……..కట్రాక్షసుడు!”
ఈ రాక్షసుడికి నా హేతువాదం (బ్లాగ్) నచ్చలేదో యేమిటో—వారం రోజులనించీ ప్రయత్నిస్తున్నాను—నాలుగు ముక్కలు వ్రాయగానే, ‘టుపుక్’ అని పీకేస్తున్నాడు పవర్!
అదీ సరిగ్గా నేను ప్రతిరోజూ వ్రాసే టైములోనే! తిరిగి పవర్ వచ్చేసరికి—నా రాత్రి ఫలాహారం అయిపోయి, నిద్రకుపక్రమించే టైము! ఇంకేమి వ్రాయను?
అయినా, జలాశయాలు నిండాయి, గోదావరి లోనూ, కృష్ణలోనూ, వంశధారలోనూ వేలాది క్యూసెక్కుల నీరు సముద్రం లోకి వదిలి పెట్టబడుతోంది—అయినా, విద్యుదుత్పత్తి మాత్రం ‘నిల్లు ‘!
నీళ్ళున్నప్పుడు మన టీపీయెస్ లు పడుక్కుంటాయి, లేదా బోల్తాపడతాయి—అవి బాగున్నప్పుడు నీళ్ళుం డవు!
జెరూసలెం దేవుడు, ‘మామూలుగా మీరు మేఘమథనాలు చేయించి కోట్లు నొల్లుకోండి, వర్షాల సంగతి నేను చూసుకుంటాను’ అన్నట్టున్నాడు!
అయినా, మళ్ళీ అదే గవర్నమెంటులని యెన్నుకున్న మన తలరాతల్ని తప్పించడానికి ఆ జెరూసలెం దేవుడికైనా సాధ్యమా!
సరే, సంవత్సరంపొడుగునా వేసవి కాలంతోపాటు పవర్ కట్లనీ భరిద్దాం!
కట్రాక్షసుడికీ—ఝై!