Monday, March 28, 2011

కబుర్లు - 34

అవీ, ఇవీ, అన్నీ

టేంక్ బండ్ మీద తెలుగు వెలుగుల విగ్రహాలని బ్రద్దలుకొట్టి, అగ్నికి ఆహుతి చేశారు. బాగానే వుంది. సీమాంధ్ర వాళ్లెవరూ యేడవలేదు, ప్రతీకారం తీర్చుకొంటామంటూ ప్రతిఙ్ఞలు చెయ్యలేదు. 

చచ్చిన గుర్రాన్ని కంచీతో కొట్టాలని ప్రయత్నిస్తున్నారు--కొంతమంది మేతావులు.

నిన్న 27-03-2011 న, "సాంస్కృతిక విలేకరుల ఐక్యవేదిక" ఆధ్వర్యంలో జరిగిన సభలో, "మాస్టర్జీ" అనే ఆయన--తెలంగాణా వైతాళికుల విగ్రహాలని సీమాంధ్రలో ప్రతిష్టించాలి--అన్నాడట. యే విజయవాడలోనో, గుంటూరులోనో యెక్కడో ఓ హుస్సేన్ సాగర్ తవ్వి, టేంక్ బండ్ కట్టి, అక్కడ వాళ్ల విగ్రహాలు పెట్టాలనేమో?

వుప్పులూరి మల్లికార్జున శర్మ--టేంక్ బండ్ పై దాశరథి, కొమరం భీం, కాళోజీల విగ్రహాలు పెట్టాలన్నారట! (వాళ్ల విగ్రహాలు పెడతామంటే, నన్నయ్యా వాళ్లూ వద్దన్నారనా వాళ్లని పగలకొట్టారు?)

ఇంకా కొంతమంది, సమతూకం పాటించాలనీ, "అన్ని ప్రాంతాలకీ న్యాయం చెయ్యాలనీ"--ఇలా వాక్రుచ్చారట!

బాగుంది కదూ?

మరి, చిన్నపిల్లల పాటలని తెలుగు నించి తెలంగాణా భాషకి తర్జుమా చేస్తూ, "చుక్ చుక్ రైలు వస్తోంది" లాంటి పాటలని, "చుక్ చుక్ రైలు వస్తాంది భై" అని అనువదిస్తూ "అదే తెలుగు" అనుకుంటున్న మూర్ఖులకి యెవరు ఙ్ఞానోదయం చేస్తారు? (ఓ సినిమాలో కోట "బీముడేమో గద తిప్తా వుంటాడు--" అనడం గుర్తు రావడం లేదూ!)

కోనాపురి అయిలయ్య అనే మాజీ నక్సలైట్ "సాంబశివుడి"ని 40 కత్తిపోట్లు పొడిచి హత్యచేశారట! ఆయన 2009 లో ప్రభుత్వానికి లొంగిపోయి, తరవాత తెరాస లో చేరాడట. దీనివెనక యేమి రాజకీయాలు వున్నాయో?

ఇదివరకోసారి అనుకున్నాం--కర్ణాటక లోని కార్వారలో గల కాప్రి ఆలయం లో దేవుడికి "సిగరెట్లతో హారతి, మద్యం తో అభిషేకం" నిర్వహిస్తారని! సిగరెట్లకి ప్రత్యామ్నాయంగా బీడీలు కూడా వాడతారని. ఆ పండుగ నిన్న (27-03-2011) నిర్వహించారట. ఆచారం గురించి పూజారి ఆనంద్ నాయక్ వివరించారట!

"మారియో వర్గస్ లోసా", "ఖుంకళా బన్‌జడే"--ఇవేమిటో తెలుసా?

మొదటిది--మొన్నీమధ్య నోబెల్ ప్రైజు గెలుచుకున్న స్పానిష్ రచయిత పేరు!

రెండోది--"ఆరుషీ తల్వార్" తో హత్య కాబడిన నేపాలు కు చెందిన హేమరాజ్ భార్య పేరు!

గమ్మత్తుగా వున్నాయా?

2 comments:

Surya said...

Hi Sir ji, Nenu telugu lo comments raadhamu ani anukunnanu..but telugu scripting naku raaka Tenglish lo raasthunanu...

As a daily E paper reader, I know all the news you(Meeru) posted.

But your version is a very good passtime for me in Out of office hours..

Thank you for such a nice Blog and Keep posting :)

కృష్ణశ్రీ said...

డియర్ Surya!

వార్తల్ని వీలైనంత యథాతథంగా వ్రాస్తూ, నాకు తోచిన రీతిలో విశ్లేషిస్తున్నానంతే. మీకు నచ్చినందుకు చాలా సంతోషం.

తెలుగు స్క్రిప్ట్ కష్టమేమీ కాదు--lekhini.org లోకి వెళితే, అక్కడ పై బాక్స్ లో మీరు ఇక్కడ వ్రాసినట్టే వ్రాస్తే, క్రింద బాక్స్ లో తెలుగు స్క్రిప్ట్ వచ్చేస్తుంది. కాపీ చేసుకొని ప్రచురించడమే. అవసరం అయితే, ఎడిట్ సౌలభ్యం యెలాగూ వుంది.

ఈసారి ప్రయత్నించండి.

ధన్యవాదాలు.