Wednesday, January 28, 2009

ఆషాఢభూతులు

ఇవాళ (28-01-2009) మన పాకిస్థాన్ నిపుణ కాలమిస్ట్ యేమన్నాడో చూశారా?

“…..పాక్ చర్యలు తీసుకోవాలి. పాక్ ఎన్ని దురాగతాలకు పాల్పడినా తప్పించుకు పోగలుగుతోందంటూ భారత్ లో పాక్ పై నెలకొన్న అభిప్రాయాన్ని మార్చడానికి ఆ తరహా చర్యలు దోహదపదతాయి. ఆందుకు భిన్నం గా పాకిస్థాన్ గతం లో మాదిరే మళ్ళీ తూతూమంత్రం గా దర్యాప్తు జరిపిస్తే, ఆ దేశం పట్ల భారత్ కుగల అపనమ్మకం మరింత పెరిగిపోతుంది. ఉభయ దేశాల మధ్య సంఘర్షణలు ఉండకపోవచ్చు అలాగని, శాంతియుత వాతావరణమూ ఉండదు. ఇరుదేశాలూ పరస్పరం కత్తులు దూసుకోకపోవచ్చు అలాగని, రెండు దేశాల నడుమ సామరస్యపూరిత వాతావరణమూ నెలకొనదు. అటువంటి పరిస్థితి ఉత్పన్నం కావడం ఇటు ఇండియాకూ మంచిది కాదు, అటు పాకిస్థాన్ కూ మంచిది కాదు.” (ఒత్తి పలికింది నేను మాత్రమే—మన నిపుణ మిత్రుడు కాదు!)

ధ్వని యేమని వినబడుతోంది? తూతూమంత్రం చేస్తే చాలని పాక్ కి సూచిస్తున్నట్టు లేదూ? రెండు దేశాలకీ మంచిదికాదు (ముఖ్యంగా భారత్ కి మంచిది కాదు) కాబట్టి, భారత్ నోరు మూసుకు కూర్చోవాలని ఉపదేశం కాదూ?

అసలు గుండె రగిలి పోతూ వుంటే, ‘శాంతియుత’ ‘సామరస్య’ వాతావరణం కోసం భారత్ లో యెవడు యేడుస్తున్నాడండీ? (ఒక్క కాంగీరేసులు తప్ప)

ఒకసారి ‘సమాచారం మాత్రమే’ ఇచ్చారు అనీ, ఇంకోసారి మా దర్యాప్తుకి ‘ఆధారాలు’ ఇచ్చారు అనీ, ‘సాక్ష్యాలు’ యేమీ మాకు అందలేదు అనీ—భారత్ ఇచ్చిన సాక్ష్యాల గురించి మాట్లాడేవాడిది నాలుకా? తాటి పట్టా?

వీళ్ళతో సామరస్యం యేమిటి?

వాడెవరో అన్నట్టు, భారత ప్రజలందరూ పాకిస్థాన్ వైపు తిరిగి గట్టిగా ఖాండ్రించి ఉమ్మేస్తే, దక్షిణ పాకిస్థాన్ అంతా అరేబియాసముద్రంలో కలిసి పోదూ?

ఆణు బూచిని చూపిస్తారా? కమాన్! 'మొదటి ప్రయోగం మేము చెయ్యం' అనే ఒట్టు తీసి ఒక్క నిమిషం గట్టున పెడదాం! ఇంకా వాళ్ళకి చాన్స్ వుంది అంటారా, ఓకే! మా జనభా తగ్గడానికి కూడా మాకు సమ్మతమే! మా దేశం ఓ ఇరవయ్యేళ్ళు--కాదు కాదు అరవై రెండేళ్ళు వెనక్కి వెళ్ళినా, పక్కలో బళ్ళేలు లేకుండా వుండడం మాకు సమ్మతమే--అని మనం అంటే?

ఇదిగో—ఇలాంటివాళ్ళ గురించే శ్రీ సూర్య ప్రకాష్ వ్రాసింది!

ఇలాంటివాళ్ళని దేశ సరిహద్దులవరకూ తరిమి కొడితే తప్ప………!

No comments: