Monday, May 25, 2009

‘కొత్తావకా……’

……..య’ కాదండోయ్! కొత్తావకాశాలు!

మళ్ళీ రాశ్శేఖర్రెడ్డి మంత్రివర్గం కొలువు తీరింది—20 కొత్త ముఖాలతో!
(యెంతసేపూ పాతవాళ్ళకేనా అవకాశాలు—కొత్తవాళ్ళకి వద్దా—దోచుకోడానికి?)
జానారెడ్డిని ‘సం య మ మనం’ పాటించమన్నాడు!

జేసీని “నువ్వు స్టేట్ రౌడీ గానే వుండు—మంత్రివై, మీ తమ్ముడి తరఫున యే ఆర్టీవోనో ‘మంగల్నాకొడకా’ అంటే మళ్ళీ నేను కమిటీలు వెయ్యలేక చావాలి!” అన్నాడు!

పొన్నాలెలాగా ‘జల’సమాధి అయిపోయాడు!

ఇక రోశయ్య మచ్చలేని కోమటి! లెఖ్ఖలన్నీ ఆయనకే తెలుసుమరి!

ఇక కొత్త మంత్రులని గురించి భవిష్యత్తులోనే తెలియాలి!

భూతం లో మన బొచ్చె చేపలు పట్టుకొనే బొచ్చె అనే ఇంటిపేరు వున్న (బ్రాహ్మణ వ్యాకరణం లో ‘బొత్స’ అయిపోయిన) సత్యనారాయణ—తనకి ‘ఇన్ని’ కోట్ల ఆస్తులు వున్నాయని తన నామినేషన్ తో సమర్పించిన అఫిడవిట్ లోనే పేర్కొన్నాడు—యెలా సంపాదించావని మన రాజ్యాంగం అడగదు!

కొత్తమంత్రులారా! ‘బొత్సాదృష్ట ప్రాప్తిరస్తు!’

సవరణ : కౌంటింగులో పొన్నాల వెనకబడి వున్నాడు--అని టీవీల్లో చూసి, 'ఆయన జలసమాధి అయ్యాడు ' అన్నాను! మరి యే ఆఖరు రవుండు లోనో నెగ్గాడేమో! నిజానికి ఆయనక్కూడా మంత్రి పదవి దక్కిందిట!
మరి 'జల ' శాఖే ఇస్తారో లేదో చూడాలి! అదే శాఖ ఇస్తే మాత్రం--లొ గుట్టు పెరుమాళ్ళూకెరుక!
అదీ సంగతి!

Sunday, May 17, 2009

అనుకున్నదే....

……….అయ్యింది! టోపీలోంచి పిల్లి బయటికి వచ్చింది!

కేంద్రం లో కాంగ్రెస్ కి చక్కని మెజారిటీ వచ్చింది!
రాష్ట్రం లో కూడా, చక్కని మెజారిటీ వచ్చింది!
కాంగ్రెస్ ప్రభుత్వాలు యేర్పడడం తథ్యం!

ఈ తతంగమంతా తెలియబరచింది యేమిటి?

మహా మహా పండితులు సైతం, సామాన్య వోటరు మనసులో యేముందో ఊహించడం లో ఘోరం గా విఫలమయ్యారని!

ఇది కేవలం వ్యతిరేక వోటు అని!

ప్రభుత్వానికి కాదు—ప్రతిపక్షులకి!

1977 నాటి పరిస్థితుల్లోనే దేశం వుంది అని!

అప్పుడు మహానుభావుడు జయప్రకాష్ నారాయణ్ వున్నాడు. ప్రతిపక్షులందరినీ ఒకే తాటి మీదకి తెచ్చాడు! గాంధీ సమాధి వద్ద ప్రమాణం చేయించాడు!

సామాన్యుదు వారికి అధికారం కట్టబెట్టాడు!

(అది వాళ్ళు—ఒళ్ళు కొవ్వెక్కి నిలబెట్టుకోలేక పోయారన్నది వేరే సంగతి!)

మరి ఇప్పుడు?

సామాన్యుడెంత సణుక్కున్నా, ప్రత్యామ్నాయన్ని చూపించగల నాయకుడు లేడు!

అందుకే, తెలియని దేవతకన్నా, తెలిసున్న రాక్షసి మేలు అనుకొని, మళ్ళీ కాంగ్రెస్ నే ‘యెక్కుకున్నాడు’

‘………..ప్రజాస్వామ్యం గతి ఇంతే………’ అంటూ పాడుకుంటున్నాడు సామాన్యుడు!

ఇదంతా మా నిర్వాకమే అని చంకలు గుద్దుకుంటున్నారు—సోనియా, రాశ్శేఖర్రెడ్డీ!

దేవుడు రక్షించుగాక!

Saturday, May 2, 2009

యెన్నికలా మజాకా!

‘…..234 అ, 36 పా…!

నిద్దర్లో కూడా అదే పాట! మన వై యెస్!

ఈ అంకెల సంగతేమో గానీ, వీళ్ళ భవిష్యత్తుని బ్యాలెట్ పెట్టెల్లో భద్రపరిచాడు సామాన్యుడు!
దేశం లో మూడో విడత కూడా పూర్తయింది.

ఇక ఇంకో విడతా, రేపు 16న ఫలితాల ప్రకటనా మిగిలాయి!

నందో రాజా భవిష్యతి!

ఆ నందుడు ఆనందుడవుతాడో, సునందుడవుతాడో, నిత్యానందుడవుతాడో……చూడాలి!

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ‘హంగ్’ఏ అంటున్నారు కొందరు పండితులు!

యేదైనా, సామాన్యుడికి కాస్త యెక్కువ ఊరట కలిగితే యెంత బాగుండును!

చూద్దాం!