికారి, తన లెటర్ హెడ్ మీద, ఫోటో తో ఇచ్చిన గుర్తింపు పత్రం! (యెన్నయ్యాయో నేను లెఖ్ఖపెట్టలేదు!).
ఇంక, నివాస ధృవీకరణ పత్రాల జాబితా........(మళ్లీ) పాస్ పోర్ట్; రేషన్ కార్డ్; వోటరు కార్డ్; డ్రైవింగ్ లైసెన్స్; పెన్షన్ గుర్తింపుకార్డ్; స్వాతంత్ర్య సమర యోధుల గుర్తింపు కార్డ్; ఫోటోతో వున్న రైతు పాస్ బుక్; బ్యాంక్ స్టేట్మెంట్/పాస్ బుక్; పోస్టాఫీసు యెకవుంట్ స్టేట్మెంట్/పాస్ బుక్; ప్రభుత్వం వారు జారీచేసిన గుర్తింపు కార్డు; విద్యుత్ వినియోగ బిల్లు; నీటి వాడకం బిల్లు; టెలిఫోను ల్యాండ్ లైన్ బిల్లు; ఆస్థి పను రసీదు (ఇవన్నీ కూడా మూడు నెలలకుమించి పాతవి కాకూడదు??!!); ఇన్స్యూరెన్స్ పోలసీ, ఫోటో తో మరియూ అధికార్ల సంతకాలతో బ్యాంకు వారు తమ లెటర్ హెడ్ మీద జారీచేసిన వుత్తరం; యేదైనా రిజిస్టర్డ్ కంపెనీ తన లెటర్హెడ్ మీద ఫోటోతో జారీచేసిన వుత్తరం; గుర్తింపు పొందిన విద్యా సంస్థ ఇచ్చిన వుత్తరం; వుపాధి హామీ జాబ్ కార్డ్; ఆయుధ లైసెన్స్; హౌసింగ్ బోర్డ్ గుర్తింపు కార్డు; ఒక ఎంపీ గానీ, ఎమ్మెల్యేగానీ, గ్రూప్ 'ఏ' గెజిటెడ్ అధికారిగానీ చిరునామా ధృవీకరిస్తూ ఇచ్చినవుత్తరం; పంచాయతీ సర్వోన్నతాధికారి ఇచ్చిన పత్రం; ఇన్‌కం టేక్స్ యెసెస్మెంట్ ఆర్డరు; వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్; రిజిస్టర్ అయిన క్రయ/లీజు/అద్దె యెగ్రిమెంట్; పోస్టలు వారిచ్చిన నివాస ధృవీకరణ పత్రం; రాష్ట్ర ప్రభుత్వం వారిచ్చిన కుల/డోమిసైల్ సర్టిఫికెట్ (ఫోటో తో వున్నది). (ఇవికూడా యెన్నో నేను లెఖ్ఖపెట్టలేదు!).
ఇవికాకుండా--పుట్టిన తేదీ ధృవీకరణకోసం--జనన ధృవీకరణ పత్రం; ఎస్ ఎస్ ఎల్ సీ సర్టిఫికెట్; పాస్ పోర్ట్; గ్రూప్ 'ఏ' గెజిటేడ్ అధికారి తన లెటర్ హెడ్ మీద ఇచ్చిన జనన తేదీ ధృవీకరణ పత్రం.
(హమ్మయ్య! జాబితాలు పూర్తయ్యాయి. కానీ, నాకు రెండు....కాదు....మూడు సందేహాలు--ఈజాబితాల్లో వున్న కార్డుల్లో యే వొక్కదానిలో అయినా మన చిరునామా వుంటుందా? ఒకవేళ వున్నా అది ఖచ్చితంగా సరిగ్గా వుంటుందా? మనం ఆ చిరునామాలో యెన్నాళ్లు వుంటామో గ్యారంటీ వుదా?--ఇదీ మొదటి సందేహం. రెండోది, యెవరైనా వీటిలో యేదో ఒక ధృవపత్రం వొకటి రెండు రోజుల్లో--అదీ పైసా ఖర్చు చెయ్యకుండా (ఫోటోలకి తప్ప) సాధించగలరా? ఇంక మూడోది--అవన్నీ వున్నవాడికి, లేదా యేదో ఒక గుర్తింపు పత్రం, నివాస ధృవీకరణ పత్రం వున్నవాడికి "ఆథార్" అవసరం యేమిటీ?
ఈ సందేహాలకి తెలిసీ యెవరైనా సమాధానం చెప్పలేదో, వాళ్ల తల వెయ్యి వ్రక్కలు కాకమానదు--అనడానికి నేను భేతాళుణ్ని కాదు. అర్థరాజ్యం, కూతుర్నిచ్చి పెళ్లీ అనడానికి మా పెసిగాణ్నీ కాదు! ఒక్కటి మాత్రం చెప్పగలను--నా చేతిలో వుంటే ఇలాంటి ప్రణాళికలూ, నిర్ణయాలూ చేసే బుర్రోవాదులని, బిషప్ హేటో లెవెల్లో.......%$*^(@!.!

అదీ సంగతి!
ఇంకా చాలా వున్నాయి సణగడానికి కానీ వోపీలేదు......మరోసారి!